
ఫాలోస్..!
నిన్నమొన్నటి దాకా ‘ఢీ అంటే ఢీ’ అనుకున్న సల్మాన్, షారూక్‌ఖాన్‌లు... చూస్తుంటే ఇప్పుడు ఒకరికొకరుగా మారినట్టున్నారు. సల్లూ భాయ్ చెల్లి అర్పితా పెళ్లిలో చాన్నాళ్ల తరువాత ఒక్కటైన ఈ ఇద్దరూ... ఒకరినొకరు ఫాలో కూడా అవుతున్నట్టున్నారు. ప్రస్తుతం సల్మాన్ వంతు. షారూఖ్ తరహాలో... తన చిత్రం ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ ప్రమోషన్ కోసం ప్రపంచ టూర్ ప్లాన్ చేశాడు కండల వీరుడు. ‘హ్యాపీ న్యూ ఇయర్’ సినిమాకు షారూఖ్ ప్రపంచమంతా చుట్టొచ్చాడు. ఆ స్ఫూర్తితో ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ను కూడా ఇలాగే ప్రమోట్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందట.