![Facebook rolls out 'Snooze' to 'mute' friends - Sakshi](/styles/webp/s3/article_images/2017/12/16/facebook.jpg.webp?itok=OGvx0JSS)
శాన్ ఫ్రాన్సిస్కో: ప్రముఖ సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మరోఅద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. మన ఫ్రెండ్ లిస్ట్ లో ఉన్నవారిని శాశ్వతంగా అన్‌ఫాలో లేదా అన్ ఫ్రెండ్‌చేయాల్సి అవసరం లేకుండానే తాత్కాలికంగా అన్‌ఫ్రెండ్ చేసే వెసులుబాటును కల్పిస్తోంది. అంటే ఫేస్‌బుక్‌లో కొంతమందిని అన్‌ఫ్రెండ్ చేయకుండానే వారి పోస్టులను తాత్కాలికంగా అంటే 30రోజులపాటు నిరోధించే అవకాశం కల్పించే ‘స్నూజ్’ అప్షన్‌ను తీసుకొచ్చింది. ఈ విషయాన్ని ఫేస్‌బుక్ బ్లాగ్‌పోస్ట్‌లో వెల్లడించింది.
ఫేస్‌బుక్‌లో మన స్నేహితులను, పేజీలను లేదా గ్రూపులను తాత్కాలింకంగా నియంత్రించేలా ఈ సరికొత్త అవకాశాన్ని అందిస్తోంది. అన్‌ఫాలో, హైడ్, రిపోర్ట్, సీ ఫస్ట్ తోపాటు స్నూజ్ అనే ఆప్షన్‌ను తీసుకొచ్చింది. ఈ స్నూజ్ అనే ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా ఆ సమయంలో మీ న్యూస్‌ఫీడ్లోని వ్యక్తులు, పేజీలు లేదా గ్రూపులు షేర్ చేసిన కంటెంట్‌ను మీరు మ్యూట్ చేసుకోవచ్చని ఫేస్‌బుక్ ప్రొడక్ట్ మేనేజర్ శృతి మురళీధరన్ తెలిపారు.
తాజా ఫీచర్ ప్రకారం ఎవరి పోస్టులైనా మనకు తాత్కాలికంగా నచ్చకపోతే వారిని 30 రోజుల పాటు ఆపవేసే అవకాశాన్ని ఇపుడు కల్పిస్తోంది. అంటే ఫేస్‌బుక్‌న్యూస్‌ఫీడ్‌లో 30 రోజులు మనకు నచ్చని వారి పోస్టులు మన దృష్టికిరావు. ఈ గడువు అనంతరం 'తాత్కాలిక వ్యవధి' ముగిసే సమయానికి ఫేస్‌బుక్ మనకి నోటిషికేషన్ ఇస్తుంది. అనంతరం వారి పోస్టులు తిరిగి పొందాలనుకుంటే పునరుద్ధరించుకోవచ్చు లేదంటే మరో 30 రోజుల పాటు అదే ఆప్షన్ కొనసాగించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment