Dennis Austin పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ సహ-సృష్టికర్త డెన్నిస్ ఆస్టిన్ (76) ఇక లేరు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన సెప్టెంబర్ 1న కన్ను మూశారు. కాలిఫోర్నియాలోని లాస్ ఆల్టోస్‌లోని తన ఇంటిలో తుదిశ్వాస విడిచారని మైఖేల్ ఆస్టిన్ తెలిపారు. దీంతో ఆయన మృతిపై పలువురు టెక్ దిగ్గజాలు సంతాపం ప్రకటించారు.
ఆధునిక సమాజంలో సమాచారం కమ్యూనికేషన్ కోసం ‘పవర్ పాయింట్’ కీలకమైన సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు డెన్నిస్ ఆస్టిన్. ఫోర్‌థాట్ అనే చిన్న సాఫ్ట్‌వేర్ సంస్థ ద్వారా 1987లో దీన్ని విడుదల చేశారు. పవర్‌పాయింట్ ఓవర్‌హెడ్ ప్రొజెక్టర్‌లకు డిజిటల్ వారసుడిగా , స్లయిడ్‌లను రూపొందించే శ్రమతో కూడిన ప్రక్రియను సులువుగా మార్చేశారాయన. ఫోర్‌థాట్‌ను రూపొంచిన ఎగ్జిక్యూటివ్ రాబర్ట్ గాస్కిన్స్‌తో కలిసి డెన్నిస్ ఆస్టిన్ ఈ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశారు. మైక్రోసాఫ్ట్ బిజినెస్ ప్రోగ్రామ్ మేనేజర్ అయినషున్ గ్రేవాల్, 2016లో కంపెనీ వార్షిక వాటాదారుల సమావేశంలో పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్‌ను ప్రదర్శించారు. పవర్‌పాయింట్ ఇప్పుడు రోజుకు 30 మిలియన్లకు పైగా ప్రెజెంటేషన్‌లను రూపొందించడానికి ఉపయోగించబడుతుంతోని కంపెనీ తెలిపింది.
1947, మే 28న పిట్స్‌బర్గ్‌లో జన్మించిన డెన్నిస్ ఆస్టిన్ MIT అండ్ UC శాంటా బార్బరా లో ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకున్నారు. తరువాత సాఫ్ట్‌వేర్ కంపెనీ ఫోర్‌థాట్‌లో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా చేరి పవర్‌పాయింట్‌ను కో-డెవలప్ చేశారు. మైక్రోసాఫ్ట్ కొన్ని నెలల తర్వాత ఈ కంపెనీని కొనుగోలు చేసింది. ఆస్టిన్ 1985 - 1996 వరకు అతను పదవీ విరమణ చేసేనాటికి PowerPoint ప్రాధమిక డెవలపర్‌గా పనిచేశారు.
కాగా ప్రెజెంటేషన్‌ల కు సంబంధించి కీలక సాఫ్ట్‌వేర్‌గా పాపులర్ అయిన పవర్ పాయింట్‌కి 36-సంవత్సరాల చరిత్ర ఉన్నప్పటికీ, PowerPoint ప్రజెంటేషన్‌కు వ్యతిరేకులు కూడా ఉన్నారు. జెఫ్ బెజోస్ , స్టీవ్ జాబ్స్ దీన్ని వ్యతిరేకించారు. ఏమి మాట్లాడుతున్నారో తెలిసినవాళ్లకి పవర్ పాయింట్ అవసరం లేంటూ జాబ్స్ తన జీవిత చరిత్రలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment