అనుమానం పెనుభూతమై.. | Wife Injured suspected husband in Sitaram Puram | Sakshi
Sakshi News home page

అనుమానం పెనుభూతమై..

Published Mon, Jun 2 2014 2:07 AM | Last Updated on Sat, Sep 2 2017 8:10 AM

అనుమానం పెనుభూతమై..

అనుమానం పెనుభూతమై..

సీతారాంపురం (పెన్‌పహాడ్), న్యూస్‌లైన్ :అనుమానం పెనుభూతమైంది.  తోడునీడగా ఉంటూ జీవితాంతం కాపాడుతానని ప్రమాణం చేసి వివాహమాడిన భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. ఆదమరచి నిద్రిస్తున్న వేళ కర్రతో మోది దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన శని వారం తెల్లవారుజామున పెనపహాడ్ మండల కేంద్రం సీతారాంపురం కాలనీ లో చోటు చేసుకుంది. బంధువులు, పోలీ సులు తెలిపిన వివరాలు... మోతె గ్రామానికి చెందిన షేక్ సుభాన్‌బీ (45)తో సీతారాంపురానికి చెందిన షేక్ సెదైల్లికి 30 ఏళ్ల క్రితం వివాహమైంది. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి కి ముగ్గురు కుమారులు, మనుమలు, మనవరాండ్లు కూడా ఉన్నారు.  భార్యపై అనుమానంతో షేక్‌సెదైల్లి కొన్నేళ్లుగా భార్యను చిత్రహింసలకు గురి చేస్తున్నాడు.
 
 అయితే శనివారం సెదైల్లి ఇంటికి బంధువులు వచ్చారు. వారంతా ఇంట్లో, సెదైల్లి, అతడి భార్య సుభాన్‌బీ ఆరుబయట నిద్రిస్తున్నారు. అర్ధరాత్రి దా టిన తరువాత సెదైల్లి సెంట్రింగ్ కర్రతో భార్య తలపై బలంగా మోది పరారయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర గాయాలపాలైన సుభాన్‌బీని 108 వాహనంలో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తీసుకువెళ్లగా సుభాన్‌బీ చికిత్స పొందుతూ మృతిచెందింది. ఘటన స్థలాన్ని చివ్వెం ల ఎస్‌ఐ నర్సింహారావు పరిశీలించారు. మృతురాలి కుమారుడు నసీర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ ధారవత్ జానకిరాములు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement