మూడేళ్లలో రూ.2,000 కోట్ల ఆదాయం! | Keltan Tech Solutions Co-Founder, Managing Director Krishna cintam Revealed | Sakshi
Sakshi News home page

మూడేళ్లలో రూ.2,000 కోట్ల ఆదాయం!

Published Tue, Sep 1 2015 2:24 AM | Last Updated on Sun, Sep 3 2017 8:29 AM

మూడేళ్లలో రూ.2,000 కోట్ల ఆదాయం!

మూడేళ్లలో రూ.2,000 కోట్ల ఆదాయం!

- ఈ ఏడాది చివరకు రూ.600 కోట్లకు..
- త్వరలో క్విప్ జారీ ద్వారా 15-20 మిలియన్ డాలర్ల నిధుల సమీకరణ
- కెల్టాన్ టెక్ సొల్యూషన్స్ కో-ఫౌండర్, ఎండీ కృష్ణ చింతం వెల్లడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:
ఐటీ ఆధారిత సేవలనందిస్తున్న కెల్టాన్ టెక్ రానున్న మూడేళ్లలో రూ.2,000 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది ముగింపు నాటికి రూ.600 కోట్లకు చేరుకుంటామని కంపెనీ కో-ఫౌండర్, ఎండీ కృష్ణ చింతం ధీమావ్యక్తం చేశారు. సంస్థ 2014-15 ఆర్థిక ఫలితాలను సోమవారమిక్కడ విలేకరులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది (జులై 2014-జూన్ 2015) 79 శాతం ఆదాయ వృద్ధి రేటును కనబరిచామన్నారు. అంటే గతేడాది 133.7 కోట్లుగా ఉన్న ఆదాయం.. ఈ ఏడాదికి 239.64 కోట్లకు చేరుకుందన్నారు. ఏటా నికర ఆదాయంలోనూ గణనీయమైన వృద్ధిని సాధిస్తున్నామన్నారు.

గతేడాది నికర ఆదాయం 6.36 కోట్లుగా ఉంటే.. ఈ ఏడాదికది 22.07 కోట్లకు చేరిందన్నారు. కంపెనీ ఆదాయ గణాంకాల్లో 65 శాతం అమెరికా నుంచి, మిగతాది ఇండియా వాటా ఉంటుందన్నారు. ఈ ఏడాది ముగింపు నాటికి క్విప్ జారీ ద్వారా 15-20 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించనున్నట్లు చెప్పారు. ఈ నిధులతో మరో టెక్నాలజీ కంపెనీని కొనుగోలు చేయనున్నట్లు పేర్కొన్నారు. అమెరికా, ఇండియాకు చెందిన రెండేసి కంపెనీలతో చర్చలు చివరి దశలో ఉన్నాయని.. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు. ఇటీవలే అమెరికాకు చెందిన ప్రొసాఫ్ట్ టెక్నాలజీ కంపెనీని కొనుగోలు చేశామని.. ఈ కొనుగోలు తర్వాత సంస్థ గణనీయమైన వృద్ధిని సాధించిందన్నారు. ప్రస్తుతం సంస్థలో వెయ్యి మంది ఉద్యోగులు ఉన్నారని.. మూడేళ్లలో మూడింతలకు చేరుస్తామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement