snooze
-
బైడెన్ ప్రమాణ స్వీకారం.. క్లింటన్ కునికిపాట్లు
వాషింగ్టన్: అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఇక బైడెన్‌తో పాటు అమెరికా 49వ ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ప్రమాణ స్వీకారం చేశారు. రెండు వారాల క్రితం ట్రంప్ మద్దతుదారులు దాడి చేసిన క్యాపిటల్ భవనంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్.. బైడెన్‌తో దేశ నూతన అధ్యక్షుడిగా ప్రమాణం చేయించారు. అధ్యక్షుడుగా బైడెన్ ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు, దేశ 49వ ఉపాధ్యక్షురాలిగా మన తమిళనాడు మూలాలున్న ఇండో–ఆఫ్రో అమెరికన్ మహిళ కమలా హారిస్(56) ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో సుప్రీంకోర్టు న్యాయమూర్తి సోనియా సోటోమేయర్ ప్రమాణ స్వీకారం చేయించారు. (చదవండి: మళ్లీ వస్తా: డొనాల్డ్ ట్రంప్) ఇక బైడెన్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతుండగా.. వీటిలో ఒకటి మాత్రం నవ్వులు పూయిస్తోంది. ఈ ఫోటో మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కి సంబంధించినది. ఇక దీనిలో ఆయన కునికిపాట్లు పడుతున్నట్లు ఉంది. ప్రస్తుతం ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. భార్య హిల్లరీ క్లింటన్‌తో కలిసి బైడెన్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన బిల్ క్లింటన్ మాజీ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్, మాజీ అధ్యక్షుడు జార్జి డబ్లూ.బుష్ వెనక వరుసలో కూర్చోని ఉన్నారు. ఇక ఈ ఫోటోపై నెటిజనులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వృద్ధుడు అయ్యాడు కదా.. పాపం వదిలేయండి’’.. ‘‘జో బైడెన్ ప్రభుత్వం కల్పించిన నమ్మకం ఇది. ఇక మనం బహిరంగా కార్యక్రమాల్లో ప్రశాంతంగా నిద్ర పోవచ్చు.. నా దిండు పంపిస్తాను’’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక డొనాల్డ్ ట్రంప్, బైడెన్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరుకాలేదు. (చదవండి: బైడెన్ టీం: మనకే అగ్ర తాంబులం) ఇక కార్యక్రమంలో లేడీ గాగా జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం 2017లో తొలి యువ కవయిత్రి పురస్కారాన్ని పొందిన అమండా గార్మన్.. తాను రాసిన ఒక కవితను చదివి వినిపించారు. ఆ తరువాత, నటి, గాయని జెన్నిఫర్ లోపెజ్ ఒక పాటను ఆలపించారు. -
ఫేస్బుక్లో కొత్త ఫీచర్..ఇలా చెక్ పెట్టొచ్చు!
శాన్ ఫ్రాన్సిస్కో: ప్రముఖ సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్బుక్ మరోఅద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. మన ఫ్రెండ్ లిస్ట్ లో ఉన్నవారిని శాశ్వతంగా అన్‌ఫాలో లేదా అన్ ఫ్రెండ్చేయాల్సి అవసరం లేకుండానే తాత్కాలికంగా అన్‌ఫ్రెండ్ చేసే వెసులుబాటును కల్పిస్తోంది. అంటే ఫేస్బుక్లో కొంతమందిని అన్‌ఫ్రెండ్ చేయకుండానే వారి పోస్టులను తాత్కాలికంగా అంటే 30రోజులపాటు నిరోధించే అవకాశం కల్పించే ‘స్నూజ్’ అప్షన్‌ను తీసుకొచ్చింది. ఈ విషయాన్ని ఫేస్బుక్ బ్లాగ్‌పోస్ట్‌లో వెల్లడించింది. ఫేస్బుక్లో మన స్నేహితులను, పేజీలను లేదా గ్రూపులను తాత్కాలింకంగా నియంత్రించేలా ఈ సరికొత్త అవకాశాన్ని అందిస్తోంది. అన్‌ఫాలో, హైడ్, రిపోర్ట్, సీ ఫస్ట్ తోపాటు స్నూజ్ అనే ఆప్షన్‌ను తీసుకొచ్చింది. ఈ స్నూజ్ అనే ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా ఆ సమయంలో మీ న్యూస్ఫీడ్లోని వ్యక్తులు, పేజీలు లేదా గ్రూపులు షేర్ చేసిన కంటెంట్‌ను మీరు మ్యూట్ చేసుకోవచ్చని ఫేస్బుక్ ప్రొడక్ట్ మేనేజర్ శృతి మురళీధరన్ తెలిపారు. తాజా ఫీచర్ ప్రకారం ఎవరి పోస్టులైనా మనకు తాత్కాలికంగా నచ్చకపోతే వారిని 30 రోజుల పాటు ఆపవేసే అవకాశాన్ని ఇపుడు కల్పిస్తోంది. అంటే ఫేస్బుక్న్యూస్ఫీడ్లో 30 రోజులు మనకు నచ్చని వారి పోస్టులు మన దృష్టికిరావు. ఈ గడువు అనంతరం 'తాత్కాలిక వ్యవధి' ముగిసే సమయానికి ఫేస్బుక్ మనకి నోటిషికేషన్ ఇస్తుంది. అనంతరం వారి పోస్టులు తిరిగి పొందాలనుకుంటే పునరుద్ధరించుకోవచ్చు లేదంటే మరో 30 రోజుల పాటు అదే ఆప్షన్ కొనసాగించవచ్చు. -
ఫేస్బుక్లో మరో అద్భుతమైన ఫీచర్
వాషింగ్టన్ : సోషల్ మీడియాలో కొందరు అందరికీ ఉపయోగపడే విషయాలు పోస్ట్ చేస్తుండగా, మరికొందరు తమకు గిట్టనివారిని లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన సందేశాలు, వీడియోలు అప్లోడ్ చేస్తుంటారు. ఇటీవలి కాలంలో ఫేస్బుక్లో కొన్ని గ్రూపుల నుంచి వచ్చే పోస్టులు చాలా మంది యూజర్లకు చికాకు తెప్పించేలా ఉంటున్నాయి. అయితే అలాంటి పోస్టులను మనం ఎంతమాత్రం భరించాల్సిన పనిలేదు. ఇందుకోసం ఫేస్బుక్ ఓ అద్భుతమైన ఫీచర్‌ను తీసుకురానున్నట్లు సంస్థ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ఇతరులకు చికాకు కలిగించే, అసభ్యకరమైన పోస్టులు పెట్టే వ్యక్తిగత ఖాతాలతో పాటు గ్రూప్ ఎఫ్బీ ఖాతాల పోస్టులను 24 గంటలు, వారం రోజులు లేదా నెల రోజుల పాటు కనిపించకుండా చేసే ఆప్షన్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ మ్యూట్ ఫీచర్ ప్రకారం.. అలాంటి ఖాతాలను అన్‌ఫాలో చేయడం, లేదా స్నూజ్ చేయడం వల్ల మనం వద్దనుకున్న గ్రూపులు లేదా వ్యక్తిగత ఖాతాల నుంచి మనకు ఎలాంటి అప్డేట్స్ రావు. 2012లో తీసుకొచ్చిన అన్‌ఫాలో తర్వాత అదే తరహాలో ఫేస్బుక్ ప్రవేశపెట్టనున్న ఫీచర్‌గా మ్యూట్ లేదా స్నూజ్ను పేర్కొనవచ్చు. టెస్టింగ్ దశలో ఉన్న ఫీచర్‌కు కోడింగ్ పూర్తిచేసి త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని సీఈవో మార్క్ జూకర్బర్గ్ ఓ ప్రకటనలో వెల్లడించారు.