న్యూఢిల్లీ: కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జుయెల్ ఓరం ఢిల్లీలోని ఎయి మ్స్‌లో చేరారు. సోమవారం ఉదయం 9 గంటల సమయంలో కొత్త ప్రైవేట్ వార్డులో చేరారని, పల్మనరీ మెడిసిన్ అండ్ స్లీప్ డిజార్డర్స్ విభాగాధిపతి డాక్టర్ అనంత్ మోహన్ ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి. మంత్రి ఆరోగ్య నిలకడగా ఉందని వెల్లడించాయి.
మంత్రి ఓరం భార్య ఝింగియా ఓరం(58) శనివారం ఒడిశాలోని భువనేశ్వర్‌లోని ఓ ఆస్పత్రిలో డెంగీతో చికిత్స పొందుతూ చనిపోవడం తెలిసిందే. అదే ఆస్పత్రిలో డెంగీతో మంత్రి ఓరం కూడా చికిత్స పొందారు. ఇలా ఉండగా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తీవ్ర జ్వరంతో సోమవారం సాయంత్రం ఢిల్లీ ఎయిమ్స్‌లోని అత్యవసర విభాగంలో జాయినయ్యారు. ‘ఆయన మంచిగానే ఉన్నారు. చికిత్స అందుతోంది. ఎలాంటి ప్రమాదం లేదు’అని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment