వారిద్దరి ప్రేమాయణం సోషల్‌మీడియాలో వైరల్‌ | SJ Surya And Priya Bhavani Shankar In Love | Sakshi
Sakshi News home page

వారిద్దరి ప్రేమాయణం సోషల్‌మీడియాలో వైరల్‌

Jan 19 2020 8:03 AM | Updated on Jan 19 2020 8:03 AM

SJ Surya And Priya Bhavani Shankar In Love - Sakshi

ఎస్‌జే.సూర్య, ప్రియభవానీశంకర్‌

నటుడు, దర్శకుడు ఎస్‌జే.సూర్య నటి ప్రియభవానీ శంకర్‌ని ప్రేమిస్తున్నట్లు, అయితే ఆమె ఆయన ప్రేమను తిరష్కరించినట్లు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ప్రసారం వైరల్‌ అవుతోంది. బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమైన నటి ప్రియాభవానీశంకర్‌. మేయాదమాన్‌ చిత్రంతో పరిచయం అయిన ఈ అమ్మడు ఆ చిత్ర విజయంతో పేరు తెచ్చుకుంది. ఈ తరువాత కార్తీతో నటించిన కడైకుట్టి సింగం వంటి చిత్రాల సక్సెస్‌ ప్రియభవానీశంకర్‌ పేరు మరింత ప్రాచుర్యం పొందింది. అయితే ఆ తరువాత సోలో హీరోయిన్‌గా ఎస్‌జే.సూర్యకు జంటగా నటించిన మాన్‌స్టర్‌ చిత్ర విజయం మరింత పాపులర్‌ చేసింది.

చదవండి: నా గురించి అసత్య ప్రచారం చేస్తున్నారు: రష్మి

ఇప్పుడు శంకర్‌ దర్శకత్వంలో కమలహాసన్‌కు జంటగా ఇండియన్‌–2 చిత్రంలో నటించే అవకాశం వరించే స్థాయికి చేరుకుంది. కాగా ఇప్పుడు మరోసారి ఎస్‌జే.సూర్యతో కలిసి బొమ్మై అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఆమె పేరును నటుడు ఎస్‌జే, సూర్యనే సిఫారసు చేశారనే ప్రచారం జరిగింది. దీంతో ఎస్‌జే.సూర్య, నటి ప్రియభవానీశంకర్‌ల మధ్య ప్రేమాయణం జరుగుతుందనే ప్రచారం హోరెత్తుతోంది. ఇప్పటివరకూ ఈ ప్రచారంపై పెదవి విప్పని నటుడు ఎస్‌జే.సూర్య తాజాగా స్పందించారు. ఆయన తన ట్విట్టర్‌లో పేర్కొంటూ  కొందరు ఫూల్స్‌ తాను నటి ప్రియభవానీశంకర్‌కు ఐలవ్‌యూ చెప్పినట్లు, దాన్ని ఆమె నిరాకరించినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు.

చదవండి: సినిమాగా నయన, విఘ్నేశ్‌శివన్‌ ప్రేమకథ

నిజానికి మాన్‌స్టర్‌ చిత్రం నుంచే నటి ప్రియభవానీశంకర్‌ తో పరిచయం తమ మధ్య మంచి స్నేహంగా మారిందన్నారు. ప్రియభవానీశంకర్‌ మంచి నటి అని పేర్కొన్నారు. తమ మధ్య స్నేహం తప్ప మరేదీ లేదని స్పష్టం చేశారు. తమ స్నేహాన్ని ఏదేదో ఊహించుకుంటూ తప్పుడు ప్రచారం చేయవద్దు అని అని వదంతులకు ఫుల్‌స్టాప్‌ పెట్టే ప్రయత్నం చేశారు. కాగా నటుడు ఎస్‌జే.సూర్య ఇప్పటికీ మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ అన్నది గమనార్హం. అయితే ఈ వ్యవహారంపై నటి ప్రియభవానీశంకర్‌ మాత్రం మౌనం దాల్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement