
అబిడ్స్: చిన్నారుల దుస్తులు ఊడదీసి వారిని తీవ్రంగా కొట్టిన సంఘటన మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అల్లాబండ గుట్టపై చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు ముగ్గురిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇన్‌స్పెక్టర్ రవి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గత నెల 29న అల్లాబండ్డ పరిసర ప్రాంతాలకు చెందిన బాలలు కొందరు పేకాట ఆడుతున్నారు.
దీనిని గుర్తించిన హరికిరణ్, అమోస్, రాహుల్ అనే యువకులు పేకాట ఆడుతున్న 10 మంది పిల్లల దుస్తులు ఊడదీసి బెదిరించడమేగాక, కర్రలతో బాదారు. దీనిని గుర్తు తెలియని వ్యక్తి వీడియో తీసి మంగళవారం సోషల్ మీడియా పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. దీనిపై సమాచారం అందడంతో మంగళ్‌హాట్ పోలీసులు బాధిత చిన్నారుల ఇంటికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. 6మంది పిల్లల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో హరికిరణ్, అమోస్, రాహుల్‌లపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment