ఫేస్‌బుక్‌లో మరో అద్భుతమైన ఫీచర్
వాషింగ్టన్ : సోషల్ మీడియాలో కొందరు అందరికీ ఉపయోగపడే విషయాలు పోస్ట్ చేస్తుండగా, మరికొందరు తమకు గిట్టనివారిని లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన సందేశాలు, వీడియోలు అప్‌లోడ్ చేస్తుంటారు. ఇటీవలి కాలంలో ఫేస్‌బుక్‌లో కొన్ని గ్రూపుల నుంచి వచ్చే పోస్టులు చాలా మంది యూజర్లకు చికాకు తెప్పించేలా ఉంటున్నాయి. అయితే అలాంటి పోస్టులను మనం ఎంతమాత్రం భరించాల్సిన పనిలేదు. ఇందుకోసం ఫేస్‌బుక్ ఓ అద్భుతమైన ఫీచర్‌ను తీసుకురానున్నట్లు సంస్థ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.
ఇతరులకు చికాకు కలిగించే, అసభ్యకరమైన పోస్టులు పెట్టే వ్యక్తిగత ఖాతాలతో పాటు గ్రూప్ ఎఫ్‌బీ ఖాతాల పోస్టులను 24 గంటలు, వారం రోజులు లేదా నెల రోజుల పాటు కనిపించకుండా చేసే ఆప్షన్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ మ్యూట్ ఫీచర్ ప్రకారం.. అలాంటి ఖాతాలను అన్‌ఫాలో చేయడం, లేదా స్నూజ్ చేయడం వల్ల మనం వద్దనుకున్న గ్రూపులు లేదా వ్యక్తిగత ఖాతాల నుంచి మనకు ఎలాంటి అప్‌డేట్స్ రావు. 2012లో తీసుకొచ్చిన అన్‌ఫాలో తర్వాత అదే తరహాలో ఫేస్‌బుక్ ప్రవేశపెట్టనున్న ఫీచర్‌గా మ్యూట్ లేదా స్నూజ్‌ను పేర్కొనవచ్చు. టెస్టింగ్ దశలో ఉన్న ఫీచర్‌కు కోడింగ్ పూర్తిచేసి త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని సీఈవో మార్క్ జూకర్‌బర్గ్ ఓ ప్రకటనలో వెల్లడించారు.