'దిలీప్ బానే ఉన్నారు.. కానీ ప్రమాదం కూడా ఉంది'
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ (93) ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే, ప్రమాదం దాటిపోయిందని మాత్రం చెప్పలేమని అన్నారు. అవసరమైన అన్ని పరీక్షలు చేస్తున్నామని, ఆస్పత్రిలో చేరిన సమయం కన్న ప్రస్తుతం పరిస్థితి మెరుగ్గా ఉందని అన్నారు. తీవ్రమైన జ్వరంతో బాధపడుతుండటంతో దిలీప్ కుమార్ ను శనివారం ఉదయం ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేర్చిన విషయం తెలిసిందే. ఆయన నిమోనియాతో బాధపడుతున్నట్టుగా సన్నిహితులు తెలిపారు.
జ్వరంతో పాటు శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది ఉండటంతో ఆసుపత్రిలో చేర్చినట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు. 'దిలీస్ సాబ్ ఆరోగ్యం నిలకడగా ఉంది. కొంచెం పర్వాలేదు. కానీ కొంత ఆందోళన మాత్రం ఉంది. అపాయం తప్పినట్లు మాత్రం చెప్పలేము. కొన్ని ప్రత్యేక పరీక్షలు చేయాల్సి ఉంది. మరో 48 గంటలు గడిచిన తర్వాత స్పష్టమైన్ ఆరోగ్య సమాచారం వెల్లడిస్తాం' అని జలీల్ పార్కర్ అనే వైద్యుడు తెలిపారు.
ఊపిరితిత్తుల్లో కొంత చెడిపోయాయని కూడా వెల్లడించారు. బాలీవుడ్ చిత్ర పరిశ్రమల దిలీప్ కుమార్ గా ఫేమస్ అయిన ఆయన అసలు పేరు మహ్మద్ యూసుఫ్ ఖాన్, దేవదాసు సినిమాతో ఉత్తరాది ప్రేకకులతో ట్రాజెడీ కింగ్ గా పిలిపించుకున్న దిలీప్ అందాజ్, దీదర్, మొగళ్ ఈ అజమ్ లాంటి సినిమాలతో సూపర్ స్టార్ గా ఎదిగారు. 1998లో నటించిన ఖిలా ఆయన చివరి సినిమా.