![Amit Shah Admitted In AIIMS Hospital - Sakshi](/styles/webp/s3/article_images/2020/08/19/Amit.jpg.webp?itok=g9fBvwSx)
న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖమంత్రి అమిత్ షా మళ్లీ ఆసుపత్రిలో చేరారు. కోవిడ్ బారిన పడి కోలుకున్న ఆయన ఇటీవలే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. అయితే ఒళ్లునొప్పులు, నిస్సత్తువ తగ్గలేదని అమిత్ షా తెలిపిన నేపథ్యంలో ఆయన్ను ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చేర్పించారు. అమిత్ షా ఆరోగ్యం బాగానే ఉందని, ఆసుపత్రి నుంచి తన పనులు నిర్వహిస్తున్నారని ఎయిమ్స్ ఒక ప్రకటనలో తెలిపింది. కోవిడ్ బారిన పడ్డ సమయంలో అమిత్ షా ఢిల్లీలోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. వైద్యుల సూచనల ప్రకారం అమిత్ షా మరికొన్ని రోజులు హోమ్ ఐసోలేషన్‌లో ఉండనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment