
భార్యను రక్షించబోయి భర్త మృతి
ఖమ్మం (ఇల్లెందు) : ఖమ్మం జిల్లా ఇల్లెందు మండలం మోదుగులగూడెంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. మోదుగులగూడెం గ్రామానికి చెందిన శశిరేఖ తన ఇంటి ఆవరణలో బట్టలను ఆరవేస్తుండగా ప్రమాదవశాత్తూ కరెంట్ షాక్‌కు గురైంది. ఇది చూసిన శశిరేఖ భర్త పగిడిపల్లి రాజు(50) భార్యను రక్షించబోయి ఆమెను పట్టుకుని లాగాడు. దీంతో అతనికి కూడా కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మరణించాడు. ఈ ప్రమాదంలో భార్యకు తీవ్రగాయాలయ్యాయి. బట్టలు ఆరవేసే తీగకు కరెంట్ సరఫరా జరగడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.