బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం క్షీణించడంతో గత రాత్రి(మంగళవారం) ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకగానే ఉంది. దీంతో వైద్యులు ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
లాలూ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్చారు. అక్కడి వైద్యుల ఆయనకు చికిత్స అందించారు. తరువాత అతని ఆరోగ్యం పరిస్థితి కుదుటపడింది. లాలూతో పాటు అతని కుటుంబ సభ్యులు రాత్రంతా ఆసుపత్రిలో ఉన్నారని సమాచారం.
లాలూ ప్రసాద్ యాదవ్‌కు బీపీ పెరిగిందని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని ఢిల్లీ ఎయిమ్స్ సీనియర్ వైద్యుడు రాకేష్ యాదవ్ తెలిపారు. 2022లో లాలూకు సింగపూర్‌లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగింది. ఆయన చాలా కాలంగా మధుమేహం, అధిక రక్తపోటు తదితర వ్యాధులతో బాధపడుతున్నారు. అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత లాలూ రాజకీయాల్లో తిరిగి యాక్టివ్‌గా మారి, ఎన్నికల సమయంలో వేదికపై నుంచి ప్రసంగాలు కూడా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment