కోలుకుంటున్న నటుడు దిలీప్‌కుమార్ | Dilip Kumar to be under observation for two more days | Sakshi
Sakshi News home page

కోలుకుంటున్న నటుడు దిలీప్‌కుమార్

Published Tue, Sep 17 2013 7:58 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

Dilip Kumar to be under observation for two more days

ముంబై: గుండెనొప్పితో ఆస్పత్రిలో చేరిన బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్‌కుమార్ కోలుకుంటున్నారని ఆస్పత్రివర్గాలు తెలిపాయి. ఆదివారం తీవ్ర గుండెనొప్పితో దిలీప్‌కుమార్ స్థానిక లీలావతి ఆస్పత్రిలో జాయినవ్వగా ఐసీయూలో ఉంచి చికిత్స అందజేశారు. దిలీప్ కోలుకుంటున్నారని ఆస్పత్రి వర్గాలు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి.  దిలీప్ కుమార్ మరో రెండు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షనలో చికిత్సను అందించాల్సిన అవసరం ఉందని వైద్యులు తెలిపారు.

 

ప్రస్తుతం అత డి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, అయితే దిలీప్ వయస్సు, అంతకుముందు జరిగిన గుండె ఆపరేషన్‌ను దృష్టిలో పెట్టుకుని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లోనే ఉంచి ప్రత్యేక చికిత్స అందజేస్తున్నామని వైద్యులు తెలిపారు. కాగా, దిలీప్ కుమార్ భార్య, నటి సైరా భాను మాట్లాడుతూ 14 ఏళ్ల కిందట అతడికి గుండె ఆపరేషన్ జరిగిందని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement