
జయప్రకాశ్ రెడ్డి
నాటక రంగం నుంచి చిత్ర పరిశ్రమకు వచ్చి విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంతో పేరు సంపాదించారు జయప్రకాశ్ రెడ్డి. ఆయన ముఖ్య భూమిక పోషించిన చిత్రం ‘అలెగ్జాండర్’. ఒక్కడే నటుడు.. అతడే నట సైన్యం అనేది ట్యాగ్‌లైన్. ఉద్భవ్ నాన్వి క్రియేషన్స్ పతాకంపై విప్లవ చిత్రాల దర్శకుడు ధవళ సత్యం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో జయప్రకాశ్ రెడ్డి మాత్రమే నటించటం విశేషం. కొన్ని వందల చిత్రాల్లో నటించిన అనుభవం ఉన్న జయప్రకాశ్ రెడ్డి ఒకే పాత్ర ఉన్న చిత్రంలో హీరోగా నటించిన చిత్రం ఇది. చిత్రీకరణ పూర్తయిన ఈ చిత్రం విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తారు.