సాక్షి, ప్రకాశం: సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రాధ హత్య కేసు ఊహించని మలుపు తిరిగింది. పోలీసుల అనుమానం రాధ భర్త మోహన్‌రెడ్డిపైకి మళ్లింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి పోలీసులు విచారిస్తున్నారు.
స్నేహితుడు కాశిరెడ్డికి రాధ దంపతులు రూ.80 లక్షలు అప్పు ఇచ్చారు. అయితే కాశిరెడ్డి తిరిగి డబ్బు ఇవ్వకపోవడంతో ఆ భార్యాభర్తల నడుమ విభేదాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇద్దరూ విడిపోయేదాకా వెళ్లారని పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉండగా.. రాధ పేరు మీద భారీ(కోటిన్నర రూపాయలు) ఇన్సూరెన్స్ ఒకటి ఉందని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో అన్ని కలుపుకుని పక్కా ప్లాన్ ప్రకారమే భర్త ఈ హత్య చేయించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
ఇన్సూరెన్స్ సొమ్ముపై ఆశతో పాటు వివాహేతర సంబంధం కూడా రాధ హత్యకు కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో సీఎస్ పురం పోలీస్ స్టేషన్‌కు తరలించి.. మోహన్‌రెడ్డిని ప్రశ్నిస్తున్నారు పోలీసులు.
ప్రకాశం (Prakasam) జిల్లా వెలిగండ్ల మండలంలో జిల్లెళ్లపాడులో ఈ నెల 17వ తేదీన ఈ హత్య జరిగింది. రాధను హత్య చేయడానికి ఆర్థిక కారణాలా? లేదంటే ఇతర అంశాలేమైనా ముడిపడి ఉన్నాయా?.. ఇలా అన్ని కోణాల్లోనూ పోలీసులు కూపీ లాగుతున్నారు. ఆమెను హత్య చేసిందెవరు? చేయించింది ఎవరు? అనేది తేలాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment