మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు: షారుక్
కోల్ కతా: బిగ్ బాస్ రియాల్టీ షోలో హ్యాపీ న్యూ ఇయర్ చిత్రాన్ని ప్రమోట్ చేసినందుకు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు షారుక్ ఖాన్ కృతజ్క్షతలు తెలిపారు. తన చిత్రాన్ని ప్రమోట్ చేయడంతో మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని మరోసారి స్పష్టమయ్యాయని షారుక్ అన్నారు. మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు అని షారుక్ అన్నారు.
సల్మాన్ చేసిన సహాయానికి హృదయ పూర్వకంగా కృతజ్క్షతలు తెలుపుతున్నానని షారుక్ అన్నారు. మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పడానికి వీలు చిక్కనపుడల్లా ప్రయత్నిస్తుంటాను అని ఆయన తెలిపారు. సల్మాన్ నాకు మంచి మిత్రుడు. సినిమాలంటే ఆయనకు పిచ్చి అని దర్శకురాలు ఫరా ఖాన్ అన్నారు.