Woman Journalist Died In Road Accident Near Hyderabad Hayathnagar, Details Inside - Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. యంగ్‌ జర్నలిస్ట్‌ మృతి

Published Tue, Nov 22 2022 1:24 PM | Last Updated on Tue, Nov 22 2022 2:51 PM

Woman journalist Deceased in road accident in Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హయత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మూడు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదం ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు యువతులు తెల్లవారుజామున రోడ్డు దాటుతుండగా, ఓ కారు వేగంగా దూసుకొచ్చి వారిని ఢీ కొట్టింది.  ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రమాదానికి గురైన ఇద్దరు యువతులు ఓ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులుగా తెలుస్తోంది. అయితే ఘటన జరిగి మూడు రోజులవుతున్నప్పటికీ విషయం బయటకు రాకుండా పోలీసులు గోప్యంగా ఉంచడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

చదవండి: (రొటీన్‌గా చేస్తే పట్టించుకోం.. కానీ టార్గెట్‌గా నడుస్తోంది: మంత్రి తలసాని)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement