సహృదయత చాటుకున్న రాహుల్‌ గాంధీ | Rahul Gandhi takes injured Journalist to hospital | Sakshi
Sakshi News home page

సహృదయత చాటుకున్న రాహుల్‌ గాంధీ

Published Thu, Mar 28 2019 5:08 AM | Last Updated on Thu, Mar 28 2019 5:08 AM

Rahul Gandhi takes injured Journalist to hospital - Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తన సహృదయతను చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఓ జర్నలిస్టును స్వయంగా తన కారులో తీసుకెళ్లి ఎయిమ్స్‌ ఆసుపత్రిలో చేర్పించారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్‌ స్టేడియంలో జరిగే ఓబీసీ సదస్సులో పాల్గొనేందుకు బుధవారం ఉదయం రాహుల్‌ బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో స్థానిక జర్నలిస్ట్‌ రాజీందర్‌ వ్యాస్‌ హుమయూన్‌ రోడ్డు పక్కన పడిపోయి ఉండటాన్ని గమనించారు. వెంటనే కారును ఆపిన రాహుల్‌.. రాజీందర్‌ను తన కారులో ఎక్కించుకుని ఎయిమ్స్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం తిరిగి ఓబీసీ సమావేశంలో పాల్గొనేందుకు తిరిగి బయలుదేరారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement