రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన జర్నలిస్ట్
అవయవదానం చేసిన కుటుంబ సభ్యులు
మల్కాపురం/సింహాచలం/తిరుపతి తుడా: రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన జర్నలిస్ట్ అవయవాలను దానం చేసి, వారి కుటుంబ సభ్యులు ఆదర్శంగా నిలిచారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌లో మల్కాపురం గొల్లవీధికి చెందిన ఉరుకూటి మురళీకృష్ణయాదవ్(52) ఓ పత్రికలో రిపోర్టర్‌గా పనిచేస్తూ సింహాచలం దరి అడవివరంలో మెడికల్ షాపు నిర్వహిస్తూ అక్కడే నివసిస్తున్నాడు.
అతనికి భార్య శిరీష, బీటెక్ చదువుతున్న కుమారుడు, బీటెక్ పూర్తిచేసిన కుమార్తె ఉన్నారు. ఈ నెల 14న బైక్ అదుపుతప్పి రోడ్డుపై పడటంతో తలకు గాయమై స్పృహ కోల్పోయాడు. చికిత్సకు స్పందించకపోవడంతో మంగళవారం వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు.
కుటుంబ సభ్యులు జీవన్‌దాన్ అధికారులకు సమాచారం అందించారు. జీవన్‌దాన్ కో ఆర్డినేటర్ డాక్టర్ రాంబాబు ఆస్పత్రికి వచ్చి, మృతుడి నుంచి రెండు కిడ్నీలు, కాలేయం, గుండె, కళ్లు సేకరించారు.
22 ఏళ్ల యువకుడికి గుండె మార్పిడి
ప్రకాశం జిల్లాకు చెందిన 22 ఏళ్ల యువకుడికి మురళీకృష్ణ యాదవ్ గుండెను తిరుపతిలోని శ్రీ పద్మావతీ కార్డియాక్ కేర్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా అమర్చారు.
Comments
Please login to add a commentAdd a comment