షారుక్ కు ఎండోస్కోపి చికిత్స
'హ్యాపీ న్యూ ఇయర్' చిత్ర షూటింగ్ లో గాయపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ త్వరలోనే ఎండోస్కోపి ఆపరేషన్ చేయించుకోనున్నారు. ఐఏఏ లీడర్ షిప్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న షారుక్ మాట్లాడుతూ.. గాయం నుంచి కోలుకున్నాను. ప్రస్తుతం సర్జరీ అవసరం లేదు. కాని ఎండోస్కోపి చికిత్స అవసరమైంది అని అన్నారు.
జనవరి 23 తేదిన 'హ్యాపీ న్యూ ఇయర్' షూటింగ్ లో చోటు జరిగిన ప్రమాదంలో షారుక్ గాయపడ్డారు. దాంతో రెండు, మూడు వారాల విశ్రాంతి తీసుకోవాలని.. రిస్క్ తో కూడిన ఫైట్స్ చేయకూడదని షారుక్ కు డాక్టర్లు సూచించారు. మరో నెల రోజుల విశ్రాంతి తర్వాత షూటింగ్ లో పాల్గొంటానని షారుక్ తెలిపారు.