న్యూఢిల్లీ : గిరిజన ప్రాంతాల్లో మావోయిస్టులు ఉన్నారు... ఈ నేపథ్యంలో భద్రత కారణాల దృష్ట్యా ఆయా ప్రాంతాల్లో పర్యటించ లేకపోయినట్లు సాక్షాత్తూ కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జుయల్ ఓరం వెల్లడించారు. గురువారం న్యూఢిల్లీలో రాష్ట్రాల గిరిజన సంక్షేమ మంత్రులు, ఆ శాఖ ముఖ్య కార్యదర్శుల సమావేశాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం వారిని ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన 'వన బందు కల్యాణ్ యోజన' పథకం పైలెట్ ప్రాజెక్ట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, హిమాచల్ప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఒక్కొ బ్లాక్ను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎంపిక చేసిన ఒక్కో బ్లాక్లోని గిరిజనల అభివృద్ధికి కేంద్రం రూ.10 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. గిరిజనల అభివృద్ధికి తమ మంత్రిత్వ శాఖ కృత నిశ్చయంతో ఉందన్నారు. గిరిజన సంక్షేమానికి రాష్ట్రాలు పోటీపడాలని ఆయన పిలుపు నిచ్చారు. అయితే తమ శాఖ పనితీరు అంత సంతృప్తికరంగా లేదన్నారు. గిరిజన సంక్షేమానికి రాష్ట్రాలు పోటీపడాలని ఆయన పిలుపు నిచ్చారు.