డిసెంబర్ 19న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ప్రతిభా పాటిల్ (మాజీ రాష్ర్తపతి)
ఈ రోజు పుట్టిన వారి సంవత్సర సంఖ్య 3. ఇది దేవగురువు బృహస్పతి సంఖ్య. దీనివల్ల వీరికి విద్య, వినయం, వాక్చాతుర్యం అలవ డి, మంచివారిగా మన్ననలందుకుంటారు. సంగీతం, నాట్యం వంటి లలిత కళలను నేర్చుకోవాలన్న కోరిక కలిగి, వాటిని అభ్యసించడం వల్ల సంఘగౌరవం లభిస్తుంది. సృజనాత్మక, మీడియా రంగాలలో ఉన్నవారు కొత్త కొత్త ఆలోచనలతో కొత్త ఉరవడిని సృష్టించగలుగుతారు. స్వయం ఉపాధిలో ఉన్న వారు బాగా రాణిస్తారు. వీరు పుట్టిన తేదీ 19. ఇది సూర్య, కుజుల కలయిక కావడం వల్ల జీవితంలో పైకి రావాలనే ఆకాంక్ష, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు.
మంచి పేరు, గుర్తింపు వస్తాయి. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం జీవితంలో మైలురాయి వంటిదని చెప్పవచ్చు. హృద్రోగాలు, నేత్రరోగాలు వచ్చే అవకాశం ఉన్నందువల్ల ముందుగానే తగిన పరీక్షలు చేయించుకుని, జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. లక్కీ నంబర్స్: 1,5,6,8; లక్కీ కలర్స్: రెడ్, రోజ్, ఆరంజ్, గ్రీన్, క్రీమ్, గోల్డెన్, ఎల్లో, శాండల్, బ్లూ; లక్కీ డేస్: మంగళ, గురు, శుక్ర, శని, ఆదివారాలు; సూచనలు: ఆదిత్యహృదయం పఠించడం లేదా వినడం, తండ్రిని కాని, తండ్రితో సమానులైన వారిని కాని ఆదరించడం, గురువులను, పెద్దలను గౌరవించడం, దక్షిణామూర్తిని పూజించడం మంచిది.
డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్,