గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తర్వాత హాలీవుడ్‌లో అడుగు పెట్టి అందరి మన్ననలు పొందుతోంది. పలు చిత్రాల్లో నటించి హాలీవుడ్‌లో సైతం మంచి పాపులారిటీని దక్కించుకుంది. అనంతరం 2018లో రాజస్థాన్‌లో పాప్ సింగర్, నటుడు నిక్ జోనాస్‌ను వివాహం చేసుకుంది. హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం వీరి వివాహం జరిగింది. అయితే తాను ఎక్కడికెళ్లినా, ఎంత ఎత్తుకి ఎదిగినా తనతోపాటే ఇండియా, భారతదేశ సంస్కృతి ఉంటుందని ఇటీవల చెప్పుకొచ్చింది ప్రియాంక. తన అస్థిత్వాన్ని, గుర్తింపును ఏ ఒక్కరూ తక్కువ చేయకుండా ఎప్పటికప్పుడూ ఎదుగుతూ ముందుకు సాగుతోంది.
(చదవండి: ప్రియాంక చోప్రా అరుదైన ఘనత.. 30కిపైగా)
అయితే తాజాగా ప్రియాంక తాను మొదటి సారి మంగళ సూత్రం ధరించినప్పుడు కలిగిన అనుభూతిని చెప్పుకొచ్చింది. ఓ బ్రాండ్ ప్రమోషన్స్‌లో భాగంగా మంగళసూత్రం విలువ గురించి తెలిపింది. 'నేను మంగళ సూత్రం మొదటి సారి ధరించడం నాకు గుర్తుంది. ఎందుకంటే దాని విలువ ఏంటో, దాని అర్థం ఏంటో చెబుతూ నన్ను పెంచారు. అది నాకు చాలా ప్రత్యేకమైన క్షణం. ఒక ఆధునిక మహిళగా, దాని ధరించడం వల్ల వచ్చే పరిణామాలను కూడా నేను అర్థం చేసుకున్నాను. మంగళ సూత్రాన్ని నల్లని పూసలతో చేసేవారు. చెడును దూరం చేసి, మిమ్మల్ని రక్షించడానికి నలుపు చిహ్నంగా ఉంటుంది. మంగళ సూత్రం ధరించడం నాకు ఇష్టమా కాదా, అది పితృస్వామ్య వ్యవస్థకి నిదర్శనమా అనేది నాకు తెలియదు. ఈ వాదనలో నేను మధ్యలో ఉంటాను. సాంప్రదాయాన్ని గౌరవించి కొనసాగించండి. అలాగే మీరు ఎవరో, మీకు ఏం కావాలో తెలుసుకోండి. అందుకోసం నిలబడండి.' అంటూ తన మదిలోని భావాలను తెలిపింది ప్రియాంక.
(చదవండి: ప్రియాంక చోప్రా: ఇండియాను నా నుంచి విడదీయలేరు.. ఎందుకంటే)
Comments
Please login to add a commentAdd a comment