కాబూల్: అఫ్గాన్‌లో కొత్త ప్రభుత్వాన్ని కొలువు తీర్చేందుకు తాలిబన్ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ శనివారం కాబూల్‌కు చేరుకున్నారు. తాలిబన్ దళాధిపతులు, విధాన నిర్ణేతలు, మత పెద్దలు, అష్రాఫ్ ఘనీ ప్రభుత్వంలోని ముఖ్య నేతలతో బరాదర్ చర్చించనున్నారని తాలిబన్ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. ‘వచ్చే కొద్ది వారాల్లోపు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడంతోపాటు, కొత్త పరిపాలనా విధానంతో సిద్ధంగా ఉన్నాం. పశ్చిమ దేశాలు నిర్వచించినట్లుగా ప్రజాస్వామ్య రూపురేఖల్లో నూతన ప్రభుత్వం ఉండబోదుగానీ ప్రభుత్వం ప్రతి పౌరుడి హక్కులను పరిరక్షిస్తుంది’ అని రాయిటర్స్ వార్తా సంస్థకు ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment