మాట్లాడుకుందామని యువతిని లాడ్జికి రమ్మన్నాడు.. ఆ తర్వాత.. | Boy Attack On Girl At Lodge In Visakhapatnam | Sakshi
Sakshi News home page

మాట్లాడుకుందామని యువతిని లాడ్జికి రమ్మన్నాడు.. ఆ తర్వాత..

Published Sun, Nov 14 2021 9:50 AM | Last Updated on Sun, Nov 14 2021 9:50 AM

Boy Attack On Girl At Lodge In Visakhapatnam - Sakshi

ప్రతీకాత్మ‍క చిత్రం

సాక్షి, విశాఖపట్నం: ఒక యువతిపై ప్రేమోన్మాది దాడి చేసిన ఘటన విశాఖ పట్నంలో కలకలంగా మారింది. హర్షవర్ధన్‌ రెడ్డి అనే యువకుడు.. యువతిని మాట్లాడేందుకు రమ్మని లాడ్జికి రమ్మన్నాడు. ఈ క్రమంలో లాడ్జికి చేరుకున్న యువతిపై.. పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. తన ప్రేమను నిరాకరించినందుకే హర్షవర్ధన్‌ రెడ్డి  దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన విశాఖలోని శ్రీ రాఘవేంద్ర లాడ్జిలో  నిన్న సాయంత్రం జరిగింది. 

హన్మకొండకు చెందిన యువకుడు హర్షవర్ధన్‌ రెడ్డి, విశాఖకు చెందిన సదరు యువతి పంజాబ్‌లో ఇంజనీరింగ్‌ పూర్తిచేశారు. ఈ క్రమంలో యువకుడు నిన్న యువతిని లాడ్జికి రమ్మన్నాడు. వారి మధ్య గొడవ సంభవించినట్లు తెలుస్తోంది. దీంతో యువకుడు యువతిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత అతను ఆత్మహత్యకు ప్రయత్నించాడు. 

లాడ్జిరూమ్‌ నుంచి పొగలు రావడంతో.. సిబ్బంది మంటలను ఆర్పేశారు. పోలీసులకు సమాచారం అందించి.. గాయపడిన ఇద్దరిని విశాఖలోని కింగ్‌ జార్జ్‌ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement