Jual Oram
-
ఎయిమ్స్‌లో చేరిన కేంద్ర మంత్రి ఓరం
న్యూఢిల్లీ: కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జుయెల్ ఓరం ఢిల్లీలోని ఎయి మ్స్‌లో చేరారు. సోమవారం ఉదయం 9 గంటల సమయంలో కొత్త ప్రైవేట్ వార్డులో చేరారని, పల్మనరీ మెడిసిన్ అండ్ స్లీప్ డిజార్డర్స్ విభాగాధిపతి డాక్టర్ అనంత్ మోహన్ ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి. మంత్రి ఆరోగ్య నిలకడగా ఉందని వెల్లడించాయి. మంత్రి ఓరం భార్య ఝింగియా ఓరం(58) శనివారం ఒడిశాలోని భువనేశ్వర్‌లోని ఓ ఆస్పత్రిలో డెంగీతో చికిత్స పొందుతూ చనిపోవడం తెలిసిందే. అదే ఆస్పత్రిలో డెంగీతో మంత్రి ఓరం కూడా చికిత్స పొందారు. ఇలా ఉండగా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తీవ్ర జ్వరంతో సోమవారం సాయంత్రం ఢిల్లీ ఎయిమ్స్‌లోని అత్యవసర విభాగంలో జాయినయ్యారు. ‘ఆయన మంచిగానే ఉన్నారు. చికిత్స అందుతోంది. ఎలాంటి ప్రమాదం లేదు’అని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. -
‘పొరపాటున నోరుజారా.. నా ఉద్దేశం అది కాదు’
హైదరాబాద్ : గిరిజన పారిశ్రామికవేత్తలకు భారీ రాయితీలిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటోందని చెబుతూ చేసిన కొన్ని వ్యాఖ్యలు కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జువల్ ఓరంను చిక్కుల్లో పడేశాయి. శుక్రవారం ఇక్కడి మారియట్ హోటల్లో జరిగిన నేషనల్ ట్రైబల్ ఎంటర్ప్రెన్యూర్ కాన్క్లేవ్–2018లో పాల్గొన్న కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. గిరిజనులు అన్ని రంగాల్లో రాణించాలని, అలా కావాలంటే విజయ్ మాల్యాలా తెలివిగా ఆలోచించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీలు చాలా చాకచక్యంగా వ్యవహరించి బ్యాంకుల నుంచి సులువగా రుణాలు పొందాలని పిలుపునిచ్చారు. షెడ్యూల్డు కులాలకు చెందిన వారు విద్య, ఉద్యోగాలు, రాజకీయాలు, ఇలా పలు రంగాల్లో రిజర్వేషన్లు పొందుతున్నారని, అయితే ఇతర సామాజిక వర్గాలవారితో సమానంగా చూడటం లేదని జువల్ ఓరం వ్యాఖ్యానించారు. ‘అంతా విజయ్‌మాల్యాను విమర్శిస్తున్నారు. కానీ మాల్యా ఏం చేశారో గుర్తుచేసుకోంది. అతడు చాలా తెలివైనవాడు. ఎంతోమంది తెలివైనవాళ్లకు ఉపాధి కల్పించాడు. ప్రభుత్వానికి, రాజకీయ నాయకులకు, బ్యాంకులకు మాల్యా చాలా చేశాడంటూ’ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారాం రేపాయి. బ్యాంకులను ప్రభావితం చేయండి, ప్రభుత్వాలను, వ్యవస్థలను కాదని షెడ్యూల్డు కులాలవారిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుతం రూ.కోటి వరకు రాయితీతో గిరిజన పారిశ్రామికవేత్తలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోందని, దాన్ని రూ.5 కోట్లకు పెంచేలా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. అయితే మాల్యాను పొగడటం ఏంటని కేంద్ర మంత్రిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరణ ఇచ్చుకున్న మంత్రి ప్రసంగం మధ్యలో పొరపాటున విజయ్‌మాల్యా పేరును ప్రస్తావించాను. మరొకరి పేరును ప్రస్తావించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. దీనిపై జాతీయ మీడియ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘అనుకోకుండా మాల్యా విషయం తీసుకొచ్చా. అయితే ఉద్దేశపూర్వకంగా చేయలేదు. తెలివైన వ్యక్తి అని మరొకరి పేరు చెప్పి ఉంటే బాగుండేది. వా వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నానని’ కేంద్ర మంత్రి జువల్ ఓరం అన్నారు. -
గిరిజన పారిశ్రామికవేత్తలకు రూ.5 కోట్ల రాయితీ
సాక్షి, హైదరాబాద్: ఔత్సాహిక గిరిజన పారిశ్రామికవేత్తలకు భారీ రాయితీలిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటోందని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జోవల్ ఓరం పేర్కొన్నారు. ప్రస్తుతం రూ.కోటి వరకు రాయితీతో గిరిజన పారిశ్రామికవేత్తలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోందని, దాన్ని రూ.5 కోట్లకు పెంచేలా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. శుక్రవారం మారియట్ హోటల్లో జరిగిన నేషనల్ ట్రైబల్ ఎంటర్ప్రెన్యూర్ కాన్క్లేవ్–2018ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజనుల పట్ల వివక్ష ఇప్పటికీ కొనసాగుతోందని, కేంద్ర మంత్రి హోదాలోనూ వివక్షకు గురైన తీరును సభకు వివరించారు. ‘1999లో ఎంపీగా ఎన్నికై వాజ్‌పేయి ప్రభుత్వంలో పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి, చాంబర్లోకి వెళ్దామని బయల్దేరా. కానీ నాకు ప్రత్యేక చాంబర్ లేదు. దాంతో అందుకోసం పోరాడి సాధించా’అని వివరించారు. గిరిజనులు రిజర్వేషన్లతో లాభపడుతున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో వివక్షకు కూడా గురవుతున్నారని అన్నారు. రిజర్వేషన్ల వల్ల విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతున్నాయని, దీంతో వారి అభివృద్ధి వేగవంతమవుతుందన్నారు. అదేక్రమంలో గిరిజనులు తమ పేర్లను వారి సంప్రదాయాల ప్రకారం పెట్టుకోవడంతో సమాజంలో కొంత చిన్నచూపునకు గురవుతున్నారన్నారు. గిరిజన యువతలో నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, అందులో భాగంగా ప్రత్యేక రాయితీలిస్తూ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. డిక్కీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. నైపుణ్యమున్న గిరిజనులకు పెట్టుబడి రాయితీ: ఈటల రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ గిరిజనుల్లో నైపుణ్యం ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్థిక సహకారం అందిస్తోందన్నారు. మహిళలకు 45%, పురుషులకు 35% పెట్టుబడి రాయితీ ఇస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే నిర్మాణ పనుల్లోనూ గిరిజనులకు రిజర్వేషన్లు ఇస్తున్నామని వివరించారు. ఓన్ యువర్ కార్ పథకం కింద ఒక్క వాహనంపై రూ.5 లక్షలు రాయితీ ఇచ్చామని, గిరిజన రైతులకు 95% రాయితీతో ట్రాక్టర్లు పంపిణీ చేస్తున్నామని, వ్యవసాయ పనిముట్లన్నీ 95% రాయి తీతో అందిస్తున్నామని చెప్పారు. కార్పొరేట్ల దగ్గర ప్రాజెక్టు రిపోర్టు ఉందని, కానీ గిరిజనుల దగ్గర కమిట్మెంట్ ఉందని అన్నారు. 45 మంది కార్పొరేట్లకు రూ.7.3 లక్షల కోట్ల రుణం ఇచ్చిన బ్యాంకులు నైపుణ్యం ఉన్నవారికి మాత్రం రుణం ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయన్నారు. అనంతరం రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోందని, వాటిని నూరుశాతం అమలు చేయాలంటే అధికారుల చిత్తశుద్ధి తోడవ్వాలన్నారు. ప్రతి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తే గిరిజనుల అభివృద్ధి వేగంగా సాధ్యమవుతుందన్నారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రుడు, ఎంపీ సీతారామ్ నాయక్, ఎమ్మెల్యే రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
'మావోయిస్టులు ఉన్నారని వెళ్లలేదు'
న్యూఢిల్లీ : గిరిజన ప్రాంతాల్లో మావోయిస్టులు ఉన్నారు... ఈ నేపథ్యంలో భద్రత కారణాల దృష్ట్యా ఆయా ప్రాంతాల్లో పర్యటించ లేకపోయినట్లు సాక్షాత్తూ కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జుయల్ ఓరం వెల్లడించారు. గురువారం న్యూఢిల్లీలో రాష్ట్రాల గిరిజన సంక్షేమ మంత్రులు, ఆ శాఖ ముఖ్య కార్యదర్శుల సమావేశాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం వారిని ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన 'వన బందు కల్యాణ్ యోజన' పథకం పైలెట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఒక్కొ బ్లాక్‌ను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎంపిక చేసిన ఒక్కో బ్లాక్‌లోని గిరిజనల అభివృద్ధికి కేంద్రం రూ.10 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. గిరిజనల అభివృద్ధికి తమ మంత్రిత్వ శాఖ కృత నిశ్చయంతో ఉందన్నారు. గిరిజన సంక్షేమానికి రాష్ట్రాలు పోటీపడాలని ఆయన పిలుపు నిచ్చారు. అయితే తమ శాఖ పనితీరు అంత సంతృప్తికరంగా లేదన్నారు. గిరిజన సంక్షేమానికి రాష్ట్రాలు పోటీపడాలని ఆయన పిలుపు నిచ్చారు.