యాండ్రాలజీ కౌన్సెలింగ్
నా వయసు 23 ఏళ్లు. నేను ప్రతిరోజూ 3, 4 సార్లు హస్తప్రయోగం చేసుకుంటున్నాను. దీని వల్ల ఏమైనా ప్రమాదమా? అంగస్తంభనలు తగ్గుతాయా? భవిష్యత్తులో నాకు పిల్లలు పుట్టకుండా ఉండే అవకాశం ఉందా? అంగపరిమాణం చిన్నదిగా మారుతుందా? దయచేసి నా సందేహాలకు సమాధానాలు చెప్పగలరు. - జె.ఎ.ఎస్., ఈ-మెయిల్
యుక్తవయసు వచ్చిన కొత్తలో అంటే 18 ఏళ్ల నుంచి దాదాపు మీ వయసు వారికి సెక్స్ పట్ల విపరీతమైన ఆసక్తి ఉంటుంది. దాంతో వారు చిన్న చిన్న స్పందనలకే తేలిగ్గా ఎక్సయిట్ అవుతుంటారు. హస్తప్రయోగం చేసుకోడానికి ఆసక్తి చూపుతుంటారు. దీనివల్ల సెక్స్‌లో ఎలాంటి బలహీనతా రాదు. కాకపోతే అన్నిసార్లు హస్తప్రయోగం చేసుకున్నందు వల్ల శారీరకంగా కాస్త నీరసంగా అనిపించవచ్చు. అంతేతప్ప అంగస్తంభనలు తగ్గడమో లేదా మీ సెక్స్ సామర్థ్యానికి లోపం రావడమో వంటి సమస్యలు రావు. ఈ వయసులో హస్తప్రయోగం చేసుకోవడం వల్ల భవిష్యత్తులో పిల్లలు పుట్టకుండా పోవడం అంటూ జరగదు. ఒకవేళ భవిష్యత్తులో పిల్లలు కలగకపోతే అది ఇతర సమస్యల వల్ల జరిగితే జరగవచ్చునేమోగానీ, మీరు ఈ వయసులో చేసిన హస్తప్రయోగం వల్ల భవిష్యత్తులో పిల్లలు కలగకుండా ఉండటం జరగదు. మీలాంటి చాలామంది యువకులు హస్తప్రయోగం తర్వాత స్తంభన (ఎరెక్షన్) తగ్గిన తమ పురుషాంగాన్ని చూసి, అది చిన్నదిగా మారినట్లుగా అపోహ పడుతుంటారు. అంతేగాని హస్తప్రయోగం వల్ల పురుషాంగం చిన్నదిగా మారడం జరగదు.
నా వయసు 36 ఏళ్లు. గత రెండేళ్లుగా వుూత్రంలో విపరీతమైన వుంట. నాకు మూత్రధార సరిగా రావడం లేదు. సెక్స్ చేసినప్పుడు వీర్యం సరిగా రావడం లేదు. పై సమస్యలతో తీవ్రమైన బాధ అనుభవిస్తున్నాను. సెక్స్ చేసినా, వుూత్రం పోసినా పొత్తికడుపులో బిగదీసుకుపోరుునట్లుగా ఉంటోంది. దాంతో సెక్స్ అంటేనే భయుమేస్తోంది. నాకు తగిన సలహా ఇవ్వండి.- పి.వి.ఎస్., నిజామాబాద్
మీరు ముందుగా రెట్రోగ్రేడ్ యురెథ్రోగ్రామ్ (ఆర్‌జీయుూ) అనే పరీక్ష చేరుుంచుకోవాలి. దీనివల్ల వుూత్రనాళంలో ఏదైనా అడ్డంకి (బ్లాక్) ఉందేమో తెలుస్తుంది. అలా ఉంటే ఎండోస్కోపీ ప్రక్రియ ద్వారా వుూత్రనాళాన్ని వెడల్పు చేరుుంచుకుంటే వుూత్రం, వీర్యం రెండూ ఫ్రీగా రావడానికి అవకాశం ఉంటుంది. మీరు వెంటనే యుూరాలజిస్ట్‌ను సంప్రదించండి.
నా వయుసు 30 ఏళ్లు. నా వృషణాల్లో నొప్పి వస్తోంది. లాగుతున్న ఫీలింగ్ కూడా ఉంది. వృషణాల సైజ్ చిన్నవిగా వూరాయుని అనిపిస్తోంది. దయుచేసి నా సవుస్యకు సలహా ఇవ్వండి. - డి.వై.ఆర్., చిత్తూరు
చాలా వుందిలో తవు వృషణాలు చిన్నవేమో అనే అపోహ ఉంటుంది. మీకు ఇతరత్రా ఏ ఇబ్బందులూ లేకపోతే దాని గురించి ఆందోళన పడాల్సిన అవసరమే లేదు. అరుుతే తవు వృషణాలు వుుందు పెద్దవిగా ఉండి, ఇప్పుడు అవి చిన్నవిగా అరుుపోరుు ఉండి, నొప్పి లేదా లాగుతున్నట్లుగా ఉంటే మాత్రం దానికి కారణం వేరికోసిల్ అరుువుండవచ్చునని అనువూనించాలి. కాబట్టి మీరు ఒకసారి యుూరాలజిస్ట్‌ను సంప్రదించండి. మీకు డాప్లర్ అల్ట్రాసౌండ్ అనే పరీక్ష చేరుుంచి ఏదైనా సమస్య ఉందా అన్న విషయాన్ని తెలుసుకుంటారు. మీకు సమస్యను బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది.
నా వయుస్సు 50 ఏళ్లు. తరచూ నడువుు నొప్పి వస్తోంది. డాక్టర్‌కు చూపించాను. వుూత్రాశయుం గోడలు వుందంగా మారినట్లు పరీక్షల్లో తేలింది. ప్రోస్టేట్ గ్రంథి పెరిగిందనీ, సిస్టైటిస్ విత్ బీపీహెచ్ అని డాక్టర్ చెబుతున్నారు. ఆపరేషన్ చేరుుంచాలని డాక్టర్ అంటున్నారు. శస్త్రచికిత్స చేయించుకోవడం నాకు ఇష్టం లేదు. నా సమస్యకు తగిన సలహా ఇవ్వండి. - ఆర్.కె.ఆర్., గుంటూరు
యూభై ఏళ్లు పైబడ్డ వారిలో నడువుు నొప్పికి చాలా కారణాలు ఉంటారుు. కండరాల్లో నొప్పి, ఎవుుకల్లో నొప్పి, కిడ్నీలో రాళ్లు... ఇలాంటివి సాధారణంగా కనిపించే కారణాలు. తరచూ వుూత్రంలో ఇన్ఫెక్షన్ వచ్చి వుూత్ర విసర్జన సరిగా లేకపోయినా, వుూత్రం వుంటగా ఉండి, ధార సరిగ్గా రాకపోరుునా కూడా నడువుు నొప్పి రావచ్చు. మీరు ప్రోస్టేట్ గ్రంథికి సంబంధించిన పరీక్షలన్నీ చేరుుంచుకొని వుూత్ర సంబంధమైన సవుస్యలు ఉంటే, వాటికి చికిత్స చేయించుకోవడం వల్ల నడుం నొప్పి తగ్గవచ్చు. అరుుతే... యాభై ఏళ్ల వయసుకే ప్రొస్టేట్ సవుస్య రావడం అరుదు. అందువల్ల సర్జరీ గురించి ఇప్పుడే ఆలోచించాల్సిన అవసరం లేదు. మీ నడుం నొప్పికి అసలు కారణం కనుక్కోవడం ముందుగా జరగాల్సిన పని. మీరు చెబుతున్న సిస్టైటిస్‌ను యూంటీబయూటిక్స్ ద్వారా తగ్గించుకోవచ్చు. మీరు యూరాలజిస్ట్‌ను కలవండి.
నాకు పెళ్లయి ఆర్నెల్లకు పైగా అయ్యింది. పెళ్లయిన మొదట్లో కొన్ని రోజులు జంకుతో నేను సెక్స్‌లో పాల్గొనలేకపోయాను. తర్వాత కూడా సెక్స్ చేయబోతే అంగస్తంభన సరిగా కాలేదు. మొదట్లో ఏమీ అనకపోయినా ఇటీవల నా భార్య నా పట్ల చాలా అసంతృప్తిగా ఉంటోంది. నాకేమో కొద్దిగా అంగస్తంభన అయి మళ్లీ చాలా త్వరగా వీర్యస్ఖలనం అయిపోతోంది. దాంతో తాను అసహనం ప్రదర్శిస్తోంది. నాకూ నిరాశగా ఉంటోంది. అంతకు ముందు అంగస్తంభనలు చక్కగా జరిగేవి. హస్తప్రయోగం కూడా చేసేవాడిని. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. - డీ.ఎస్.ఆర్., ఖమ్మం
సాధారణంగా పెళ్లయిన కొత్తలో కాస్త బెరుకుగా ఉంటుంది. ఆ తర్వాత దంపతుల మధ్య సాన్నిహిత్యం పెరిగి, అంగస్తంభన మామూలుగానే జరిగిపోతుంది. కానీ చాలా సందర్భాలలో మానసిక కారణాల వల్లగాని, ఒకరిపై మరొకరికి పూర్తిగా ఇష్టం కలగకపోవడం వల్లగాని, పార్ట్‌నర్స్ మధ్య మనస్పర్థల వల్లగాని ఇలా మీకు జరిగినట్లుగా అంగస్తంభన పూర్తిగా జరగకపోవడం, వీర్యం త్వరగా పడిపోవడం వంటివి జరగవచ్చు. పెళ్లికాక ముందు మీకు అంగస్తంభనలు చక్కగా ఉండి, హస్తప్రయోగం కూడా చేసుకునేవాడినని చెబుతున్నారు కాబట్టి మీలో సెక్స్ పరమైన లోపం లేదనే చెప్పవచ్చు. కాబట్టి ముందుగా మీరు దగ్గర్లోని డాక్టర్‌ను కలిసి, కౌన్సెలింగ్ చేయించుకుని, సెక్స్‌లో పాల్గొనండి. అప్పటికీ ప్రయోజనం లేకపోతే సెక్స్‌ను ప్రేరేపించే మందులు వాడటం వల్ల తప్పకుండా ఉపయోగం ఉంటుంది. వాటితో మీ సమస్య చాలా తేలిగ్గా పరిష్కృతమవుతుంది. ఒకసారి మీకు దగ్గర్లోని యాండ్రాలజిస్ట్/యూరాలజిస్ట్‌ను కలవండి.
నా వయసు 45 ఏళ్లు. నేను బెంగళూరులో ఉంటాను. నా భార్య హైదరాబాద్‌లో ఉంటుంది. చాలారోజులుగా నేను సెలవు తీసుకోలేదు. ఆరు నెలల తర్వాత నేను హైదరాబాద్ వెళ్లినప్పుడు నా భార్యతో సెక్స్‌లో పాల్గొనబోయాను. అంగస్తంభన అంతంత మాత్రమే. పైగా వీర్యం చాలా త్వరగా పడిపోతోంది. ఆర్నెల్లకోసారి సెక్స్‌లో పాల్గొనబోతే ఇలా జరగడంతో చాలా నిరాశపడుతున్నాను. నాలో మునుపటి సామర్థ్యం పెరిగేందుకు సూచనలు ఇవ్వండి. - జే.వి.ఆర్., బెంగళూరు
చాలా రోజుల వ్యవధి తర్వాత ఎప్పుడో ఒకసారి సెక్స్‌లో పాల్గొంటే ఇలా శీఘ్రస్ఖలనం (ప్రీ-మెచ్యుర్ ఇజాక్యులేషన్) జరగడం చాలా మామూలు విషయమే. అయితే మీకు అంగస్తంభనలు నార్మల్‌గా ఉండాలి. మీ శారీరక దారుఢ్యం బాగానే ఉన్నదా అని తెలుసుకునేందుకు ముందుగా కొన్ని వైద్య పరీక్షలు అవసరం. కొలెస్ట్రాల్, బ్లడ్‌షుగర్, హార్మోన్ పరీక్షలు చేయించుకుని అవి నార్మల్‌గా ఉంటే టాడాల్ఫిన్ వంటి మందులు వాడటం వల్ల చాలావరకు పరిస్థితి మెరుగవుతుంది. అయితే దీనికంటే ముందర శారీరక, మానసిక దారుఢ్యం కోసం ప్రతిరోజూ వాకింగ్, జాగింగ్, యోగా వంటివి చేయడం వల్ల చాలామట్టుకు ప్రయోజనం ఉంటుంది. శీఘ్రస్కలనం సమస్యకు ఇప్పుడు తక్కువ వ్యవధిలోనే మంచి ఫలితాలను ఇచ్చే మందులు అందుబాటులోకి వచ్చాయి కాబట్టి మీరు అంత నిరాశ పడాల్సిన అవసరం లేదు.
ప్రొస్టేట్ పెరిగితే ఆపరేషన్ తప్పదా?
Published Thu, Aug 27 2015 11:23 PM | Last Updated on Sun, Apr 7 2019 4:36 PM
Advertisement
Advertisement