అప్పుడే పుట్టిన ఆడపిల్లను ఆస్పత్రిలోనే వదిలేసిన ఘటన అనంతపురంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో ఆదివారం సాయంత్రం పురుడు పోసుకున్న ఓ తల్లి.. అక్కడే విధులు నిర్వహిస్తున్న వాచ్ మెన్ చేతిలో బిడ్డను పెట్టి.. ఇప్పుడే వస్తామని అక్కడి నుంచి జారుకుంది.
తల్లి ఎంతకీ తిరిగి రాకపోవడంతో.. ఆస్పత్రిలో కలకలం రేగింది. కాగా పసికూన తల్లిదండ్రులెవరో తెలియ రాలేదు.