జయ బచ్చన్ వ్యాఖ్యలపై స్పందించిన అభిషేక్
ముంబై: హ్యపీ న్యూ ఇయర్ చిత్రంపై తన తల్లి జయబచ్చన్ చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ తొలిసారి పెదవి విప్పారు. తన తల్లి జయబచ్చన్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని అభిషేక్ తెలిపారు. షారుక్ నిర్మించిన ఈ చిత్రంపై చెత్త చిత్రమంటూ జయబచ్చన్ వ్యాఖ్యలు చేసినట్టు ఓ కథనం మీడియాలో వచ్చింది. ఆతర్వాత అమితాబ్ బచ్చన్, షారుక్ లు వార్తను ఖండించారు.
జయబచ్చన్ మాట్లాడిన సమయంలో ఉన్న వారికి వాస్తవం తెలుసు. ఆ వ్యాఖ్యల్లో వాస్తవం లేదని రుజువైంది. ఆ వార్తను ప్రచురించిన వాళ్లే తెల్ల ముఖం వేయాల్సిన పరిస్థితి ఎదురైంది. మీడియా సెన్సేషనల్ వార్తల కోసం ప్రయత్నించడం చాలా ప్రమాదకరం.
సంచలన వార్తల కోసం ప్రయత్నించకుండా వాస్తవాలు రాయాల్సిన బాధ్యత మీడియాపై ఉందని అభిషేక్ అన్నారు. వివాదస్పద వ్యాఖ్యలు మీడియాలో రావడం చాలా దురదృష్టకరమైన సంఘటన అని అభిషేక్ అన్నారు. హ్యాపీ న్యూఇయర్ చిత్రంలో ఓ ప్రధాన పాత్రను అభిషేక్ బచ్చన్ పోషించిన సంగతి తెలిసిందే.