
Priyanka Chopra Shares First Photo As Mother: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తర్వాత హాలీవుడ్‌లో అడుగు పెట్టి అందరి మన్ననలు పొందుతోంది. పలు చిత్రాల్లో నటించి హాలీవుడ్‌లో సైతం మంచి పాపులారిటీని దక్కించుకుంది. అనంతరం 2018లో రాజస్థాన్‌లో పాప్ సింగర్, నటుడు నిక్ జోనాస్‌ను వివాహం చేసుకుంది. హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం వీరి వివాహం జరిగింది. ఇటీవలే సరోగసి పద్ధతి ద్వారా జనవరి 22న ప్రియాంక, నిక్ జోనాస్ తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. ప్రియాంక తల్లి అయిన తర్వాత తన మొదటి పోస్ట్‌ను షేర్ చేసింది.
మిర్రర్ సెల్ఫీ తీసుకున్న పిక్‌ను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది ప్రియాంక. అది సన్ కిస్డ్ ఫొటోలా అందంగా ఉంది. కొంచెం మేకప్, బ్లాక్ సన్‌గ్లాసెస్‌తో కార్ రైడ్ చేస్తూ ఈ ఫొటో దిగింది. ఈ పిక్కు 'కాంతి సరిగ్గా అనిపిస్తుంది' అని క్యాప్షన్ రాసింది. ఈ పోస్ట్ చూసిన అభిమానులు మమ్మీ అని పిలవడం దగ్గర్నుంచి ప్రియాంక అందాన్ని వర్ణించడం వరకు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కొందరు మాత్రం మీ బిడ్డను ఎప్పుడు చూపిస్తారని అడుగుతున్నారు. పోస్ట్‌ను షేర్ చేసిన కొన్ని గంటల్లోనే సుమారు 8 లక్షల లైక్‌లు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment