అలనాటి ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ ఆరోగ్యం మరింత మెరుగుపడింది.
ముంబయి : అలనాటి ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ ఆరోగ్యం మరింత మెరుగుపడింది. గుండె సంబంధిత సమస్యతో ముంబై లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, మరో రెండు రోజుల్లో డిశ్చార్జి అయ్యే అవకాశముంది. ఈ నెల 15న ఆస్పత్రిలో చేరిన దిలీప్ ఆరోగ్యం రోజురోజుకు మెరుగుపడుతోందని సన్నిహిత వర్గాలు తెలిపాయి.
ఆయన కోలుకుంటున్నారని, త్వరలోనే డిశ్చార్జి అయ్యే అవకాశముందని వెల్లడించాయి. ఇప్పటికే ఆయనను పలువురు సిని నటీనటులు, కేంద్రమంత్రులు వచ్చి పరామర్శించారు. దిలీప్ కుమార్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు.