
సాక్షి, కరీంనగర్: ప్రేమ పేరుతో మోసం చేశాడని కరీంనగర్ జిల్లాలో ఓ యువతి వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళనకు దిగింది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి గర్భవతిని చేసిన యువకుడితో వివాహం జరిపించాలని డిమాండ్ చేస్తోంది. మానకొండూరు మండలం ఖాదర్ గూడెంకు చెందిన సురేష్, చెంజర్లకు చెందిన యువతి రవళి ప్రేమించుకున్నారు. కొద్దిరోజుల క్రితం పెళ్లి చేసుకోవాలని కోరడంతో సురేష్ నిరాకరించాడు. దీంతో ఆ యువకుడి స్వగ్రామమైన ఖాదర్ గూడెంకు చేరుకున్న యువతి వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళనకు దిగింది. సురేష్‌తో తనకు పెళ్లి చేయాలని డిమాండ్ చేస్తోంది. లేకుంటే దూకి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించడంతో స్థానికులు ఆమెను వారించే ప్రయత్నం చేస్తున్నారు. (తమిళనాడు ప్రేమజంట అదృశ్యం)
కాగా.. యువతకి ఇప్పటికే ఇద్దరితో వివాహం అయిందని మూడో వ్యక్తిగా సురేష్‌ని ప్రేమించినట్లుగా స్థానికులు చెబుతున్నారు. పది రోజుల క్రితం గ్రామపంచాయతీ ముందు ఇదేవిధంగా యువతి ఆందోళనకు దిగగా పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. అబ్బాయి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో యువతి ఫిర్యాదు మేరకు సురేష్‌పై కేసు నమోదు చేశారు. అయితే ఆదివారం రోజున తాను మూడు నెలల గర్భవతిని అంటూ సురేష్‌తో పెళ్లి జరిపించే వరకు కదలనని వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలుపుతుంది.
Comments
Please login to add a commentAdd a comment