రాష్ట్రపతి భవన్ కు చేరిన ప్రతిభా పాటిల్ బహుమతులు | Former President Pratibha Patil returns all official gifts to Rashtrapati Bhavan | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి భవన్ కు చేరిన ప్రతిభా పాటిల్ బహుమతులు

Published Sun, Dec 1 2013 7:11 PM | Last Updated on Sat, Sep 2 2017 1:10 AM

Former President Pratibha Patil returns all official gifts to Rashtrapati Bhavan

న్యూఢిల్లీ: అధికారిక హోదాలో అందుకున్న అన్ని బహుమతులను మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ తిరిగి రాష్ట్రపతి భవన్‌కు పంపారు. అమరావతిలో పాటిల్ కుటుంబసభ్యులు నడిపిస్తున్న పాఠశాలలో ప్రదర్శనకు ఉంచిన బహుమతులు కూడా తమకు అందాయని రాష్ర్టపతి భవన్ వర్గాలు తెలిపాయి. సుభాష్ ఆగర్వాల్ సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కోరగా, పైవిధంగా సమాధానమిచ్చాయి. బ్రిటన్ ప్రధాన మంత్రి నుంచి అందుకున్న క్యాండిల్ సెట్, నెల్సన్ మండేలా బంగారు, రజత పతకాలు, చైనా నుంచి వచ్చిన ఓ బహుమతి బాక్స్‌తో పాటు ఇతర వస్తువులను మే 22న రాష్ట్రపతి భవన్‌కు వచ్చాయని తెలిపాయి.

 

రాష్ట్రపతి భవన్, విద్యా భారతి సేక్‌సైనిక్ మందైకు మధ్య కుదిరిన ఎంవోయూ ఒప్పందం వల్లే ఆ బహుమతులు ఆ సంస్థకు ఇచ్చామని తెలిపాయి. ఏపీజే అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్న సమయంలో న్యూఢిల్లీలోని బ్రహ్మోస్ సెంటర్‌లో ప్రదర్శన కోసం డీఆర్‌డీవోకు 36 కళాఖండాలను ఇచ్చామని వెల్లడించాయి. 2012, అక్టోబర్ మూడున ఆ వస్తువలన్నీ తిరిగి రాష్ట్రపతి భవన్‌కు తిరిగి ఇచ్చారని వివరించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement