Bank Cards
-
ఇవి నా కార్డు డీటైల్స్.. నచ్చింది కొనుక్కోండి
పక్కవాళ్ళకు ఒక్క రూపాయి ఇవ్వడానికే చాలామంది ఆలోచిస్తారు. అలాంటి ఈ రోజుల్లో బ్యాంక్ కార్డు డీటైల్స్ పెట్టి, నచ్చింది కొనుక్కోండి అంటూ ఓ వ్యక్తి బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఇంతకీ ఎవరా వ్యక్తి? ఇందులో నిజమెంత ఉంది? అనే మరిన్ని వివరాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.బోల్డ్ కేర్ కో-ఫౌండర్ 'రాహుల్ కృష్ణన్' సోమవారం (సెప్టెంబర్ 2)న తన బ్యాంక్ కార్డు వివరాలను తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. నచ్చింది కొనుక్కోండి అంటూ.. రూ.1000 లిమిట్ పెట్టారు. ఇది చూసినవారు మొదట్లో నమ్మలేదు, కానీ రాహుల్ కృష్ణన్ ఓటీపీలను కూడా షేర్ చేశారు. ఈ విషయం తెలిసి చాలామంది ఆ కార్డు వాడటం మొదలు పెట్టారు. లెక్కకు మించిన జనం ఆ కార్డును వాడటం వల్ల బ్యాంక్ దానిని బ్లాక్ చేసినట్లు సమాచారం.రాహుల్ కృష్ణన్ మరో ట్వీట్ చేస్తూ.. నా నెంబర్ బ్లాక్ చేశారు అని వెల్లడించారు. అయితే ఐదు గంటల్లో సుమారు 200 మంది ఈ కార్డును ఉపయోగించుకున్నట్లు సమాచారం. ఇందులో ఎక్కువమంది స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, అమెజాన్ వంటి వాటిలో కొనుగోళ్లు చేసినట్లు తెలుస్తోంది.I think my number is blocked so no more otps unfortunately :(( https://t.co/qR2LeGdWom— Rahul Krishnan (@oneandonlyrk) September 2, 2024 -
భీమ్ యాప్ వాడితే, పెట్రోల్‌పై డిస్కౌంట్
సాక్షి, న్యూఢిల్లీ : ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలు స్కై రాకెట్లా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయం క్రూడ్ ఆయిల్ ధరల ప్రభావంతో పాటు దేశీయంగా పన్నులు వంటి కారణాలతో ఇంధన ధరలు కొండెక్కుతున్నాయి. రోజువారీ ఇంధన ధరల సమీక్ష దగ్గర్నుంచి రేట్లు మరింత పెరుగుతున్నాయి. అయితే ఈ పెరుగుతున్న ధరలపై కాస్త ఉపశమనం కల్పించే వార్తను ప్రభుత్వం వెలువరించింది. ప్రభుత్వం లాంచ్ చేసిన భీమ్ లేదా భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ యాప్‌ను ఇంధన చెల్లింపులకు వాడితే, లీటరు పెట్రోల్‌పై 49 పైసలు, లీటరు డీజిల్‌పై 41 పైసల డిస్కౌంట్‌ను అందించనున్నట్టు ప్రకటించింది. డిజిటల్ ఇండియా అధికారిక అకౌంట్ ఈ ప్రకటన చేసింది. అంతేకాక బ్యాంకు కార్డులకు కూడా ఈ డిస్కౌంట్లు వర్తించనున్నాయట. ఇటీవల అమెరికాలో సంభవించిన ఇర్మా, హార్వే తుఫాన్ల కారణంతో అంతర్జాతీయంగా రిఫైనరీ అవుట్‌పుట్ 13 శాతం మేర తగ్గిపోయింది. ఈ ప్రభావంతో గ్లోబల్‌గా క్రూడ్ ఆయిల్ ధరలు 15 శాతం మేర పైకి ఎగిశాయి. మరోవైపు పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్స్చేంజ్ డ్యూటీలను కోత పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. కానీ వచ్చే నెల దీపావళి వరకు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గబోతున్నాయంటూ పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.