
సాక్షి, వికారాబాద్: జిల్లాలో మంగళవారం దారుణం చోటు చేసుకుంది. ఓ ప్రబుద్దుడు కన్న తల్లినే పొట్టనబెట్టుకున్నాడు. ఈ ఘటన బంట్వరం మండలంలోని రోంపల్లి గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. కొడుకు మస్తాన్ తన తల్లి మహబూబ(58) గొడవ పడ్డారు. కోపంతో రగిలిపోయిన మస్తాన్ కూరగాయలు తరిగే కత్తితో తల్లిపై దాడి చేశాడు. దీంతో అరుస్తూ రోడ్డు మీదికి వచ్చిన తల్లి మహబూబను స్థానికులు తాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మహబూబ మరణించిందని డాక్టర్లు వెల్లడించారు. మృతదేహానికి పోస్టుమార్టం చేసి పోలీసులు మస్తాన్‌పై కేసు నమోదు చేశారు. ఈ హత్యపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా తల్లిని హత్య చేసిన నిందితుడు మస్తాన్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment