parent
-
బాబు పరీక్షలు మాకు పరీక్ష పెడుతున్నాయి
మా అబ్బాయి ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నాడు. స్వతహాగా మంచి తెలివైనవాడే. కానీ ఇటీవల పరీక్షలకు సరిగా ప్రిపేర్ కావడంలేదు. మొదటినుండి చదవకుండా పరీక్షలకు ముందు, తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నాడు. దాంతో మార్కులు బాగా తగ్గుతున్నాయి. బాబు పరీక్షలు మాకు ఒక గండంలాగా అనిపిస్తున్నాయి. బాబు విషయంలో నాకు, మా ఆయనకు మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయి. ఇద్దరి మధ్య నలిగిపోతున్నాను. ఈ విషయంలో ఏం చేయమంటారో సలహా ఇవ్వండి. – రాజ్యలక్ష్మి, హైదరాబాద్‌బాబు విషయంలో మీరెంత టెన్షన్‌కు గురవుతున్నారో అర్థమవుతోంది. చదువు, పరీక్షల విషయంలో మీ బాబు ఎదుర్కొంటున్న సమస్య చాలా సాధారణమైనదే. ఎంత బ్రిలియంట్ స్టూడెంట్స్ అయినా, పరీక్షల ముందర కొంత ఒత్తిడిని తప్పకుండా ఎదుర్కొంటారు. ఈ ఒత్తిడి వల్ల మంచి తెలివితేటలు గల విద్యార్థులు కూడా పరీక్షలు సరిగా రాయలేక ర్యాంకు తగ్గి΄ోతుంది. ఇలాంటి విషయంలో, మీరు ఓపికతో బాబును దారిలో పెట్టే ప్రయత్నం చేయాలి. దీనికి మీవారి సహకారం కూడా చాలా అవసరం. టైమ్ మేనేజ్మెంట్, నోట్స్ సరిగా రాసుకోవడం, మెమరీ టెక్నిక్స్ లాంటివి ఇలాంటి విద్యార్థులకు చాలా అవసరం. బాబు చదువుకోవడానికి రోజూవారి ఒక టైమ్ టేబిల్ తయారు చేసి, చదవవలసిన సబ్జెక్ట్స్‌ను చిన్న చిన్న పోర్షన్స్‌గా విభజించి, వాటిని క్రమంగా పెంచుతూపోవడం లాంటివి బాగా పనిచేస్తాయి. అతని ఏకాగ్రతకు భంగం కలగకుండా ఇంట్లో టి.వి. పెట్టడం, ఫంక్షన్స్ పెట్టుకోవడం, ఇతరుల ఇళ్లలో జరిగే ఫంక్షన్స్‌కు వెళ్లడం లాంటివి లేకుండా చేయండి. వీలైతే బాబుకు తోడుగా మీరు కూడా పక్కన ఉండి ధైర్యం చెప్పండి. ధ్యానం, జాకబ్ సన్స్ రిలాక్సేషన్ అనే టెక్నిక్, ఈ పరీక్షల భయాన్ని బాగా తగ్గిస్తాయి. ఫలితంపై కాకుండా అతని ప్రయత్నం పైన దృష్టి పెట్టమని చెప్పండి. ఇంకా అవసరమైతే మంచి సైకియాట్రిస్ట్ లేదా క్లినికల్ సైకాలజిస్ట్‌కు చూపించి, కౌన్సిలింగ్ ఇప్పించండి. మీ బాబు భవిష్యత్తు కోసం, మీరు మీ వారు చక్కగా చర్చించుకొని, ఒక టీమ్ లాగా ముగ్గురూ కలిసి పని చేయండి. ఆశావాదంతో మీరు, మీ అబ్బాయి ముందుకెళితే, బాబు తన పరీక్షల భయాన్ని పూర్తిగా అధిగమించగలడు. ఆల్ ది బెస్ట్! ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. (మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com)(చదవండి: సింగిల్ పేరెంటింగ్ సవాలుని సులభంగా అధిగమించండిలా..!) -
కన్నవారి ఆరోగ్యంపై బెంగ.. ఎన్ఆర్ఐల కోసం ఏఐ పరిష్కారం
ఉద్యోగాలు, వ్యాపారాల రీత్యా చాలా మంది భారతీయులు విదేశాల్లో ఉంటున్నారు. అయితే వారి బెంగ అంతా భారత్‌లో ఉంటున్న తమ తల్లిదండ్రుల ఆరోగ్యంపైనే ఉంటుంది. ఇలాంటి ఎన్ఆర్ఐల కోసమే డోజీ అనే కంపెనీ డోజీ శ్రవణ్ పేరుతో క్లినికల్-గ్రేడ్ ఏఐ ఆధారిత రిమోట్ పేరెంట్ మానిటరింగ్ సర్వీస్‌ను ఆవిష్కరించింది.డోజీ శ్రవణ్‌తో విదేశాలలో ఉన్న ఎన్ఆర్ఐలు భారత్‌లోని తమ తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా ట్రాక్ చేయొచ్చు. డోజీ ఏఐ ఆధారిత, కాంటాక్ట్‌లెస్ రిమోట్ హెల్త్ మానిటరింగ్ టెక్నాలజీ వృద్ధులకు ఎటాంటి ఇబ్బంది లేకుండా వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించి కుటుంబ సభ్యులకు, వైద్యులకు చేరవేస్తుంది.ఏఐ ఆధారిత బలిస్టోకార్డియోగ్రఫీతో రూపొందించిన ఈ సిస్టమ్ బయోమార్కర్లను విశ్లేషించడానికి, ఏవైనా వ్యత్యాసాలుంటే సకాలంలో హెచ్చరికలను అందించడానికి అధునాతన ఏఐ అల్గారిథమ్‌లను ఉపయోగిస్తుంది. ఆరోగ్య అత్యవసర పరిస్థితుల ప్రమాదాన్ని తగ్గించి సకాలంలో వైద్య సేవలు పొందేలా చేస్తుంది. ఈ సాంకేతికత యూఎస్ ఎఫ్‌డీఏ ఆమోదం పొందింది. డేటా గోప్యత విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలకు కట్టుబడి ఉంది. -
స్ట్రిక్ట్ మామ్ కాజోల్: సరిగా చేస్తే హెలికాప్టర్ పేరెంటింగ్ విధానం బెస్ట్!
పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల వైఖరే వారి ఎదుగదలకు కీలకం. అందుకనే ఈ విషయంలో చాలామంది తల్లిదండ్రులు చాలా కేర్ తీసుకుంటారు. పిల్లలను మరీ గారాభం చేస్తున్నామా, మరీ కఠినంగా వ్యవహరిస్తున్నామా అని సందేహిస్తుంటారు. ఒక్కోసారి మనం వారి సంరక్షణార్థం స్ట్రిక్ట్‌గా ఉన్నా అపార్థం చేసుకునే పిల్లలు కూడా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న తల్లిదండ్రులకు సెలబ్రిటీలు, ప్రముఖుల పేరెంటింగ్ విధానం కాస్త హెల్ప్ అవుతోంది. ఈ నేపథ్యంలో 90ల నాటి కుర్రాళ్ల క్రష్, బాలీవుడ్ దిగ్గజ నటి కాజోల్ విశ్వసించే పేరెంటింగ్ విధానం గురించి తెలుసుకుందామా..!బాలీవుడ్ నటి కాజోల్ అంటో ఇష్టపడని వారుండరు. తన అందమైన కళ్లతో కుర్రకారుని కట్టిపడేసింది. ఐదుపదుల వయసు దాటినా ఇప్పటికీ ఆమె క్రేజ్ తగ్గలేదనే చెప్పొచ్చు. ఇక నటుడు అజయ దేవగన్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత అడపదడపా సినిమాలు చేస్తు తల్లిగా ఇంటి బాధ్యతలను నిర్వర్తిస్తోంది. ఇక పలు ఇంటర్వ్యూల్లో కాజోల్ స్ట్రిక్ట్ మామ్ అని ఆమె పిల్లలు నైసా, దేవగన్‌లు చెప్పడం చూశాం కూడా. అలాగే కాజోల్ కూడా పిల్లల పెంపకంలో తాను చాలా కఠినంగా వ్యవహరిస్తానని ఒప్పుకుంది కూడా. అంతేగాదు తాను పిల్లల పెంపకంలో 'హెలికాప్టర్ పేరెంటింగ్ విధానమే' సరైనది విశ్వసిస్తానని చెబుతోంది. నిజానికి కాజోల్ 'హెలికాప్టర్ ఈలా' అనే బాలీవుడ్ మూవీలో తల్లిపాత్రను పోషించింది కూడా. అయితే అందులో ఉన్నట్లు పిల్లల జీవితంలో అతి ప్రమేయం ఉన్న తల్లిగా మాత్రం వ్యవహరించకున్నా.. కొన్ని విషయాల్లో మాత్రం స్ట్రిక్ట్‌గా పట్టించుకుంటానంటోంది కాజోల్. నిజానికి ఈ పేరెంటింగ్ విధానాన్ని నెగిటివ సెన్స్‌లో వాడతారు. ఎందుకంటే ఈ హెలికాప్టర్ పేరెంటింగ్ విధానంలో పిల్లల ప్రతి కదలికను వారి నియంత్రణలోకి ఉంచుకునే తల్లిదండ్రులకు నిపుణలు ఈ పేరుపెట్టడం జరిగింది. ఇక్కడ పిల్లలను మరీ అంతలా కట్టడి చేయకపోయినా, ఇప్పుడున్న ఆధునిక సంస్కృతిలో కాస్త నియంత్రణ అవసరమే అంటోంది కాజోల్. ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో పిల్లలు ఈజీగా దేన్నైనా నేర్చుకోగలరు, పాడైపోగలరు కాబట్టి ఆ పేరెంటింగ్ స్టైలే మంచిదని చెబుతోంది కాజోల్. ప్రతిదాంట్లో జోక్యం తగదు..వాళ్ల సొంత గుర్తింపు కోసం పాటుపడేలే మనం కాస్త కఠినంగా వ్యవహరించాలి. అలాగే కొన్ని విషయాల్లో ఓ కంట కనిపెడుతూ..ప్రశ్నించాల్సిందే. ఏమరపాటున ఉంటే దారితప్పే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తోంది. ఇక్కడ హెలికాప్టర్ విధానం మాదిరిగా వాళ్లకంటూ స్పేస్ లేకుండా పిల్లలకు సంబంధించిన ప్రతిదాంట్లో వేలు పెట్టకూడదు తల్లిదండ్రులు. వారితో టచ్‌లో ఉంటూ వాళ్ల ప్రతి విషయం తాము కనిపెడుతున్నామనే భయం వారిలో కలిగించాలని చెబుతోంది కాజోల్.భయంతో కూడిన గౌరవం..అంతేగాదు తప్పు చేయాలనే ఆలోచన, లేదా తప్పు చేసినా.. తల్లిదండ్రులకు చెప్పేయడమే మంచిది లేదంటే అమ్మ మాట్లాడదు అనే భయంతో కూడిన గౌరవం కలగచేసేలా పెంచాలని చెబుతోంది. ఈ హెలికాప్టర్ పేరెంటింగ్ విధానం సరిగా ఉపయోగిస్తే పిల్లల పెంపకంలో మంచి హెల్ప్ అవుతుందని నమ్మకంగా చెబుతోంది. ఈ విధానం వల్ల చెడు అలవాట్లు, ఆర్థిక పరిస్థితి పట్ల కరెక్ట్‌గా వ్యవహరించడం వంటివి చేయగలుగుతారు." తాను ఇలా ఉండటం వల్లే తన కూతరు పబ్లిక్ ప్రదేశాల్లో ఎలా వ్యవహరించాలో నేర్చుకుంది. పాప్ సంస్కృతిని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకుంది. మీ తల్లిదండ్రుల వల్లే ఇలా లగ్జరియస్‌గా బతుకుతున్నారనే విషయం పదే పదే చెబుతాను. డబ్బు విలువ తెలిపేందుకు ఎంత చిరాకు తెచ్చుకున్నా సరే.. వాళ్ల పాకెట్ మనీలో కొంత భాగం అడుగుతుంటానని చెబుతోంది." కాజోల్. ప్రతి తల్లిదండ్రలు ఇలా వ్యవహరిస్తే.. పిల్లల బంగారు భవిష్యత్తును ఎలాంటి మచ్చ లేకుండా శోభాయమానంగా ఉంటుందని నమ్మకంగా చెబుతోంది. (చదవండి: ఒకప్పుడు ట్రాన్స్ జెండర్‌గా బిక్షాటన ..నేడు ఒక అమ్మాయిని దత్తత తీసుకుని..!) -
19 ఏళ్ల యువకుడిని ట్రాప్ చేసిన మహిళ.. హెచ్ఆర్సీని ఆశ్రయించిన తండ్రి
గచ్చిబౌలి(హైదరాబాద్): తన కొడుకు అలెక్స్‌ను ఓ యువతి ట్రాప్ చేసి తమ వద్దకు రాకుండా చేస్తుందని సుదర్శన్నగర్కు చెందిన బాబురావు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. బట్టల షాపులో పనిచేసే సదరు యువతి బంధువుల సాయంతో ట్రాప్ చేసి కిడ్నాప్ చేసిందన్నారు. గచ్చిబౌలి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినా అలెక్స్ స్టేట్మెంట్ రికార్డు చేసి పంపారని తెలిపారు. అతను మేజర్ అని ఎక్కడైనా ఉండవచ్చని పోలీసులు తెలిపారని, కానీ బాల్య వివాహ చట్టంలో 19 ఏళ్లకు పెళ్లి చేసుకోవడం నేరమని ఆయన పేర్కొన్నారు. కొడుకు చదువు, భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని జాతీయ, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లలో ఫిర్యాదు చేశానని ఆయన పేర్కొన్నారు. చదవండి: ఏమైందో ఏమో.. అన్నయ్య విదేశాలకు వెళ్లిపోవడంతో.. జూన్‌లో పీఎస్‌లో ఫిర్యాదు తన కొడుకు అలెక్స్‌ను ఓ యువతి కిడ్నాప్ చేసిందని గత జూన్ 26న గచ్చిబౌలి ఠాణాలో బాబురావు ఫిర్యాదు చేశారు. జూన్ 28న ఇద్దరినీ పీఎస్‌కు రప్పించి విచారించగా తాము జూన్ 27న బీహెచ్ఈఎల్లోని దేవాలయంలో పెళ్లి చేసుకున్నామని ఫొటోలు చూపించారు. నేను మా తల్లిదండ్రుల వద్దకు వెళ్లనని, నా బతుకు నే బతుకుతానని అలెక్స్ తెగేసి చెప్పాడు. అలెక్స్, జ్యోతిలు పెద్దలకు దూరంగా బతుకుతామని, ఎవరు కిడ్నాప్ చేయలేదని లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చారు. దీంతో బాబురావు హెచ్ఆర్సీని ఆశ్రయించాడు. -
రెండోసారి తండ్రి అయిన ప్రముఖ సింగర్.. పోస్ట్ వైరల్
Singer Ed Sheeran Announces The Birth Of Second Daughter Post Viral: బ్రిటిష్ సింగర్, పాటల రచయిత ఎడ్ షీరాన్ రెండోసారి తండ్రి అయ్యాడు. ఎడ్, తన భార్య చెర్రీ సీబోర్న్ వారి రెండో కుమార్తెకు ఆహ్వానం పలికారు. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశాడు. 'మాకు మరో అందమైన ఆడపిల్ల పుట్టిందని మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాం. మేమిద్దరం ఆమెను ఎంతో ప్రేమిస్తున్నాం.' అని రాస్తూ ఒక చిన్ని సాక్స్ జత పిక్‌ను పోస్ట్ చేశాడు ఎడ్. అలాగే తన కుమార్తె పుట్టుక తన జీవితానికి కొత్త అర్థాన్ని ఇచ్చిందని చెప్పుకొచ్చాడు. ఈ పోస్ట్‌పై సింగర్ అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. తనకు 11 ఏళ్ల నుంచి పరిచయం ఉన్న సీబోర్న్ను ఎడ్ షీరాన్ 2019లో వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు 2020 ఆగస్టులో మొదటి కుమార్తె లైరా అంటార్కిటికా జన్మించింది. 31 ఏళ్ల ఎడ్ గత పదేళ్లలో అత్యంత పాపులర్ అయిన సింగర్. ఎడ్ మొదటిసారిగా 2011లో తన తొలి సింగిల్ 'ది ఏ టీమ్'తో అరగేంట్రం చేశాడు. 'షేఫ్ ఆఫ్ యూ' అనే సాంగ్ ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చదవండి: విజయ్ దేవరకొండతో రొమాంటిక్ మూవీ చేయాలనుంది: హీరోయిన్ View this post on Instagram A post shared by Ed Sheeran (@teddysphotos) -
తల్లయ్యాక ప్రియాంక షేర్ చేసిన ఫస్ట్ ఫొటో ఇదే!
Priyanka Chopra Shares First Photo As Mother: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. తర్వాత హాలీవుడ్లో అడుగు పెట్టి అందరి మన్ననలు పొందుతోంది. పలు చిత్రాల్లో నటించి హాలీవుడ్లో సైతం మంచి పాపులారిటీని దక్కించుకుంది. అనంతరం 2018లో రాజస్థాన్‌లో పాప్ సింగర్, నటుడు నిక్ జోనాస్‌ను వివాహం చేసుకుంది. హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం వీరి వివాహం జరిగింది. ఇటీవలే సరోగసి పద్ధతి ద్వారా జనవరి 22న ప్రియాంక, నిక్ జోనాస్ తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. ప్రియాంక తల్లి అయిన తర్వాత తన మొదటి పోస్ట్‌ను షేర్ చేసింది. మిర్రర్ సెల్ఫీ తీసుకున్న పిక్‌ను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది ప్రియాంక. అది సన్ కిస్డ్ ఫొటోలా అందంగా ఉంది. కొంచెం మేకప్, బ్లాక్ సన్‌గ్లాసెస్‌తో కార్ రైడ్ చేస్తూ ఈ ఫొటో దిగింది. ఈ పిక్కు 'కాంతి సరిగ్గా అనిపిస్తుంది' అని క్యాప్షన్ రాసింది. ఈ పోస్ట్ చూసిన అభిమానులు మమ్మీ అని పిలవడం దగ్గర్నుంచి ప్రియాంక అందాన్ని వర్ణించడం వరకు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కొందరు మాత్రం మీ బిడ్డను ఎప్పుడు చూపిస్తారని అడుగుతున్నారు. పోస్ట్‌ను షేర్ చేసిన కొన్ని గంటల్లోనే సుమారు 8 లక్షల లైక్‌లు వచ్చాయి. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
ఒంటరి పురుషులకు శిశు సంరక్షణ సెలవులు
న్యూఢిల్లీ: ఒంటరిగా ఉంటున్న పురుష ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఇకపై శిశు సంరక్షణ(చైల్డ్ కేర్) సెలవులు పొందవచ్చని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ తోమర్ సోమవారం చెప్పారు. అలాంటి వారిని సింగిల్ మేల్ పేరెంట్‌గా పరిగణిస్తామన్నారు. అవివాహితులు, భార్య మరణించిన వారు, విడాకులు తీసుకున్న వారు పిల్లలను సంరక్షించాల్సిన బాధ్యత ఉంటే ఈ సెలవులకు అర్హులని పేర్కొన్నారు. చైల్డ్ కేర్ లీవ్‌లో ఉన్నవారు లీవ్ ట్రావెల్ కన్సెషన్(ఎల్టీసీ) కూడా పొందవచ్చని సూచించారు. శిశు సంరక్షణ సెలవులో ఉన్నవారికి మొదటి 365 రోజులు పూర్తి వేతనం చెల్లిస్తారు. మరో 365 రోజులు కూడా ఈ సెలవులో ఉంటే 80 శాతం వేతనం చెల్లిస్తారు. చదవండి: బీమా ప్రకటనల నిబంధనల్లో మార్పులు -
పోషించలేక కన్నకూతురినే అమ్మేసిన తల్లిదండ్రులు
-
ఆత్మరక్షణలో జేసీ బ్రదర్స్
మితిమీరిన వివాదాస్పద వైఖరి పైలా నర్సింహయ్య విషయంలో జేసీ ప్రభాకర్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు ప్రభోదానంద ఆశ్రమ ఘటన వ్యవహారంలో ఇప్పటికే హెచ్ఆర్సీలో ఫిర్యాదు తాడిపత్రిలో అసాంఘిక శక్తులకు జేసీ బ్రదర్స్ అండ! క్రమంగా దూరమవుతున్న కేడర్ వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో అంతర్మథనం కేసులు, వేధింపులతో భయపెట్టే యత్నం వేదికనెక్కి మైకు పట్టుకుంటే చాలు.. ఆ నోటి నుంచి వచ్చే ప్రతి మాటకూ ప్రజల ముఖాల్లో చిరునవ్వు చిందుతోంది. సీరియస్‌గా చేస్తున్న ప్రసంగం కూడా నవ్వుల పువ్వులు పూయిస్తోంది. సీనియర్ నేతలు ఎలాంటి సందేశం ఇస్తారోనని ఎంతో ఆశతో వచ్చే ప్రజలు.. ఆ నేతల తీరుతో విసుగెత్తిపోతున్నారు. ఇదీ ఇటీవల కాలంలో జేసీ బ్రదర్స్ తీరు. జేసీ దివాకర్‌రెడ్డి నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ఎమ్మెల్యేగా.. మంత్రిగా సేవలందించారు. ఓ దశలో పీసీసీ చీఫ్ రేసులో నిలిచారు. ఆయన రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తుండటంతో తాడిపత్రి రాజకీయం సోదరుడు జేసీ ప్రభాకర్‌రెడ్డి చేతుల్లోకి వెళ్లింది. మున్సిపల్ వైస్ చైర్మన్‌గా పని చేసిన ప్రభాకర్ ఇప్పుడు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇంతటి రాజకీయ చరిత్ర కలిగిన ఈ నేతలు ఇద్దరూ ఇటీవల కాలంలో వివాదాస్పదమవుతున్నారు. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ప్రతి వేదికపైనా కనీస మర్యాద పాటించకుండా విమర్శలు గుప్పిస్తున్న తీరు జనాల్లో చర్చనీయాంశం అవుతోంది. ముఖ్యమంత్రితో వేదిక పంచుకున్న చాలా సందర్భాల్లో ఆయన వ్యవహారం ఇదే రీతిన ఉంటోంది. క్రమశిక్షణ కలిగిన పార్టీగా చెప్పుకునే చంద్రబాబు కూడా ఆయనను వారించాల్సింది పోయి.. తనలో తను నవ్వుకోవడం పార్టీ ప్రతిష్ట ఎంతలా దిగజారిపోయిందో చెప్పకనే చెబుతోంది. తాజాగా విజయవాడ, వైజాగ్ విమానాశ్రయాల్లో వీరంగం సృష్టించిన దివాకర్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చివరకు విమానయాన సంస్థలు ఆయనపై నిషేధం విధించడం గమనార్హం. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత దివాకర్‌రెడ్డితో పాటు ఆయన సోదరుడు ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వైఖరి మరింత వివాదాస్పదంగా ఉంది. ఎన్నికలకోడ్ అమలులో ఉన్న సమయంలో ఇటీవల అనంతపురం బైపాస్‌రోడ్డులో టెంటు వేసి విపక్షనేతపై దుర్భాషలాడారు. దీనిపై సోషియల్ మీడియాలో జేసీ బ్రదర్స్‌పై నెటిజన్లు తీవ్ర దాడి చేశారు. ట్రావెల్స్ వ్యవహారంలో తెలంగాణ ఆర్టీఓ కార్యాలయంలోనూ రగడ చేశారు. తాజాగా తాడిపత్రికి చెందిన పైలా నర్సింహయ్య ఓ వ్యక్తిపై దాడిచేసినట్లు తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. జేసీపీఆర్ ఒత్తిడితోనే ఈ కేసు నమోదు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి కోర్టులో లొంగిపోయారు. అనారోగ్యంతో ఉండటంతో కోర్టు ఆదేశాలతో ‘అనంత’ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. పైలా ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని, మెరుగైన వైద్యం కోసం నిమ్స్‌కు తరలించాలని మహేశ్ అనే డాక్టర్ సిఫారసు చేశారు. అయినప్పటికీ సూపరింటెండెంట్ జగన్నాథం పైలాను రెఫర్ చేయలేదు. జేసీ ప్రభాకర్‌రెడ్డి జోక్యంతోనే ఇతన్ని రెఫర్ చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ చర్య తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఓ రాజకీయనాయకుడు, తన నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి అనారోగ్యంగా ఉన్నప్పుడు చికిత్సకు సాయం చేయాల్సింది పోయి, ఇలా వ్యవహరించడమేంటని రాజకీయనేతలతో పాటు మేధావులు తప్పుబడుతున్నారు. దీంతో పాటు తాడిపత్రిలో శ్రీకృష్ణ ప్రాంగణంలో ప్రభోదానంద ఆశ్రమం నడుస్తోంది. నిర్వాహకులను జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో ఆశ్రమ నిర్మాణానికి ఆర్డీఓ అనుమతి తీసుకుని ఇసుక రవాణా చేస్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే ఒత్తిడితోనే పోలీసులు ఇలా వ్యవహరించారని ఆశ్రమ నిర్వాహకులు వాపోతున్నారు. ఇసుక వ్యవహారంలో వెంకటేశ్ అనే దళితుడిని కులం పేరుతో దూషించి, బెదిరించారని.. తనకు ప్రాణహాని ఉందని ప్రభాకర్‌రెడ్డిపై వెంకటేశ్ హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో దళితుల్లోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అసాంఘిక శక్తులకు అండగా? జేసీ బ్రదర్స్ తాడిపత్రిలో పేకాట, మట్కా నిర్వహించే వారికి అండగా ఉంటున్నారనే విమర్శలు ఉన్నాయి. తాడిపత్రి మునిసిపాలిటీ పాలకవర్గంలోని ఓ నేత తన ఇంట్లోనే పేకాట నిర్వహిస్తున్నారు. పోలీసులు కూడా పలుసార్లు తనిఖీలు చేసి చర్యలు తీసుకోలేకపోయారు. దీనిపై తాడిపత్రి వైఎస్సార్సీపీ ఇన్చార్జి పెద్దారెడ్డి బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీలో ఉండటంతో తమకు ఎదురులేకుండా పోయిందని భావించిన జేసీ బ్రదర్స్ ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతుండటం, వైఎస్సార్సీపీ సమన్వయకర్త పెద్దారెడ్డి రాకతో తాడిపత్రి వాసులు ప్రత్యామ్నాయం వైపు చూస్తుండటంతో ఆత్మరక్షణలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే అసమ్మతి గళం వినిపిస్తున్న వారిని కేసులతో భయపెట్టడం, వేధించడం చేస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అనంతపురం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గంపన్న సోదరుడికి ఫోన్ చేసి తీవ్ర పదజాలంతో దూషించి బెదిరించిన ఘటన వారి వైఖరికి ససాక్ష్యమని.. బయటికి రాని బెదిరింపులు ఇలా చాలా ఉన్నాయనేది విపక్షాల వాదన. ఈ పరిణామాలన్నీ జేసీ బ్రదర్స్ ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయనే చర్చ జరుగుతోంది. -
ఆడపిల్ల పుట్టిందని ఆస్పత్రిలో వదిలేశారు..
-
ఆడపిల్ల పుట్టిందని ఆస్పత్రిలో వదిలేశారు..
అప్పుడే పుట్టిన ఆడపిల్లను ఆస్పత్రిలోనే వదిలేసిన ఘటన అనంతపురంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో ఆదివారం సాయంత్రం పురుడు పోసుకున్న ఓ తల్లి.. అక్కడే విధులు నిర్వహిస్తున్న వాచ్ మెన్ చేతిలో బిడ్డను పెట్టి.. ఇప్పుడే వస్తామని అక్కడి నుంచి జారుకుంది. తల్లి ఎంతకీ తిరిగి రాకపోవడంతో.. ఆస్పత్రిలో కలకలం రేగింది. కాగా పసికూన తల్లిదండ్రులెవరో తెలియ రాలేదు. -
వరకట్నదాహానికి యువతి బలి!
-
ఆడపిల్ల పుట్టిందని.. చెత్తకుండీలో వేశారు
-
శ్వేతబసుకు కోర్టులో చుక్కెదురు!
హైదరాబాద్: సినీనటి శ్వేత బసును అప్పగించాలని కోర్టుకు ఆమె తల్లి తండ్రులు చేసిన విజ్క్షప్తిని సోమవారం ఎర్రమంజిల్ కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో శ్వేత బసు పెట్టుకున్న పిటిషన్ పై విచారణ జరిపారు. తల్లితండ్రులకు అప్పగించేందుకు కోర్టు నిరాకరించింది. అర్నెళ్లపాటు పునరావాస కేంద్రంలో ఉండాలని కోర్టు ఆదేశించింది. గత నెల వ్యభిచార కేసులో సినీనటి శ్వేతబసు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
అమరిక : బొమ్మలే కథలు చెబుతాయి!
‘కథ చెబుతాను... ఊఁ కొడతావా!’ అని పిల్లల్ని అడిగే పరిస్థితి ఇప్పుడు ఏ తల్లిదండ్రులకు ఉంది? ‘నాన్నా! కథ చెప్పవూ’ అని పిల్లలు అడిగితే ఏదో ఓ వంకతో తప్పించుకునే వాళ్లే ఎక్కువ. విశ్రాంత జీవనం గడుపుతూ పిల్లలకు కథలు చెప్పడంలో కాలం గడపాల్సిన తాతలు, నానమ్మలు కూడా తమకంటూ ఏదో ఓ వ్యాపకంలో బిజీగానే ఉంటున్నారు. కథలు పిల్లల్లో సృజనాత్మకతను పెంచుతాయి. కథ వింటూ నిద్రలోకి జారుకున్న పిల్లలు కథలో విన్న చెవుల పిల్లి, గున్న ఏనుగుతో కలల్లో కబుర్లు చెబుతారు. కథ చెప్పే సమయమూ, సహనమూ లేకపోతే ఒక ప్రత్యామ్నాయాన్ని వెతకండి. ఇదిగో... ఇలాంటి బెడ్రూమ్ని ఇస్తే పిల్లలు సొంతంగా కథ అల్లేసుకుంటారు. వినే ఓపిక ఉంటే ఒకే బొమ్మను చూపిస్తూ అమ్మానాన్నలకు బోలెడన్ని కథలు చెబుతారు. ఇందుకోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జిబిషన్లలో, బుక్‌షాపుల్లో ఇలాంటి కామిక్ బొమ్మలున్న వాల్పేపర్లు దొరుకుతాయి. వాటిని తెచ్చి పిల్లల బెడ్రూమ్ గోడకు అతికించడమే. అలాగే పిల్లల చేత బొమ్మలు గీయించి ఆ చార్టునే గోడకు అతికించవచ్చు. ఇలా నెలకో కొత్త బొమ్మ వేయమని సూచిస్తే చాలు. పిల్లలలోని సృజనాత్మకత బయటకు వస్తుంది, కొత్త కొత్త ఆలోచనలకు తెరతీస్తారు.