యువకుడి సూసైడ్‌: ప్రేయసి చిత్రం గుండెలపై.. | Young Man Takes Life Over Love Affair | Sakshi
Sakshi News home page

యువకుడి సూసైడ్‌: ప్రేయసి చిత్రం గుండెలపై..

Dec 14 2020 6:39 PM | Updated on Dec 14 2020 7:47 PM

Young Man Takes Life Over Love Affair - Sakshi

రిచయమైన నాటినుంచి వంశీ ఆమెను ప్రేమించసాగాడు. ఆమె చిత్రాన్ని తన గుండెలపై...

సాక్షి, హైదరాబాద్‌ : ప్రేమించిన యువతితో గొడవ కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడో యువకుడు. ఈ సంఘటన అల్వాల్‌లో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చిలకలగూడాకు చెందిన వంశీకృష్ణకు అల్వాల్‌కు చెందిన ప్రవళికతో కొన్ని నెలల క్రితం ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. ప్రవళిక సికింద్రాబాద్‌లోని ఎస్ బ్యాంకులో పని చేస్తుండగా.. వంశీ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఫేస్‌బుక్‌లో‌ పరిచయమైన నాటినుంచి వంశీ ఆమెను ప్రేమించసాగాడు. ఆమె చిత్రాన్ని తన గుండెలపై పచ్చబొట్టు వేయించుకున్నాడు. ( మన్యంలో మావోయిస్టుల ఘాతుకం)

అయితే ఆదివారం ఇద్దరి మధ్యా గొడవ చోటుచేసుకుంది. దీంతో మనస్తాపానికి గురైన వంశీ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. నిన్న రాత్రి బాలాజీనగర్‌లోని స్నేహితులతో గడిపి ఇంటికి వచ్చేశాడు. ఈ ఉదయం విధులకు వెళుతున్నానని ఇంట్లో చెప్పి భూదేవీ నగర్‌ రైల్వే ట్రాక్‌ వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement