Mute
-
వాట్సాప్ లో అందుబాటులోకి సరికొత్త ఫీచర్
మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటి వరకు వీడియోను షేర్ చేసేటప్పుడు దాని వాయిస్‌ను నిలిపివేసే అవకాశం ఉండేది కాదు. అభ్యంతర కరమైన వ్యాఖ్యలు, అసహ్యమైన మాటలు ఉంటే చాలామంది ఇబ్బంది పడేవారు. ఇప్పుడు ఈ కొత్త వెర్షన్లో మ్యూట్ వీడియో సౌకర్యాన్ని వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని వల్ల అనవసరమైన ఆడియోను తీసేసి సంబంధిత వీడియోను మాత్రమే పంపుకునే అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్ ను చాలా సులువుగా ఉపయోగించవచ్చు. మీరు స్టేటస్ లో షేర్ చేయాలనీ అనుకున్న వీడియోను ఎంచుకొన్నపుడు దానికింద సౌండ్ సింబల్ కనిపిస్తుంది. దానిని సింపుల్‌గా మ్యూట్ చేసేస్తే రిసీవ్ చేసుకునే వారికి ఎలాంటి ఆడియో లేకుండా వీడియో వెళ్లిపోతుంది. ఇప్పటికే కొంతమంది వాట్సాప్ యూజర్లకు అప్డేషన్ కూడా వచ్చేసింది. మీకు కనుక ఈ ఫీచర్ రాకపోతే ఒకసారి మీ వాట్సాప్ అప్డేట్ చేసుకోండి. అలాగే కొత్తగా తీసుకురానున్న ప్రైవసీ పాలసీపై కూడా వాట్సాప్ బృందం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. చదవండి: వన్‌ప్లస్ నార్డ్ కు ఆండ్రాయిడ్ 11 అప్డేట్ ఏప్రిల్ 1 నుంచి కొత్త పీఎఫ్ రూల్స్! -
వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్..
సాక్షి, న్యూఢిల్లీ: ఫేస్ బుక్ సారధ్యంలోని మెసేజింగ్ యాప్ వాట్సాప్ కీలక ఫీచర్‌ను తీసుకొచ్చింది. గ్రూపు చాట్స్, అలర్ట్స్ తో విసిగిపోయిన యూజర్లుకు కొత్త అప్ డేట్ అందించింది. వాట్సాప్‌లోని గ్రూప్ చాట్లను ఆల్వేస్ మ్యూట్ అనే ఆప్షన్ తోఎప్పటికీ మ్యూట్ చేసే ఫీచర్‌ను తాజాగా అందుబాటులోకి తెచ్చింది. ఈ విషయాన్ని వాట్సాప్ తన అధికారిక ట్విటర్ లో వెల్లడించింది. చాట్‌ను ఎప్పటికీ మ్యూట్ చేయవచ్చని ట్వీట్ చేసింది. వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నఈ ఫీచర్‌ను చివరకు లాంచ్ చేసింది. ఐఫోన్, ఆండ్రాయిడ్ వినియోగదారులకు కూడా ఇది అందుబాటులో ఉంది. ఈ క్రొత్త ఫీచర్ ప్రజలు ఆ ఇబ్బందికరమైన వాట్సాప్ గ్రూపులనుంచి ఎప్పటికీ ఇబ్బంది లేకుండా ఉండటానికి ఇదిసహాయపడుతుంది. చాట్‌ను మ్యూట్ చేస్తే సంబంధిత గ్రూపులనుంచి నోటిఫికేషన్ రాదు. సందేశాలు, చిత్రాలు లేదా వీడియోలు, ఇతర ఏ ఫీడ్ ఇబ్బంది పెట్టదు. అంతేకాదు. అవసరమైతే దీన్ని అన్‌మ్యూటింగ్ అవకాశం కూడా ఉంది. ఇప్పటివరకు ఈ సదుపాయం ఎనిమిది గంటలు, ఒక వారం, ఒక సంవత్సరం పాటు మ్యూట్ చేయడానికి అనుమతి ఉన్న సంగతి తెలిసిందే. You can now mute a chat forever 🤫 pic.twitter.com/DlH7jAt6P8 — WhatsApp Inc. (@WhatsApp) October 23, 2020 -
మూగ బాలికపై అత్యాచారం
గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): అభంశుభం తెలియని మూగ బాలిక పట్ల ఓ వ్యక్తి మృగంలా వ్యవహరించాడు. బాలిక తల్లి కూలికెళ్లిన సమయంలో ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. స్థానికులు గమనించడంతో విషయం బయటకుపొక్కింది. గోపాలపట్నం పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. ఇక్కడి లక్ష్మీనగర్ ఎఫ్ బ్లాకులో ఉంటున్న ఓ నిరుపేద మహిళకు ఒక్కగానొక్క కుమార్తె. ఆ బాలికకు మాటలు రావు. తల్లి కూలికెళ్లి కుమార్తెని పోషిస్తోంది. గురువారం ఉదయం కూడా ఆ తల్లి కూలికెళ్లడంతో బాలిక ఒంటరిగా ఉంది. మధ్యాహ్నం అక్కునాయుడు (55) అనే వ్యక్తి ఆ ఇంట్లోకి ప్రవేశించి తలుపులేసేశాడు. కొద్దిసేపటి తర్వాత అతడు బయటకు రావడంతో ఇరుగుపొరుగువారు అనుమానించారు. విషయాన్ని బాలిక తల్లికి చెప్పి గురువారం సాయంత్రం గోపాలపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ పైడియ్య, ఎస్ఐలు తమ్మినాయుడు, శ్రీనివాస్ సిబ్బందితో విచారణ జరిపి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. -
ఫేస్బుక్లో మరో అద్భుతమైన ఫీచర్
వాషింగ్టన్ : సోషల్ మీడియాలో కొందరు అందరికీ ఉపయోగపడే విషయాలు పోస్ట్ చేస్తుండగా, మరికొందరు తమకు గిట్టనివారిని లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన సందేశాలు, వీడియోలు అప్లోడ్ చేస్తుంటారు. ఇటీవలి కాలంలో ఫేస్బుక్లో కొన్ని గ్రూపుల నుంచి వచ్చే పోస్టులు చాలా మంది యూజర్లకు చికాకు తెప్పించేలా ఉంటున్నాయి. అయితే అలాంటి పోస్టులను మనం ఎంతమాత్రం భరించాల్సిన పనిలేదు. ఇందుకోసం ఫేస్బుక్ ఓ అద్భుతమైన ఫీచర్‌ను తీసుకురానున్నట్లు సంస్థ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ఇతరులకు చికాకు కలిగించే, అసభ్యకరమైన పోస్టులు పెట్టే వ్యక్తిగత ఖాతాలతో పాటు గ్రూప్ ఎఫ్బీ ఖాతాల పోస్టులను 24 గంటలు, వారం రోజులు లేదా నెల రోజుల పాటు కనిపించకుండా చేసే ఆప్షన్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ మ్యూట్ ఫీచర్ ప్రకారం.. అలాంటి ఖాతాలను అన్‌ఫాలో చేయడం, లేదా స్నూజ్ చేయడం వల్ల మనం వద్దనుకున్న గ్రూపులు లేదా వ్యక్తిగత ఖాతాల నుంచి మనకు ఎలాంటి అప్డేట్స్ రావు. 2012లో తీసుకొచ్చిన అన్‌ఫాలో తర్వాత అదే తరహాలో ఫేస్బుక్ ప్రవేశపెట్టనున్న ఫీచర్‌గా మ్యూట్ లేదా స్నూజ్ను పేర్కొనవచ్చు. టెస్టింగ్ దశలో ఉన్న ఫీచర్‌కు కోడింగ్ పూర్తిచేసి త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని సీఈవో మార్క్ జూకర్బర్గ్ ఓ ప్రకటనలో వెల్లడించారు. -
మూగ, చెవిటి పాత్రలో స్టార్ హీరోయిన్
ప్రస్తుతం స్టార్ హీరోయిన్లందరూ లేడీ ఓరియంటెడ్ సినిమాల మీద దృష్టిపెడుతున్నారు. అలా కుదరని పక్షంలో ఉన్నంతలో తమ పాత్రతో నటిగా ప్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అనుష్క, నయనతార లాంటి స్టార్ హీరోయిన్స్ పర్ఫామెన్స్ ఓరియంటెడ్ రోల్స్‌లో సక్సెస్ సాధించగా మిల్కీ బ్యూటీ తమన్నా కూడా అదే ప్రయత్నాల్లో ఉంది. సౌత్ ఇండస్ట్రీలో గ్లామర్ హీరోయిన్గా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న తమన్నా ఇప్పుడు నటిగా ప్రూవ్ చేసుకోవాలని తాపత్రేయపడుతోంది. అందుకే అభినేత్రి సినిమాలో డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కానీ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోవటంతో తమన్నా కష్టం వృథా అయ్యింది. అయితే తాజాగా మరో ఛాలెంజిగ్ రోల్‌కు ఓకె చెప్పింది ఈ హాట్ బ్యూటీ. ప్రస్తుతం బాహుబలి 2 ప్రమోషన్లో బిజీగా ఉన్న తమన్నా, ఈ పనులన్ని పూర్తయ్యాక, బాలీవుడ్ దర్శకుడు వసు భగ్నాని నిర్మాణంలో ఓ సినిమా చేయనుంది. ఈ సినిమాలో తమన్నా మూగ, చెవిటి అమ్మాయిగా నటిస్తుందట. ఈ సినిమాతో నటిగా తాను అనుకున్న ఇమేజ్ వస్తుందన్న నమ్మకంతో ఉంది తమ్ము. అంతేకాదు మరోసారి ప్రభుదేవా దర్శకత్వంలో నటించేందుకు అంగీకరించానన్న తమన్నా, ఆ సినిమాతో తన క్యారెక్టర్ అభిమానులకు షాక్ ఇస్తుందని తెలిపింది.