మాజీ రాష్ట్రపతి తమ్ముడిపై హత్యకేసు! | Former president's brother is accused in murder case | Sakshi
Sakshi News home page

మాజీ రాష్ట్రపతి తమ్ముడిపై హత్యకేసు!

Published Tue, Jul 8 2014 9:36 AM | Last Updated on Sat, Sep 2 2017 10:00 AM

Former president's brother is accused in murder case

మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ తమ్ముడు హత్య కేసులో ఇరుక్కున్నాడు. 2005లో మహారాష్ట్రలో జరిగిన ఓ హత్యకేసులో గజేంద్రసింగ్ పాటిల్ను ఈ కేసులో నిందితునిగా పేర్కొన్నారు. జలగావ్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రొఫెసర్ వీజీ పాటిల్ హత్యకేసులో ఇద్దరిని అరెస్టు చేయగా, వాళ్లిచ్చిన సమాచారం మేరకు గజేంద్ర సింగ్ పాటిల్ మీద కూడా కేసు నమోదైంది.

అప్పట్లో ప్రొఫెసర్ పాటిల్ కారుపై రాళ్లతో దాడిచేసి, తర్వాత ఆయనను కత్తులతో పొడిచి చంపారు. రాజకీయ కక్షల వల్లే ఈ హత్య జరిగిందని అప్పట్లో చెప్పుకొన్నారు. ఈ కేసును బాంబే హైకోర్టు 2007లో సీబీఐకి అప్పగించింది. అయితే.. రాష్ట్రపతి తమ్ముడు కావడం వల్లే గజేంద్ర సింగ్ పాటిల్ను సీబీఐ వెనకేసుకొస్తోందని దివంగత ప్రొఫెసర్ భార్య రజనీ పాటిల్ ఆరోపించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీకి జరిగిన ఎన్నికల్లో గజేంద్రపాటిల్ను ప్రొఫెసర్ పాటిల్ ఓడించిన కొన్ని నెలల తర్వాత ఈ హత్య జరిగింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement