pratibha patil
-
ప్రతిభా పాటిల్‌కు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక
మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. జ్వరం, ఛాతీలో ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న పాటిల్ మహారాష్ట్రలోని పూణెలోని ఓ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. 89 ఏళ్ల మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ బుధవారం భారతి ఆసుపత్రిలో చేరారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సీనియర్ వైద్యులొకరు మీడియాతో మాట్లాడుతూ ‘మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ బుధవారం రాత్రి ఆసుపత్రిలో చేరారు. ఆమె జ్వరం, ఛాతీలో ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. చికిత్స కొనసాగుతోంది. వైద్యులు ఆమెను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు’ అని తెలిపారు. ప్రతిభా పాటిల్ భారతదేశానికి మొదటి మహిళా రాష్ట్రపతి. ఆమె 2007 నుంచి 2012 వరకు అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్నారు. -
తొలి మహిళా రాష్ట్రపతి... తొలి ఆదివాసీ రాష్ట్రపతి
తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ భారతదేశ తొలి మహిళా రాష్ట్రపతి. 2007 జూలై 25న ఆమె రాష్ట్రపతిగా బాధ్యతలను చేపట్టారు. అంతకుముందు వరకు రాజస్థాన్ గవర్నరుగా (2004–2007) ఉన్నారు. ప్రతిభా పాటిల్ 1934 లో మహారాష్ట్ర లోని నందగావ్‌లో జన్మించారు. రాజనీతి శాస్త్రం, ఆర్థిక శాస్త్రం ముఖ్యాంశాలుగా డబల్ ఎమ్.ఎ. చేశారు. టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి కూడా. 1962లో ప్రతిభా పాటిల్ ఎం.జె.కళాశాల ‘కాలేజ్ క్వీన్‘గా ఎన్నికయ్యారు. ఉన్నత విద్యాభాసం తర్వాత భారతీయ మహిళలు ఎదుర్కొంటున్న పరిస్థితులను మెరుగుపరచడానికి సామాజిక అంశాలపై ఆసక్తిని ఏర్పరచుకున్నారు. పాటిల్‌ను యునైటెడ్ ప్రొగ్రెస్సెవ్ ఆలియన్స్ (యు.పి.ఎ) తన రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. యు.పి.ఎ మొదటప్రతిపాదించిన శివరాజ్ పాటిల్ లేదా కరణ్ సింగ్‌ల అభ్యర్థిత్వాన్ని వామపక్షాలు అంగీకరించనందు వల్ల పాటిల్‌ను ఒక రాజీ మార్గ అభ్యర్థిగా ప్రకటించారు. పాటిల్ భారత జాతీయ కాంగ్రెస్‌కు, నెహ్రూ గాంధీ కుటుంబానికి అనేక దశాబ్దాల పాటు నమ్మకమైన వ్యక్తిగా ఉన్నందున కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ ఆమెను ఎంపిక చేశారు. పాటిల్ తన ప్రత్యర్థి భైరాన్ సింగ్ షెకావత్‌పై భారీ మెజారిటీ గెలిచారు. తొలి ఆదివాసీ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము నేడు (జూలై 25) భారతదేశ 15 వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ప్రతిభా పాటిల్ దేశ తొలి మహిళా రాష్ట్రపతి కాగా, శ్రీమతి ముర్ము దేశ తొలి ఆదివాసీ రాష్ట్రపతి. ముర్ము 2015 నుంచి 2021 వరకు జార్ఖండ్ గవర్నర్‌గా పని చేశారు. తాజా రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా పోటీ చేసి, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై భారీ మెజారిటీతో గెలిచారు. ముర్ము ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా, బైదాపోసి గ్రామంలో గిరిజన తెగకు చెందిన సంతాల్ కుటుంబంలో 1958 జూన్ 20 న జన్మించారు. భువనేశ్వర్ లోని రమాదేవి మహిళా కాలేజీ నుంచి బీఏ పూర్తి చేసి ఆ తర్వాత ఉపాధ్యాయురాలిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 1977–83 మధ్య ఒడిశాలోని నీటిపారుదల శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా, 1994 నుంచి 97 వరకూ శ్రీ అరబిందో ఇంటెగ్రల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్లో గౌరవ సహాయ ఉపాధ్యాయురాలిగా ఉన్నారు. అడవిలో పుట్టిన వేటగాడు జిమ్ కార్బెట్ వేటగాడు, క్రూరమృగాల జాడల్ని గుర్తించే నేర్పరి. జంతు సంరక్షకుడు కూడా. నేడు జిమ్ కార్బెట్ జయంతి. 1875 జూలై 25న నార్త్ వెస్ట్ ప్రావిన్సు (నేటి ఉత్తరాఖండ్) లోని నైనిటాల్ అటవీ ప్రాంతంలో జన్మించారు. నరమాంసానికి అలవాటు పడిన పులుల్ని, చిరుతల్ని చంపడంలో జిమ్ కార్బెట్ సిద్ధహస్తుడు. భారత ఉపఖండంలో, ముఖ్యంగా ఆగ్రా, అవధ్ల సంయుక్త ప్రావిన్సు మొత్తంలో మనుషుల్ని తినే పులి ఎక్కడ సంచరిస్తున్నా వెంటనే జిమ్ కార్బెట్‌కి బ్రిటిష్ ప్రభ్వుతం నుంచి పిలుపు అందుతుంది. వెళ్లి మనుషుల్ని రక్షిస్తాడు. అంతకంటే ముందు ఆ మ్యాన్ ఈటర్ పులిని రక్షించడానికి (చంపకుండా బంధించడం) ప్రయత్నిస్తాడు. జిమ్ కార్బెట్ తన అనుభవాలతో ‘మాన్–ఈటర్స్ ఆఫ్ కుమావోన్’ అనే గ్రంథం రాశారు. అతడు ఫొటోగ్రాఫర్ కూడా. వన్యప్రాణుల్ని అవి మ్యాన్ ఈటర్సే అయినా వాటిని అంతరించిపోకుండా కాపాడుకోవలసిన బాధ్యత మనిషిదేనని అంటాడు. (చదవండి: జిన్నా రమ్మన్నా అజీమ్ తండ్రి వెళ్లలేదు!) -
ఈ ప్రముఖుల గురించి చాలా మందికి తెలియని ఆసక్తికర విషయాలు
అమీషాకు పింక్ పిచ్చి... నటి అమీషా పటేల్‌కు పింక్ కలర్ అంటే పిచ్చి. ఆమె డ్రెస్‌లు, చీరలు, ఇతరత్రా అలంకరణ వస్తువులతో పాటు దాదాపుగా ప్రతి వస్తువు పింక్ కలర్లో ఉండేలా చూసుకుంటుంది. బద్రీ భామ ఇంట్లో ఆఖరికి గోడలు, తలుపులు, ఫర్నిచర్ కూడా పింక్ మయమేనట. ముఖ్యమంత్రి కాక ముందు బొటిక్ ఓనర్.. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి.. (దివంగత) బిజు పట్నాయక్ రాజకీయాల్లోకి ప్రవేశించక ముందు బొటిక్ నిర్వహించేవారు.. ‘సైక్డెల్హి’ పేరుతో. ఇది నిజం. న్యూఢిల్లీలోని ఓబెరాయ్ హోటల్లో ఉండేది అది. కాళీ కాదు చిత్రకారిణి.. కలకత్తా కాళీలా గర్జించే మమతా బెనర్జీ చిత్రకళలో మేటి తెలుసా! ఆమె చిత్రాలు ఎక్కువగా మహిళలకు సంబంధించే ఉంటాయి. అందులో కొన్ని చిత్రకళా ప్రదర్శనల్లో అమ్ముడు పోయి అధిక మొత్తంలో కాసులనూ సంపాదించి పెట్టాయి ఆమెకు. ప్రపంచంలో ఒకే ఒక్కడు మన మన్మోహనుడు.. ఆర్థిక సంస్కరణలను అద్భుతంగా అమలు చేసిన ఆర్థికవేత్తగా.. ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ జగద్విదితం. ఆయనకు ఇంకో రికార్డ్ కూడా ఉంది. దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఆయనంత చదువుకున్న.. క్వాలిఫైడ్ ప్రధాని మరొకరు లేరుట. చాంపియన్ ప్రెసిడెంట్.. మన తొలి మహిళా ప్రెసిడెంట్ ప్రతిభా పాటిల్ ఎరుకే కదా! కానీ ఆమె టేబుల్ టెన్నిస్ చాంపియన్ అని తెలుసుండదు. అవును కాలేజీ రోజుల్లో ఆమె టీటీ చాంపియన్. మరీ ఇంత బిజీనా..? సుప్రసిద్ధ రచయిత హరుకి మురకామి డైలీ షెడ్యూల్ ఎంత బిజీగా ఉంటుందో ఓ ఇంటర్వ్యూలో ఆయన.. ‘నేను ఉదయం నాలుగింటికల్లా నిద్రలేస్తాను. లేవగానే రాయడం మీద కూర్చుంటాను అయిదు నుంచి ఆరుగంటల పాటు. మధ్యాహ్నం దాదాపు పది కిలోమీటర్లు నడవడమో.. లేక పదిహేను వందల మీటర్లు స్విమ్ చేయడమో లేదంటే రెండూ ఉంటాయి. ఆ తర్వాత కాసేపు నచ్చిన పుస్తకం చదవడమో.. మ్యూజిక్ వినడమో చేస్తాను. రాత్రి తొమ్మిదింటికల్లా నిద్రకుపక్రమిస్తాను. ఏమాత్రం తేడా లేకుండా. .రాకుండా రోజూ ఇదే షెడ్యూల్ కొనసాగుతుంది’ అంటూ చెప్పుకొచ్చారు. నోట్ చేసుకుంటున్న రిపోర్టర్ చివరి వాక్యం రాసి ఊపిరి పీల్చుకుంటూ నిట్టూర్చాడట. ఆయుష్మాన్ ఖురానా@దంతావధాని బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ ఆయుష్మాన్ ఖురానా.. దంతాల పట్ల చాలా శ్రద్ధ వహిస్తాడు. ఎంతంటే ఆ శ్రద్ధ ఓ అబ్సేషన్ అయ్యేంతగా. సాధారణంగా ఉదయం, రాత్రి రెండు సార్లు బ్రష్ చేసుకుంటాం. కానీ ఆయుష్మాన్.. తరచుగా అంటే రోజులో వీలైనన్ని సార్లు బ్రష్ చేసుకుంటూంటాడట. అందుకే నిత్యం తన వెంట డెంటల్ కేర్ కిట్‌ను క్యారీ చేస్తూంటాడట! -
‘నాథులాల్ చెప్పాడు.. ప్రెసిడెంట్ అయ్యాను’
జైపూర్ : రాజస్తాన్ భిల్వారాకు 20 కిలోమీటర్ల దూరాన ఉన్న కరియో గ్రామానికి పలు రాజకీయ పార్టీల నేతలు క్యూ కడుతున్నారు. ఏంటా ఊరి ప్రత్యేకత అంటే ఈ గ్రామం జ్యోతిష నగరంగా ప్రసిద్దికెక్కింది. ఇక్కడ ఉన్న ఓ పండితుని వల్ల ఈ గ్రామానికి ఇంత పేరు ప్రఖ్యాతులు. ఈ గ్రామ వాస్తవ్యుడైన నాథులాల్ వ్యాస్(95) అనే జ్యోతిషున్ని కలవడానికి నేతలంతా కరియో గ్రామానికి ప్రయాణం కట్టారు. నాథులాల్ ‘భృగు సాహిత్య’ నిపుణుడు మాత్రమే కాకా మంచి జ్యోతిష శాస్త్ర పండితుడు. ఈయన మాటకు తిరుగులేదని ఈ ప్రాంతంలో ఓ నమ్మకం. రాజస్తాన్, మధ్యప్రదేశ్‌కు చెందిన పలువురు రాజకీయ నాయకులకు ఇయన మాట అంటే చాలా గురి. దాంతో ఎన్నికల ముందు ఈ పండితున్ని కలిసి సలహా తీసుకోవడం ఆనవాయితీగా మారింది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే పలువురు నేతలు ఈ పండితుడి ఇంటికి బారులు తీరారు. అయితే నాథులాల్ ఇంత ప్రసిద్ధి చెందడానికి కారణం మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్. పాటిల్, ఆమె భర్త దేవ్ సింగ్ పాటిల్ నాథులాల్‌ని తరచుగా కలుస్తూ ఆయన సలహాలు పాటించేవారు. ఈ క్రమంలో ప్రతిభా పాటిల్ తన జీవితంలో చాలా ఉన్నతమైన స్థానాలకు వెళ్తుందని నాథులాల్ జోస్యం చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే ప్రతిభా పాటిల్ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. దాంతో పాటిల్ తన ప్రమాణస్వీకార మహోత్సవానికి నాథులాల్‌ని ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు. అప్పటి నుంచి ఆయన ప్రతిభ వెలుగులోకి వచ్చింది. జాతకాలను బాగా నమ్మే పలువురు రాజకీయ నేతలు తమ భవిషత్‌కు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు నాథులాల్ను కలవడం పరిపాటిగా మారింది. రిలయన్స్ అధినేత ధీరుభాయ్ అంబానీ, స్మృతి ఇరానీ, అమర్ సింగ్ వంటి పలవురు ప్రముఖులు నాథులాల్‌ని నమ్మే వారిలో కొందరు. -
విశ్వప్రతిభ
యు.ఎన్.ఫౌండేషన్ నేతృత్వంలోని ‘ప్రపంచ మహిళా నేతల మండలి’ సభ్యురాలిగా భారత మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఎంపికయ్యారు. పూర్వ, ప్రస్తుత మహిళా ప్రధానులు, మహిళా రాష్ట్రపతులు సభ్యులుగా ఉండే ఈ మండలిలో సభ్యత్వం ఎంతో ప్రతిష్టాత్మకమైనది. ఈ సందర్భంగా ప్రతిభ జీవితంలోని కొన్ని విశేషాంశాలు, స్ఫూర్తిదాయకమైన సందర్భాలు.. ఢిల్లీకి రాజైనా అమ్మకి కొడుకే కదా! ఒక అమ్మకు అలాంటి రాజ స్థానం దొరికితే? అప్పుడైనా అంతే. అమ్మకీ నాన్నకీ కూతురు. తోబుట్టువులకు అక్క లేదా చెల్లి. భర్తకి భార్య. సంతానానికి ఆమె అమ్మే! స్వతంత్ర భారత చరిత్రలో దేశ ప్రథమ పౌరురాలి స్థానం దక్కించుకున్న మొదటి మహిళ ప్రతిభా దేవీసింగ్ పాటిల్‌కూ ఇది అక్షరాలా వర్తిస్తుంది. పద్దెనిమిదో శతాబ్దంలో రాజస్థాన్.. యుద్ధాలతో సంక్షుభితంగా మారిన సమయంలో మహారాష్ట్రకు తరలి వచ్చిన రాజుల కుటుంబం వారిది. తండ్రి నారాయణరావ్ పాటిల్, తల్లి గంగాబా. ఆ కాలంలో ఒక స్త్రీపట్ల ఉండే అన్ని ఆంక్షలు ఆ కుటుంబంలో ఉన్నాయి. అలాంటి రాజ కుటుంబంలో పుట్టి పెరిగినా, భారత రాష్ట్రపతి స్థానానికి ఎంపికై, రాష్ట్రపతి భవన్లో ప్రతిభా పాటిల్ అడుగుపెట్టడం ఒక చరిత్ర. ఆరు దశాబ్దాల పాటు పురుషులే అధిరోహించిన ఆ అత్యున్నత స్థానాన్ని దక్కించుకున్న మహిళ ప్రతిభాపాటిల్. అక్షరం అంటే అప్పట్లో అదృష్టమే! నారాయణరావ్ (నానాసాహెబ్) చిన్న ఉద్యోగి. అవకాశాలు కల్పిస్తే ఆడపిల్లలు కూడా ప్రతిభను రుజువు చేసుకుంటారన్న ఒక స్పృహ నానాసాహెబ్‌కు ఉండేది. గంగాబా కూడాS పిల్లల చదువుల కోసం ఆరాటపడేవారు. ఇది అదృష్టం కాదని ఎలా అనగలం? ఆడపిల్లల పట్ల వివక్ష కాకుండా, మగపిల్లలతో సమంగా వాళ్లకీ విద్యావకాశాలు కల్పించాలన్న విచక్షణ ఉండడం కాలాన్ని జయించిన దృష్టే మరి! ఇద్దరమ్మాయిల తోడు ప్రతిభ స్వస్థలం జల్గావ్ జిల్లాలో ఉంది. ఆమెను ఇంటిలో ‘తాయి’ అని మురిపెంగా పిలుచుకునేవారు. నానాసాహెబ్‌కు అక్కడ నుంచి చల్సిగావ్ బదలీ అయింది. కుటుంబం మొత్తం తరలివెళ్లింది. అప్పటికి తాయికి ఏడేళ్లు. దగ్గరలోనే ప్రాథమిక పాఠశాల ఉండడంతో ఎలాంటి సంకోచాలు లేకుండా చేర్పించారు. కానీ అది మూణ్ణాళ్ల ముచ్చటే అయింది. నానాసాహెబ్‌కు మళ్లీ జల్గావ్ బదలీ అయింది. కానీ ఇక్కడ దగ్గరలో ప్రాథమిక పాuý శాల లేదు. సొంతూరే అయినా బయటకు పంపడానికి మొదట తండ్రి ఇష్టపడలేదు. కానీ వీరి కుటుంబం నివాసం ఉంటున్న ఇంటి కింది వాటాలో చక్రనారాయణ్ అనే పోలీస్ అధికారి ఉండేవాడు. అతడి కూతురు కక్కూ కొంచెం దూరంలో ఉన్న ప్రాథమిక పాఠశాలకు వెళ్లేది. అది గమనించిన గంగాబా కూతురిని కూడా పంపడం ఆరంభించింది. పక్కనే మరో బాలిక తోడు ఉంది కాబట్టి నానాసాహెబ్ కూడా అభ్యంతరం చెప్పలేదు. కక్కూది క్రైస్తవ కుటుంబం. ఈమెతో కలసి ప్రతిభ చర్చిలకు కూడా వెళ్లేది. ఆ ఇద్దరూ కూడబలుక్కుని డబ్బులు కూడబెట్టి ఒక బైబిల్ కూడా కొన్నారు. ఇవన్నీ ఇంటిలో తెలిసినా నానాసాహెబ్ కుటుంబం ప్రతిభను ఆటంక పరచలేదు. కానీ కొద్దికాలానికే కక్కూ తండ్రికి బదలీ అయింది. మళ్లీ తాయిని ఒంటరితనం ఆవరించింది. విద్య కొనసాగుతుందో లేదో అనుమానం. అలాంటి సమయంలోనే మరో పోలీసు అధికారి అదే ఇంట్లో దిగాడు. అతడి కూతురు సోఫీ ఖాన్. వీరు మహ్మదీయులు. సోఫీ అదే స్కూలులో చేరింది. అంటే తాయి మళ్లీ పాఠశాలకు వెళ్లే అవకాశం సోఫీ రూపంలో వచ్చింది. చిన్ననాటి మిత్రులు కక్కూ, సోఫీలతో ప్రతిభ స్నేహం చిరకాలం కొనసాగింది. ‘డాక్టర్ ప్రతిభ’ కాలేకపోయారు మెట్రిక్ తరువాత జల్‌గావ్‌లోనే మూల్జీ జైతా కళాశాలలో చేరడానికి ప్రతిభకు తండ్రి నుంచి అనుమతి లభించింది. కానీ ఆమె కోరుకున్న సైన్స్ గ్రూప్‌లో చేరడానికి ఆయన అంగీకరించలేదు. సైన్స్ గ్రూప్ చదివి వైద్య విద్యకు వెళ్లాలన్నది ప్రతిభ ఆశయం. తన నలుగురి సోదరులలో ఒకడు ఆబాసాహెబ్, సమీప బంధువు ఇందర్లాగే తాను కూడా డాక్టర్‌ను కావాలని ఆకాంక్షించారామె. కానీ అప్పుడు జల్గావ్లో వైద్య కళాశాల లేదు. కూతురిని వేరే చోటికి పంపించి వైద్య విద్య చెప్పించడం నానాకు ఇష్టం లేదు. దానితో హ్యుమానిటీస్‌లో చేరారామె. తోడుంటేనే.. సినిమాకైనా ప్రతిభకు సినిమాలంటే మక్కువ. ఆ సంగతి చెబితే ఎవరినో తోడిచ్చి పంపేవాడు తండ్రి. హార్మోనియం నేర్చుకుంటానంటే ట్యూటర్‌ను పెట్టి ఇంటిలోనే నేర్పించారు. అలాగే తన ఆశయానికి విరుద్ధంగా హ్యుమానిటీస్‌లో చేరినా, ఆమెలోని క్రీడాకారిణి వెలుగులోకి రావడానికి ఆ కళాశాలే ఉపకరించింది. ఆమె కాలేజీ టెన్నిస్ చాంపియన్‌గా గుర్తింపు పొందారు. అప్పుడు నానాను ఒప్పించి ప్రతిభను ఆ కళాశాల ప్రిన్స్‌పాల్‌గా ఉన్న వైఎస్ మహాజన్ అంతర్ కళాశాలల పోటీకి నాసిక్ కూడా తీసుకువెళ్లారు (అన్ని కట్టుబాట్ల మధ్య కూడా ఒక మహిళగా విద్యా తృష్ణను తీర్చుకోవడమే ఆ కాలంలో సాధించిన విజయమని ప్రతిభా పాటిల్ జీవిత చరిత్ర ‘యాన్ ఇన్స్పిరేషనల్ జర్నీ: ప్రతిభాదేవీసింగ్ పాటిల్ ది ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ ఆవిష్కరణ సందర్భంగా డిసెంబర్ 20, 2010 న జరిగిన ఆవిష్కరణ సందర్భంగా నాటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలాం చెప్పడం ఇందుకే. రసిక్ చౌబే, ఛాయా మహాజన్ ఈ పుస్తకం రాశారు). పెళ్లికి ముందే ఎం.ఎ., ఎమ్మెల్యే! ‘అమ్మాయి విద్యార్హతలకు తగిన వరుణ్ణి వెతకడం కష్టంగా ఉంది’ అన్నాడు నానాసాహెబ్ ఓరోజు. నిజమే ఆ రోజుల్లోనే ప్రతిభ ఎంఎ రాజనీతి శాస్త్రం, ఎంఎ అర్థశాస్త్రం చదివారు. అందుకు ప్రతిభ కూడా దీటుగా సమాధానం ఇచ్చారు, ‘నా ఇష్టాలను గౌరవించేవాడిని, కట్నం కోరని వాడిని, తన రాజకీయ జీవితానికి అడ్డురాని వాడిని మాత్రమే చేసుకుంటాను’. పెళ్లికి ముందే ప్రతిభకు రెండు పీజీ డిగ్రీలు వచ్చేశాయి. పెళ్లికి ముందే ఆమె పేరు పక్కన మరో మూడు అక్షరాలు కూడా చేరాయి. అవి ఎం ఎల్. ఏ. – అన్న అక్షరాలు. మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికైన పిన్న వయస్కురాలిగా చరిత్రకెక్కిన మహిళ ప్రతిభ. హాస్టల్లో పెళ్లిచూపులు ఆ రోజున ప్రతిభ ఎమ్మెల్యే హాస్టల్లో కూర్చుని ఉన్నారు. రాజకీయాలలో ఉండేవారి వేషధారణ అలవాటైంది. అంచు కలిగిన తెల్లటి చీర కట్టుకుని, ఎంతో హుందాగా ఆమె కూర్చుని ఉన్నారు. అప్పుడే ఒక యువకుడు వచ్చి ఆమెను చూశాడు. ఆయన దేవీసింగ్ షెకావత్. రసాయనిక శాస్త్రంలో పీహెచ్డీ పట్టా పొందిన విద్యావంతుడు. ఇతడే ప్రతిభ తండ్రి వెతికిన వరుడు. అంటే ఆ ఇద్దరి పెళ్లిచూపులు ఎమ్మెల్యే హాస్టల్లోనే అనుకోకుండా జరిగాయి. ఆయనతోనే పెళ్లయింది. ఆ వెంటనే అత్తవారింటికి కూడా ప్రతిభ వెళ్లారు. రెండు పీజీలు చేసిన యువతి, పిన్న వయసులోనే రాజకీయాలలో అడుగు పెట్టిన వనిత, శాసనసభకు వెళుతున్న విదుషీమణి ఇంటి కోడలి పాత్రను ఎంతవరకు నెట్టుకు వస్తుందో చూడాలనే అంతా ఎదురు చూస్తున్నారు. నిజానికి ఈ కాపురం ఎలా సాగుతుందోనన్న ప్రశ్న కూడా ఉంది. అలాంటి పరిస్థితిలో ఒకరోజు ప్రతిభ వంట చేసి ఇంటిల్లిపాదికి చక్కని భోజనం వడ్డించారు. సంశయాలన్ని సర్దుకున్నాయి. ఆ తర్వాత దేవీసింగ్, ప్రతిభ కలసి జల్గావ్లో, పుణేలో ఎన్నో విద్యా సంస్థలను ఏర్పాటు చేశారు. వృత్తి శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల వారికి సహాయం అందించారు. భర్తతో గొడవొచ్చి రాజీనామా! దేవీసింగ్ రామ్‌సింగ్ షెకావత్ ఎంతో విద్యావంతుడు. కానీ ముక్కు మీద ఉండేది కోపం. అలాంటి వ్యక్తితో ప్రతిభ వైవాహిక జీవితం ఎలా సాగింది? ప్రతిభ నిత్యం రాజకీయాలతో మునిగి తేలుతూ ఉంటారు. బయటకు వెళితే ఆమెకు దొరికే గౌరవాదరాలు ఎంతో భిన్నంగా ఉంటాయి. దీనిని పురుషాహంకారం భరించగలదా? ఈ ప్రశ్నలకు సంబంధించిన వాతావరణం వారి కుటుంబంలోను అడపాదడపా ఏర్పడకపోలేదు. ఏదో పని మీద పొరుగూరు వెళ్లిన దేవీసింగ్ ఆ రోజున ఇల్లు చేరుకున్నారు. ప్రతిభ ఎవరితోనో ఏదో విషయం తీవ్రంగా చర్చిస్తున్నారు. దేవీసింగ్ పిలిచారు. అది వినిపించిందా? వినిపించినా ఆమె పరాకు పడ్డారా? ఏమైనా, పొరుగూరు నుంచి వచ్చిన సందర్భంలో తన భార్య వెంటనే వచ్చి పలకరించకపోవడం దేవీసింగ్ను తీవ్ర ఆగ్రహానికే గురి చేసింది. ఇద్దరికీ మధ్య మాటా మాటా పెరిగింది. తీవ్ర మనస్తాపంతో ప్రతిభ రాజీనామా లేఖను రాసి నేరుగా ముఖ్యమంత్రి వసంతరావ్ నాయక్‌కు పంపించారు. అందులో రాజీనామాకు చూపించిన కారణం– అనారోగ్యం. నాయక్‌ను వాకబు చేస్తే నెమ్మదిగా అసలు విషయం బయటపడింది. తరువాత ఇద్దరినీ కూర్చోబెట్టి నచ్చచెప్పిన తరువాత దేవీసింగ్ సర్దుకున్నారు. ప్రతిభ రాజీనామాను ఉపసంహరించుకున్నారు. దేవీసింగ్ ప్రతిభ రాజకీయ జీవితానికి అడ్డుకాదని చాలాసార్లు రుజువు చేసుకున్నారు. పెళ్లయ్యాకనే ఆమె న్యాయశాస్త్రం కూడా అభ్యసించారు. జల్గావ్ జిల్లా కోర్టులో కొద్దికాలం న్యాయవాదిగా పనిచేశారు కూడా. ఇద్దరూ కలసి పలు సాంస్కృతిక సంస్థలను కూడా నిర్వహించారు. పెళ్లయిన తరువాత కూడా పుట్టింటి పేరును (పాటిల్) ఎందుకు కొనసాగించారని ఒక వార్తా సంస్థ అడిగింది. తన నియోజక వర్గ ప్రజలకి తన పేరు అలాగే తెలుసు కాబట్టి ఆ పేరే కొనసాగిందని ఆమె జవాబిచ్చారు. ప్రతిభ ప్రతి పుట్టినరోజుకు దేవీసింగ్ ఒక కానుక ఇస్తారు. అది చక్కని చీర. భయపడుతూనే ప్రసంగం రాష్ట్రపతి అయినా, ప్రధాని అయినా తరగతి గదులలో కొన్ని భయాలను ఎదుర్కొనక తప్పదు. కొన్ని అంశాలంటే బెదిరిపోయి కూడా ఉండవచ్చు. ప్రతిభా పాటిల్‌కు లెక్కలన్నా, సంస్కృతమన్నా చచ్చేంత భయమట. ఈ విషయాన్ని ఆమె ఒక ప్రత్యేక సందర్భంలో వెల్లడించారు. రాజస్థాన్ గవర్నర్‌గా ప్రతిభ పనిచేస్తున్నప్పుడు గణితశాస్త్రవేత్తల సదస్సులో ప్రసంగించడానికి పిలిచారు. సందేహిస్తూనే వచ్చారామె. తరగతి గదిలో లెక్కల క్లాసంటే హడలిపోయిన తాను, గణితశాస్త్రవేత్తల సదస్సులో ప్రసంగించడానికి భయపడుతూనే వచ్చానని అంగీకరించారు. అందుకు ఆమె చెప్పిన కారణం ప్రత్యేకంగా ఉంది. ఏ దేశంలో చూసినా రెండు రెళ్లు నాలుగే. కానీ రాజకీయాలలో మాత్రం మాత్రం రెండు రెళ్లు నాలుగు కాదని ఆమె చమత్కరించారు. బహుశా ఇది చెప్పడానికే ఆమె ఆ సదస్సుకు హాజరయ్యారేమో! ఇల్లు... రాజకీయాలు జ్యోతి రాథోర్, రాజేంద్రసింగ్ ప్రతిభా పాటిల్ సంతానం. నిజానికి ఈ ఇద్దరి అచ్చటా ముచ్చటా నేరుగా తల్లిద్వారా తీరలేదన్నది ఒక వాస్తవం. ఒక దగ్గర బంధువు సంరక్షణలో వీరు పెరిగారు. కొడుకు రాజకీయాలలోకి వచ్చినా కూతురు జ్యోతి మాత్రం పెళ్లి చేసుకుని ప్రశాంతంగానే వైవాహిక జీవితం గడుపుతున్నారు. రాజేంద్ర పిన్న వయసులో తల్లిదండ్రుల సాంగత్యం లేకపోవడం వల్ల కొంచెం మొండితనం అలవరుచుకుని సమస్యగా మారిపోయాడు. కానీ కొడుకును మళ్లీ దారిలో పెట్టడానికి ప్రతిభ గట్టిగానే కృషి చేయవలసి వచ్చింది. పెద్దలు, పిన్నలు అని లేకుండా అందరిని అగౌరవపరిచే ధోరణి అతడిది. ఒట్టి పెంకితనం. కొడుకును ఒక పక్క దండిస్తూనే, మళ్లీ లాలనతో అతడి తప్పును దిద్దుతూ చిరకాలం ప్రయత్నించి మొత్తానికి కొడుకును ప్రయోజకుడిని చేయగలిగారు ప్రతిభ. అంత తీరిక లేని రాజకీయాలలో ఉండి కూడా తల్లి పాత్రను కూడా ఆమె సక్రమంగా నిర్వహించారు. ‘ది ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రీ ఇన్వెంటింగ్ లీడర్షిప్’ అన్న పుస్తకంలో నైనాసింగ్ ఈ అంశాన్ని హృద్యంగా నివేదించారు. కొన్ని విమర్శలు వచ్చినా 28 మాసాలలో మొత్తం 30 మంది మరణదండన ఖైదీలకు ఆమె క్షమాభిక్ష పెట్టారు. కుటుంబాన్నీ, రాజకీయాలనీ సమతూకంతో నడిపిన కీర్తి ప్రతిభా పాటిల్ సొంతమనిపిస్తుంది. – గోపరాజు నారాయణరావు -
డిసెంబర్ 19న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు ప్రతిభా పాటిల్ (మాజీ రాష్ర్తపతి) ఈ రోజు పుట్టిన వారి సంవత్సర సంఖ్య 3. ఇది దేవగురువు బృహస్పతి సంఖ్య. దీనివల్ల వీరికి విద్య, వినయం, వాక్చాతుర్యం అలవ డి, మంచివారిగా మన్ననలందుకుంటారు. సంగీతం, నాట్యం వంటి లలిత కళలను నేర్చుకోవాలన్న కోరిక కలిగి, వాటిని అభ్యసించడం వల్ల సంఘగౌరవం లభిస్తుంది. సృజనాత్మక, మీడియా రంగాలలో ఉన్నవారు కొత్త కొత్త ఆలోచనలతో కొత్త ఉరవడిని సృష్టించగలుగుతారు. స్వయం ఉపాధిలో ఉన్న వారు బాగా రాణిస్తారు. వీరు పుట్టిన తేదీ 19. ఇది సూర్య, కుజుల కలయిక కావడం వల్ల జీవితంలో పైకి రావాలనే ఆకాంక్ష, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. మంచి పేరు, గుర్తింపు వస్తాయి. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం జీవితంలో మైలురాయి వంటిదని చెప్పవచ్చు. హృద్రోగాలు, నేత్రరోగాలు వచ్చే అవకాశం ఉన్నందువల్ల ముందుగానే తగిన పరీక్షలు చేయించుకుని, జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. లక్కీ నంబర్స్: 1,5,6,8; లక్కీ కలర్స్: రెడ్, రోజ్, ఆరంజ్, గ్రీన్, క్రీమ్, గోల్డెన్, ఎల్లో, శాండల్, బ్లూ; లక్కీ డేస్: మంగళ, గురు, శుక్ర, శని, ఆదివారాలు; సూచనలు: ఆదిత్యహృదయం పఠించడం లేదా వినడం, తండ్రిని కాని, తండ్రితో సమానులైన వారిని కాని ఆదరించడం, గురువులను, పెద్దలను గౌరవించడం, దక్షిణామూర్తిని పూజించడం మంచిది. డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, -
నాకు కారు.. అందులోకి పెట్రోలు మీరే ఇవ్వండి
మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం మరణించారని దేశమంతా ఒక పక్క రోదిస్తుంటే.. ఆయన తర్వాత రాష్ట్రపతి పదవి చేపట్టిన ప్రతిభా పాటిల్ కూడా మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తనకు అధికారికంగా ఒక కారు కేటాయించాలని, దానికి పెట్రోలు బిల్లు కూడా చెల్లించాలని, వీటితో పాటు తన ప్రైవేటు వాహనాన్ని కూడా ఉపయోగించుకోడానికి అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాజీ రాష్ట్రపతులకు సొంత వాహనం ఉంటే దానికి ఇంధన అలవెన్సు ఇస్తారు, అది లేకపోతే ప్రభుత్వ వాహనాన్ని కేటాయిస్తారు. ప్రస్తుతం ప్రతిభా పాటిల్ కోరుతున్నట్లు చేయాలంటే నిబంధనలను మార్చాలి. పుణెలో ఉన్నప్పుడు తన సొంత కారు వాడుకుంటానని, వేరే ఊళ్లు వెళ్లాల్సి వచ్చినప్పుడు ప్రభుత్వ వాహనం వాడతానని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఇలా ఇవ్వడం మాత్రం ప్రస్తుతానికి కుదరని పని. ఈ అంశంపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ అధికారులు గత మూడు నెలలుగా ఆమె కార్యాలయంతో అనేక ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారు. అయినా ఫలితం లేకపోవడంతో.. సొంత కారు గానీ, అధికారిక వాహనం గానీ ఏదో ఒకటి నిర్ణయించుకోవాలని చెబుతున్నారు. తొలుత తనకు కేటాయించిన ప్రభుత్వ వాహనం సరిపోదని, అంతకంటే పెద్ద వాహనం పంపాలంటూ దాన్ని తిప్పి పంపేయడంతో వివాదం మొదలైంది. పెద్ద కారు రాకపోవడంతో ఇంధన అలవెన్సు వాడుకున్నారు. బయటి ఊళ్లకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ప్రభుత్వ వాహనం కావాలనడంతో.. దానికి మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పి, ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళ్లింది. -
ఎన్ని పోటీలైనా ఈమెకు సాటిరావు!
ప్రతిభా కిరణం ఇది పోటీ ప్రపంచం. ఈ యుగంలో పోటీ పడనిదే పనిజరగదు. అని తన్మయి గ్రహించింది కాబోలు, పోటీలలో పాల్గొనడమే ధ్యేయంగా పెట్టుకుంది. పాల్గొన్న ప్రతిదానిలోనూ గెలిచి శభాష్ అనిపించుకుంటోంది. హైదరాబాద్‌లో ఫిబ్రవరి 18, 1998న పుట్టిన తన్మయి అంబటి అత్యధిక పోటీల్లో పాల్గొని, బహుమతులు గెలుచుకుని రికార్డు సృష్టించింది. తన్మయి వివిధ రాష్ర్ట, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో పరీక్షలు, డ్రాయింగ్, పెయింటింగ్, వ్యాసరచన, క్లే మాడలింగ్, చేతి రాత, పర్యావరణ అవగాహన, సామాజిక సేవ మొదలైన అంశాలలో 151కి పైగా అవార్డులను అందుకుంది. అంతర్జాతీయ మేథమెటిక్స్ ఒలంపియాడ్, జాతీయ సైన్స్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్, ఆల్ ఇండియా స్పాట్ కేమెల్ కలర్ కాంటెస్ట్, ఇంట్రా స్కూల్ లెవెల్ సైన్స్ క్విజ్ కాంటెస్ట్‌లతో పాటు ఆస్ట్రేలియా న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయం వారు నిర్వహించిన మేథమెటిక్స్, కంప్యూటర్ పరీక్షలలో బంగారు పతకాలు సాధించింది. ఆమె తొమ్మిది ఏళ్ల వయసులో కళారత్న, బాలమేధావి అనే బిరుదులను సంపాదించింది. 10 జూన్, 2010లో ‘మహా స్టార్’ గా ఎన్నికైనందుకు ప్రముఖ క్రికెటర్ ధోనీ చేతుల మీదుగా బహుమతి అందుకుంది. ఇంకా ఆంధ్రబాలరత్న, స్టేట్ బెస్ట్ చైల్డ్, జూనియర్ ఎక్స్‌లెన్స్ అవార్డులు పొందింది. అంతేకాదు, మన దేశ మాజీ రాష్ర్టపతి శ్రీమతి ప్రతిభాపాటిల్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి, తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయల అభినందనలు కూడా అందుకుంది తన్మయి. ఈ బాలికని ఆదర్శంగా తీసుకుని మీరు కూడా పోటీలలో పాల్గొనండి, పతకాల పంట పండించండి! -
రెండేళ్ల ప్రథమ పౌరుడు
న్యూఢిల్లీ: నేటితో రాష్ట్రపతిగా ప్రణబ్‌ముఖర్జీ(78) రెండేళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ రెండేళ్లలో గత రాష్ట్రపతులకు భిన్నంగా.. ఎక్కువ కాలం రాష్ట్రపతి భవన్‌లోనే గడిపేందుకు ప్రణబ్ ఆసక్తి చూపారు. ప్రణబ్ కన్నా ముందు రాష్ట్రపతిగా ఉన్న ప్రతిభాపాటిల్ తన ఐదేళ్ల పదవీకాలంలో రూ. 223 కోట్ల ఖర్చుతో 23 దేశాలను సందర్శించి వచ్చారు. ప్రణబ్ ముఖర్జీ మాత్రం ఈ రెండేళ్లలో బెల్జియం, టర్కీ, దక్షిణాఫ్రికాల్లో మాత్రమే పర్యటించారు. అలా అని ఆయన దౌత్య మర్యాదలను తక్కువ చేయలేం. ఈ రెండేళ్లలో ఆయన జపాన్ చక్రవర్తి సహా 75 మంది విదేశీ ప్రముఖులకు రాష్ట్రపతిభవన్‌లో ఆతిథ్యం ఇచ్చారు. మోడీ ప్రమాణ స్వీకారోత్సవం కూడా రాష్ట్రపతిభవన్ ప్రాంగణంలోనే జరిగిన విషయం ఇక్కడ గమనార్హం. విదేశీ అతిధుల కోసం ఇక్కడి వంటవారికి వివిధ దేశాల వంటకాలను వండటంలో ప్రణబ్ ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. -
పంతులమ్మకు రాష్ట్రపతి పేరు తెలియదు!
పాట్నా: భారత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ అట. బీహార్ గవర్నర్ ఏమో స్మృతీ ఇరానీనట. ఇంత తలతిక్క సమాధానాలు చెప్పింది ఏ నిరక్ష్యరాస్యుడో లేక చంటోడో కాదు. బీహార్‌కు చెందిన ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయిని. కనీస తెలివితేటలు ఉన్నవారెవరైనా ఈ ప్రశ్నలకు వెంటనే ఠకీమని సమాధానం చెబుతారు. కానీ టీచరమ్మకు మాత్రం తెలియకపోవడం విడ్డూరం. రాష్ట్రపతి పేరు కూడా తెలియని ఆ స్కూల్ టీచర్ ఇక పిల్లలకు ఏం చదువు చెబుతుంది? పాఠశాల తనిఖీకి వెళ్లిన జిల్లా కలెక్టర్ ప్రశ్నలకు టీచర్ చెప్పిన చెప్పిన సమాధానాలివి. అంతే కలెక్టర్‌కు మైండ్ బ్లాక్ అయినంత పని అయింది. ఆయన వెంటనే విచారణకు ఆదేశించారు. మహిళా టీచర్ విద్యార్హతలు ఏమిటి? ఇంతకీ ఆమె ఏ ప్రామాణికం మీద ఉద్యోగం సంపాదించింది అన్న అంశాలపై నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. బీహార్‌లోని గయా జిల్లాలో ఈ వింత సంఘటన జరిగింది. మహిళా టీచర్ పేరు కుమారి అనిత. కలెక్టర్ సంజయ్ కుమార్ అగర్వాల్ జనతా దర్బార్ కార్యక్రమంలో భాగంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంత పాఠశాలకు వెళ్లారు. అనిత తన ఇంటికి సమీపంలో గల పాఠశాలకు బదిలీ చేయాల్సిందిగా కలెక్టర్‌కు విన్నవించారు. కలెక్టర్ ఆమెకు జనరల్ నాలెడ్జ్ ఏమాత్రం ఉందో తెలుసుకోవాలని పరీక్షించారు. అనిత మాత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బదులు మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ పేరు, కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీని గవర్నర్‌గా చెప్పి అడ్డంగా దొరికిపోయారు. బదిలీ కోసం మొరపెట్టుకుని తన అజ్ఞానంతో ఉద్యోగానికే ఎసరు తెచ్చుకుంది. -
మాజీ రాష్ట్రపతి తమ్ముడిపై హత్యకేసు!
మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ తమ్ముడు హత్య కేసులో ఇరుక్కున్నాడు. 2005లో మహారాష్ట్రలో జరిగిన ఓ హత్యకేసులో గజేంద్రసింగ్ పాటిల్‌ను ఈ కేసులో నిందితునిగా పేర్కొన్నారు. జలగావ్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రొఫెసర్ వీజీ పాటిల్ హత్యకేసులో ఇద్దరిని అరెస్టు చేయగా, వాళ్లిచ్చిన సమాచారం మేరకు గజేంద్ర సింగ్ పాటిల్ మీద కూడా కేసు నమోదైంది. అప్పట్లో ప్రొఫెసర్ పాటిల్ కారుపై రాళ్లతో దాడిచేసి, తర్వాత ఆయనను కత్తులతో పొడిచి చంపారు. రాజకీయ కక్షల వల్లే ఈ హత్య జరిగిందని అప్పట్లో చెప్పుకొన్నారు. ఈ కేసును బాంబే హైకోర్టు 2007లో సీబీఐకి అప్పగించింది. అయితే.. రాష్ట్రపతి తమ్ముడు కావడం వల్లే గజేంద్ర సింగ్ పాటిల్‌ను సీబీఐ వెనకేసుకొస్తోందని దివంగత ప్రొఫెసర్ భార్య రజనీ పాటిల్ ఆరోపించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీకి జరిగిన ఎన్నికల్లో గజేంద్రపాటిల్ను ప్రొఫెసర్ పాటిల్ ఓడించిన కొన్ని నెలల తర్వాత ఈ హత్య జరిగింది. -
చెప్పుల మాయ.. ఏసీల షీలా!!
అంది వచ్చిన అధికారాన్ని అయినకాడికి ఉపయోగించుకోవటంలో ప్రజా ప్రతినిధులు ముందుంటారు. అయితే అందుకు మహిళా ప్రజాప్రతినిధులు మినహాయింపు కాదేమో. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజల సొమ్ము అడ్డంగా అనుభవించటంలో వాళ్లకు మించినవారు లేరు. ఓవైపు ఢిల్లీవాసులు కరెంట్ కోతలతో కష్టాలు పడితే అప్పట్లో ఆ పీఠాన్ని ఏలిన షీలా దీక్షిత్ మాత్రం తన అధికార నివాసంలో ఏకంగా 31 ఏసీలు ఏర్పాటు చేసుకుని ఎంచక్కా కూల్‌గా విశ్రాంతి పొందారట. సమాచార హక్కు చట్టం హక్కు కింద అడిగిన ఒక వివరణలో షీలమ్మ గారి రాజభోగం బయటపడింది. కేవలం ఏసీలే కాకుండా, 15 కూలర్లు, 25 హీటర్లు, 16 ఎయిర్ ప్యూరిఫయర్లు, 12 గీజర్లను వాడేసుకున్నారు. ఓ మహిళా ముఖ్యమంత్రి కొత్త చెప్పులు తెప్పించుకోవడానికి ముంబైకి ఖాళీ విమానాన్ని పంపిస్తే, మరొక ఆమె బంగారు ఆభరణాల్ని తరలించేందుకు మూడు వ్యాన్లు ఉపయోగించాల్సి వచ్చింది. ఇక దేశానికి తొలి మహిళా రాష్ట్రపతిగా అధికారం చేపట్టిన ఒకామె ... అవకాశం వచ్చినప్పుడల్లా విమానాలు ఎక్కి విదేశాల్లో చక్కర్లు కొట్టారు. ఆడంబరాలను అతిగా ప్రేమించి ఎప్పుడూ వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచే ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి కేవలం తనకు ఇష్టమైన బ్రాండు చెప్పులను తెప్పించుకోవడానికి ముంబైకి ఖాళీ విమానాన్ని పంపారు. ఈ విషయాన్ని వికీలీక్స్ బయటపెట్టడంతో అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది. ఇక తమిళ పురుచ్చితలైవి జయలలిత ఏది చేసినా సంచలనమే. ఆభరణాలంటే తెగ మక్కువ చూపే ఆమె అక్రమాస్తుల కేసులో పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఆ ఆభరణాలను తరలించేందుకు అధికారులు మూడు వ్యాన్లు ఉపయోగించాల్సి వచ్చిందంటే ఊహించుకోవచ్చు. ఇక జయలలిత దగ్గర 750కి పైగా చెప్పులు కూడా ఉన్నాయని లెక్క తేల్చారు. ఇదిలాఉంటే దేశానికి తొలి మహిళా రాష్ట్రపతిగా పనిచేసిన ప్రతిభా దేవీ సింగ్ పాటిల్ విదేశీ పర్యటనల వ్యయం వింటే కళ్లు గిర్రున తిరిగిపోవాల్సిందే. రాష్ట్రపతిగా పనిచేసిన ఐదేళ్లలో ఆమె విదేశీ పర్యటనల ఖర్చు 205 కోట్లు పైనే అయింది. మొత్తం 12 సార్లు 22 దేశాల్లో ఆమె పర్యటనల కోసం ఎయిరిండియాకు అయిన ఖర్చు 169 కోట్ల రూపాయిలు. ఇవన్నీ బయటకు వచ్చిన కొన్ని మాత్రమే. రాజు తలచుకుంటే...దెబ్బలకు కొదవా అన్నట్లు... కాదు కాదు... రాణులు తలచుకుంటే తమ దర్పాన్ని ఎలాగైనా ప్రదర్శించవచ్చు. -
రాష్ట్రపతి భవన్ కు చేరిన ప్రతిభా పాటిల్ బహుమతులు
న్యూఢిల్లీ: అధికారిక హోదాలో అందుకున్న అన్ని బహుమతులను మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ తిరిగి రాష్ట్రపతి భవన్‌కు పంపారు. అమరావతిలో పాటిల్ కుటుంబసభ్యులు నడిపిస్తున్న పాఠశాలలో ప్రదర్శనకు ఉంచిన బహుమతులు కూడా తమకు అందాయని రాష్ర్టపతి భవన్ వర్గాలు తెలిపాయి. సుభాష్ ఆగర్వాల్ సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కోరగా, పైవిధంగా సమాధానమిచ్చాయి. బ్రిటన్ ప్రధాన మంత్రి నుంచి అందుకున్న క్యాండిల్ సెట్, నెల్సన్ మండేలా బంగారు, రజత పతకాలు, చైనా నుంచి వచ్చిన ఓ బహుమతి బాక్స్‌తో పాటు ఇతర వస్తువులను మే 22న రాష్ట్రపతి భవన్‌కు వచ్చాయని తెలిపాయి. రాష్ట్రపతి భవన్, విద్యా భారతి సేక్సైనిక్ మందైకు మధ్య కుదిరిన ఎంవోయూ ఒప్పందం వల్లే ఆ బహుమతులు ఆ సంస్థకు ఇచ్చామని తెలిపాయి. ఏపీజే అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్న సమయంలో న్యూఢిల్లీలోని బ్రహ్మోస్ సెంటర్లో ప్రదర్శన కోసం డీఆర్డీవోకు 36 కళాఖండాలను ఇచ్చామని వెల్లడించాయి. 2012, అక్టోబర్ మూడున ఆ వస్తువలన్నీ తిరిగి రాష్ట్రపతి భవన్‌కు తిరిగి ఇచ్చారని వివరించాయి. -
మరణశిక్షల తగ్గింపుపై సుప్రీం నోటీసు
న్యూఢిల్లీ: బాలికలపై అత్యాచారం కేసుల్లో మరణశిక్ష అనుభవిస్తున్న ఐదుగురు ఖైదీలకు శిక్షను తగ్గిస్తూ రాష్ట్రపతిగా ప్రతిభాపాటిల్ తీసుకున్న నిర్ణయం న్యాయ సమీక్షకు వచ్చింది. శిక్ష తగ్గింపును సవాల్ చేస్తూ దాఖలైన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం నేపథ్యంలో సుప్రీంకోర్టు సోమవారం కేంద్రానికి నోటీ సు జారీ చేసింది. పిల్‌ను విచారించేందుకు ప్రధాన న్యాయమూర్తి సదాశివం నేతృత్వంలోని బెంచ్ అంగీకరించింది. ప్రతిభాపాటిల్ అప్పట్లో మరణశిక్షను తగ్గించిన మొత్తం 35 కేసుల్లో 5కేసులు బాలికలపై క్రూరాతిక్రూరమైన అత్యాచారాలకు సంబంధించినవని పిటిషనర్ పేర్కొన్నారు.