
ఉద్యోగాలు, వ్యాపారాల రీత్యా చాలా మంది భారతీయులు విదేశాల్లో ఉంటున్నారు. అయితే వారి బెంగ అంతా భారత్‌లో ఉంటున్న తమ తల్లిదండ్రుల ఆరోగ్యంపైనే ఉంటుంది. ఇలాంటి ఎన్‌ఆర్‌ఐల కోసమే డోజీ అనే కంపెనీ డోజీ శ్రవణ్ పేరుతో క్లినికల్-గ్రేడ్ ఏఐ ఆధారిత రిమోట్ పేరెంట్ మానిటరింగ్ సర్వీస్‌ను ఆవిష్కరించింది.
డోజీ శ్రవణ్‌తో విదేశాలలో ఉన్న ఎన్‌ఆర్‌ఐలు భారత్‌లోని తమ తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా ట్రాక్ చేయొచ్చు. డోజీ ఏఐ ఆధారిత, కాంటాక్ట్‌లెస్ రిమోట్ హెల్త్ మానిటరింగ్ టెక్నాలజీ వృద్ధులకు ఎటాంటి ఇబ్బంది లేకుండా వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించి కుటుంబ సభ్యులకు, వైద్యులకు చేరవేస్తుంది.
ఏఐ ఆధారిత బలిస్టోకార్డియోగ్రఫీతో రూపొందించిన ఈ సిస్టమ్ బయోమార్కర్‌లను విశ్లేషించడానికి, ఏవైనా వ్యత్యాసాలుంటే సకాలంలో హెచ్చరికలను అందించడానికి అధునాతన ఏఐ అల్గారిథమ్‌లను ఉపయోగిస్తుంది. ఆరోగ్య అత్యవసర పరిస్థితుల ప్రమాదాన్ని తగ్గించి సకాలంలో వైద్య సేవలు పొందేలా చేస్తుంది. ఈ సాంకేతికత యూఎస్ ఎఫ్‌డీఏ ఆమోదం పొందింది. డేటా గోప్యత విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలకు కట్టుబడి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment