యువకుడి ఆత్మహత్య | Suicide of a young man | Sakshi

యువకుడి ఆత్మహత్య

Apr 10 2018 1:32 PM | Updated on Aug 1 2018 2:35 PM

Suicide of a young man - Sakshi

మణికంఠ మృతదేహం 

పరవాడ(పెందుర్తి): ప్రేమ విఫలమైందన్న కారణంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన దేశపాత్రునిపాలెం గ్రామంలో సోమవారం చోటుచేసుకొంది. పరవాడ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మాని మణికంఠ (21) అదే గ్రామానికి ఓ యువతిని ప్రేమించాడు. 

తను ప్రేమించిన యువతిని వేరొకరికిచ్చి వివాహం చేయడానికి ఆమె తల్లిదండ్రులు నిశ్చయించారు. ప్రేమ విఫలమైన కారణంగా విరక్తి చెందిన మణికంఠ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరిపోసుకొని మృతి చెందాడు.

సోమవారం ఉదయం తన తల్లి కనకలక్ష్మి విధులకు వెళ్లిన తరువాత మణికంఠ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లి ఫ్యాన్‌కు వేలాడుతున్న కొడుకును చూసి కన్నీరుమున్నీరుగా విలపించింది.

సమాచారం అందుకున్న పరవాడ సీఐ బి.సీహెచ్‌.స్వామినాయుడు, ఎస్‌ఐ జి.వెంకటరావులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహన్ని పోస్టుమార్టం కోసం అనకాపల్లి వంద పడకల ఆస్పత్రికి తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement