మూగ బాలికపై అత్యాచారం | Molestation On Mute Girl In Visakhapatnam | Sakshi
Sakshi News home page

మూగ బాలికపై అత్యాచారం

Oct 5 2018 8:09 AM | Updated on Oct 8 2018 12:52 PM

Molestation On Mute Girl In Visakhapatnam - Sakshi

లక్ష్మీనగర్‌లో స్థానికులను విచారిస్తున్న సీఐ పైడియ్య

అభంశుభం తెలియని మూగ బాలిక పట్ల ఓ వ్యక్తి మృగంలా వ్యవహరించాడు.

గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): అభంశుభం తెలియని మూగ బాలిక పట్ల ఓ వ్యక్తి మృగంలా వ్యవహరించాడు. బాలిక తల్లి కూలికెళ్లిన సమయంలో ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. స్థానికులు గమనించడంతో విషయం బయటకుపొక్కింది. గోపాలపట్నం పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. ఇక్కడి లక్ష్మీనగర్‌ ఎఫ్‌ బ్లాకులో ఉంటున్న ఓ నిరుపేద మహిళకు ఒక్కగానొక్క కుమార్తె. ఆ బాలికకు మాటలు రావు. తల్లి కూలికెళ్లి కుమార్తెని పోషిస్తోంది.

గురువారం ఉదయం కూడా ఆ తల్లి కూలికెళ్లడంతో బాలిక ఒంటరిగా ఉంది. మధ్యాహ్నం అక్కునాయుడు (55) అనే వ్యక్తి ఆ ఇంట్లోకి ప్రవేశించి తలుపులేసేశాడు. కొద్దిసేపటి తర్వాత అతడు బయటకు రావడంతో ఇరుగుపొరుగువారు అనుమానించారు. విషయాన్ని బాలిక తల్లికి చెప్పి గురువారం సాయంత్రం గోపాలపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ పైడియ్య, ఎస్‌ఐలు తమ్మినాయుడు, శ్రీనివాస్‌ సిబ్బందితో విచారణ జరిపి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement