రంగారెడ్డి జిల్లాలో దారుణం
గండేడ్, న్యూస్‌లైన్: ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకుంటానంటే నిరాకరించిందనే కోపంతో ఓ యువకుడు కన్నతల్లిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన మంగళవారం రంగారెడ్డి జిల్లా గండేడ్ మండలం మహమ్మదాబాద్‌లో జరిగింది. తాండూరుకు చెందిన ఫాతిమా(50) భర్త చనిపోవడంతో కుమారుడు చాంద్‌పాషాతో కలిసి మహమ్మదాబాద్‌లో నివాసం ఉంటోంది. వీరిద్దరూ ఓ కాటన్‌మిల్లులో పనిచేస్తున్నారు. తాండూరుకు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని పెళ్లి చేసుకోవాలని చాంద్‌పాషాకు ఫాతిమా సూచించింది. అందుకు నిరాకరించిన అతడు.. ఓ అమ్మాయిని ప్రేమించానని, ఆమెనే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టాడు. ఈ విషయమై సోమవారం ఘర్షణ జరగ్గా ఆవేశానికి లోనైన పాషా.. తల్లిని హత్య చేశాడు. నిందితుడిని పోలీసులు అదులోకి తీసుకున్నారు.
ప్రేమ పెళ్లి వద్దన్నందుకు.. తల్లిని కడతేర్చిన తనయుడు
Published Wed, Oct 23 2013 3:58 AM | Last Updated on Fri, Sep 1 2017 11:52 PM
Advertisement
Advertisement