చికిత్స పొందుతున్న సాయి ప్రసన్న
సాక్షి, మందమర్రి: ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించాడని ప్రియురాలు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఆదివారం మందమర్రిలో చోటు చేసుకుంది. ప్రియుడిపై అమ్మాయి తరుఫున వారు దాడికి పాల్పడ్డారనే ఆరోపణపై ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు. ఎస్సై భూమేష్ తెలిపిన వివరాల ప్రకారం... మందమర్రికి చెందిన సాయిప్రసన్న భూపాలపల్లి జిల్లా కాటారం మండలం చిడ్నాపల్లికి చెందిన సాగర్ ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని సాయిప్రసన్న అడుగడంతో సాగర్ నిరాకరించాడు. దీంతో మందమర్రి పోలీస్‌స్టేషన్‌లో రెండ్రోజుల క్రితం అమ్మాయి బంధువులు ఫిర్యాదు చేశారు.
పోలీసులు ఇరువురిని పిలిపించగా వారు పెద్దల సమక్షంలో మాట్లాడుకుంటామని తెలిపారు. ఈ క్రమంలో సాయంత్రం కావడంతో పంచాయతీని మరో రోజుకు వాయిదా వేశారు. దీంతో మనస్తాపానికి గురైన సాయిప్రసన్న కిరోసిన్ వంటిపై పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే స్థానికులు అడ్డుకుని సింగరేణి ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అబ్బాయిపై అమ్మాయి తరుఫు వారు దాడి చేశారని ఫిర్యాదు చేయగా ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment