
దిలీప్ కుమార్ డిశ్చార్జి
బాలీవుడ్ వెటరన్ దిలీప్ కుమార్ ఆరోగ్యం మెరుగుపడింది. ముంబై లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను గురువారం డిశ్చార్జి చేశారు. ఈ నెల 15న అస్వస్థతకు గురైన 90 ఏళ్ల దిలీప్ కుమార్ను ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. పది రోజుల పాటు ఐసీయూలో ఉంచారు. ఆయన పూర్తిగా కోలుకున్నారని సన్నిహితులు తెలిపారు.
దిలీప్ కుమార్ ఆరోగ్యం మెరుగవడంతో ఇంటికి పంపాలని వైద్యులు నిర్ణయించినట్టు ఆయన సన్నిహితులు తెలిపారు. మహమ్మద్ యూసుఫ్ ఖాన్గా జన్మించిన దిలీప్ సినీ రంగ ప్రవేశం చేశాక తన పేరును మార్చుకున్నారు. ఆరు దశాబ్దాల పాటు పలు సినిమాల్లో నటించారు. 14 ఏళ్ల క్రితం ఆయన గుండెకు శస్త్రచికిత్స చేశారు.