పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల వైఖరే వారి ఎదుగదలకు కీలకం. అందుకనే ఈ విషయంలో చాలామంది తల్లిదండ్రులు చాలా కేర్ తీసుకుంటారు. పిల్లలను మరీ గారాభం చేస్తున్నామా, మరీ కఠినంగా వ్యవహరిస్తున్నామా అని సందేహిస్తుంటారు. ఒక్కోసారి మనం వారి సంరక్షణార్థం స్ట్రిక్ట్‌గా ఉన్నా అపార్థం చేసుకునే పిల్లలు కూడా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న తల్లిదండ్రులకు సెలబ్రిటీలు, ప్రముఖుల పేరెంటింగ్ విధానం కాస్త హెల్ప్ అవుతోంది. ఈ నేపథ్యంలో 90ల నాటి కుర్రాళ్ల క్రష్, బాలీవుడ్ దిగ్గజ నటి కాజోల్ విశ్వసించే పేరెంటింగ్ విధానం గురించి తెలుసుకుందామా..!
బాలీవుడ్ నటి కాజోల్ అంటో ఇష్టపడని వారుండరు. తన అందమైన కళ్లతో కుర్రకారుని కట్టిపడేసింది. ఐదుపదుల వయసు దాటినా ఇప్పటికీ ఆమె క్రేజ్ తగ్గలేదనే చెప్పొచ్చు. ఇక నటుడు అజయ దేవగన్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత అడపదడపా సినిమాలు చేస్తు తల్లిగా ఇంటి బాధ్యతలను నిర్వర్తిస్తోంది. ఇక పలు ఇంటర్వ్యూల్లో కాజోల్ స్ట్రిక్ట్ మామ్ అని ఆమె పిల్లలు నైసా, దేవగన్‌లు చెప్పడం చూశాం కూడా.
అలాగే కాజోల్ కూడా పిల్లల పెంపకంలో తాను చాలా కఠినంగా వ్యవహరిస్తానని ఒప్పుకుంది కూడా. అంతేగాదు తాను పిల్లల పెంపకంలో 'హెలికాప్టర్ పేరెంటింగ్ విధానమే' సరైనది విశ్వసిస్తానని చెబుతోంది. నిజానికి కాజోల్ 'హెలికాప్టర్ ఈలా' అనే బాలీవుడ్ మూవీలో తల్లిపాత్రను పోషించింది కూడా. అయితే అందులో ఉన్నట్లు పిల్లల జీవితంలో అతి ప్రమేయం ఉన్న తల్లిగా మాత్రం వ్యవహరించకున్నా.. కొన్ని విషయాల్లో మాత్రం స్ట్రిక్ట్‌గా పట్టించుకుంటానంటోంది కాజోల్. నిజానికి ఈ పేరెంటింగ్ విధానాన్ని నెగిటివ సెన్స్‌లో వాడతారు.
ఎందుకంటే ఈ హెలికాప్టర్ పేరెంటింగ్ విధానంలో పిల్లల ప్రతి కదలికను వారి నియంత్రణలోకి ఉంచుకునే తల్లిదండ్రులకు నిపుణలు ఈ పేరుపెట్టడం జరిగింది. ఇక్కడ పిల్లలను మరీ అంతలా కట్టడి చేయకపోయినా, ఇప్పుడున్న ఆధునిక సంస్కృతిలో కాస్త నియంత్రణ అవసరమే అంటోంది కాజోల్. ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో పిల్లలు ఈజీగా దేన్నైనా నేర్చుకోగలరు, పాడైపోగలరు కాబట్టి ఆ పేరెంటింగ్ స్టైలే మంచిదని చెబుతోంది కాజోల్.
ప్రతిదాంట్లో జోక్యం తగదు..
వాళ్ల సొంత గుర్తింపు కోసం పాటుపడేలే మనం కాస్త కఠినంగా వ్యవహరించాలి. అలాగే కొన్ని విషయాల్లో ఓ కంట కనిపెడుతూ..ప్రశ్నించాల్సిందే. ఏమరపాటున ఉంటే దారితప్పే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తోంది. ఇక్కడ హెలికాప్టర్ విధానం మాదిరిగా వాళ్లకంటూ స్పేస్ లేకుండా పిల్లలకు సంబంధించిన ప్రతిదాంట్లో వేలు పెట్టకూడదు తల్లిదండ్రులు. వారితో టచ్‌లో ఉంటూ వాళ్ల ప్రతి విషయం తాము కనిపెడుతున్నామనే భయం వారిలో కలిగించాలని చెబుతోంది కాజోల్.
భయంతో కూడిన గౌరవం..
అంతేగాదు తప్పు చేయాలనే ఆలోచన, లేదా తప్పు చేసినా.. తల్లిదండ్రులకు చెప్పేయడమే మంచిది లేదంటే అమ్మ మాట్లాడదు అనే భయంతో కూడిన గౌరవం కలగచేసేలా పెంచాలని చెబుతోంది. ఈ హెలికాప్టర్ పేరెంటింగ్ విధానం సరిగా ఉపయోగిస్తే పిల్లల పెంపకంలో మంచి హెల్ప్ అవుతుందని నమ్మకంగా చెబుతోంది. ఈ విధానం వల్ల చెడు అలవాట్లు, ఆర్థిక పరిస్థితి పట్ల కరెక్ట్‌గా వ్యవహరించడం వంటివి చేయగలుగుతారు.
" తాను ఇలా ఉండటం వల్లే తన కూతరు పబ్లిక్ ప్రదేశాల్లో ఎలా వ్యవహరించాలో నేర్చుకుంది. పాప్ సంస్కృతిని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకుంది. మీ తల్లిదండ్రుల వల్లే ఇలా లగ్జరియస్‌గా బతుకుతున్నారనే విషయం పదే పదే చెబుతాను. డబ్బు విలువ తెలిపేందుకు ఎంత చిరాకు తెచ్చుకున్నా సరే.. వాళ్ల పాకెట్ మనీలో కొంత భాగం అడుగుతుంటానని చెబుతోంది." కాజోల్. ప్రతి తల్లిదండ్రలు ఇలా వ్యవహరిస్తే.. పిల్లల బంగారు భవిష్యత్తును ఎలాంటి మచ్చ లేకుండా శోభాయమానంగా ఉంటుందని నమ్మకంగా చెబుతోంది.
(చదవండి: ఒకప్పుడు ట్రాన్స్ జెండర్‌గా బిక్షాటన ..నేడు ఒక అమ్మాయిని దత్తత తీసుకుని..!)
Comments
Please login to add a commentAdd a comment