Power Point
-
పవర్ పాయింట్ సహ- సృష్టికర్త డెన్నిస్ ఆస్టిన్ ఇకలేరు
Dennis Austin పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ సహ-సృష్టికర్త డెన్నిస్ ఆస్టిన్ (76) ఇక లేరు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన సెప్టెంబర్ 1న కన్ను మూశారు. కాలిఫోర్నియాలోని లాస్ ఆల్టోస్‌లోని తన ఇంటిలో తుదిశ్వాస విడిచారని మైఖేల్ ఆస్టిన్ తెలిపారు. దీంతో ఆయన మృతిపై పలువురు టెక్ దిగ్గజాలు సంతాపం ప్రకటించారు. ఆధునిక సమాజంలో సమాచారం కమ్యూనికేషన్ కోసం ‘పవర్ పాయింట్’ కీలకమైన సాఫ్ట్వేర్ డెవలపర్‌గా రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు డెన్నిస్ ఆస్టిన్. ఫోర్‌థాట్ అనే చిన్న సాఫ్ట్వేర్ సంస్థ ద్వారా 1987లో దీన్ని విడుదల చేశారు. పవర్‌పాయింట్ ఓవర్‌హెడ్ ప్రొజెక్టర్లకు డిజిటల్ వారసుడిగా , స్లయిడ్లను రూపొందించే శ్రమతో కూడిన ప్రక్రియను సులువుగా మార్చేశారాయన. ఫోర్థాట్ను రూపొంచిన ఎగ్జిక్యూటివ్ రాబర్ట్ గాస్కిన్స్తో కలిసి డెన్నిస్ ఆస్టిన్ ఈ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశారు. మైక్రోసాఫ్ట్ బిజినెస్ ప్రోగ్రామ్ మేనేజర్ అయినషున్ గ్రేవాల్, 2016లో కంపెనీ వార్షిక వాటాదారుల సమావేశంలో పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్‌ను ప్రదర్శించారు. పవర్‌పాయింట్ ఇప్పుడు రోజుకు 30 మిలియన్లకు పైగా ప్రెజెంటేషన్లను రూపొందించడానికి ఉపయోగించబడుతుంతోని కంపెనీ తెలిపింది. 1947, మే 28న పిట్స్‌బర్గ్‌లో జన్మించిన డెన్నిస్ ఆస్టిన్ MIT అండ్ UC శాంటా బార్బరా లో ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకున్నారు. తరువాత సాఫ్ట్వేర్ కంపెనీ ఫోర్‌థాట్‌లో సాఫ్ట్వేర్ డెవలపర్‌గా చేరి పవర్‌పాయింట్‌ను కో-డెవలప్ చేశారు. మైక్రోసాఫ్ట్ కొన్ని నెలల తర్వాత ఈ కంపెనీని కొనుగోలు చేసింది. ఆస్టిన్ 1985 - 1996 వరకు అతను పదవీ విరమణ చేసేనాటికి PowerPoint ప్రాధమిక డెవలపర్‌గా పనిచేశారు. కాగా ప్రెజెంటేషన్ల కు సంబంధించి కీలక సాఫ్ట్‌వేర్‌గా పాపులర్ అయిన పవర్ పాయింట్‌కి 36-సంవత్సరాల చరిత్ర ఉన్నప్పటికీ, PowerPoint ప్రజెంటేషన్‌కు వ్యతిరేకులు కూడా ఉన్నారు. జెఫ్ బెజోస్ , స్టీవ్ జాబ్స్ దీన్ని వ్యతిరేకించారు. ఏమి మాట్లాడుతున్నారో తెలిసినవాళ్లకి పవర్ పాయింట్ అవసరం లేంటూ జాబ్స్ తన జీవిత చరిత్రలో పేర్కొన్నారు. -
రాజధానుల రాయబారిగా దినకరన్
సాక్షి ప్రతినిధి, చెన్నై: కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలకు మధ్య అధికారిక రాయబారిని సిద్ధం చేసుకుంటోంది అన్నాడీఎంకే ప్రభుత్వం. పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ను రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక మంత్రిగా కేంద్ర, రాష్ట్ర రాజధానుల మధ్య వారధిగా నియమించనున్నట్టు సమాచారం. సీఎంతో సమానంగా ప్రభుత్వంలో మరో పవర్ పాయింట్ రూపుదిద్దుకుంటోంది. జయలలిత మరణం తరువాత పార్టీ, ప్రభుత్వాల్లో చక్రం తిప్పాలనుకున్న చిన్నమ్మకు సీఎం సీటు తృటిలో చేజారిపోయింది. అక్రమాస్తుల కేసులో అనూహ్యరీతిలో ఆమె జైలు పాలయ్యారు. తన కనుసన్నల్లో మెలిగే ప్రభుత్వం ఏర్పడినా ప్రత్యక్ష పెత్తనం సాగించే అవకాశం లేకుండా పోయింది. దీంతో ప్రధాన కార్యదర్శి శశికళ తన ప్రతినిధి గా అక్క కుమారుడు దినకరన్‌కు ఉప ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టింది. బెంగళూరు పరప్పర అగ్రహార జైలు నుంచి శశికళ ఆదేశాలను దినకరన్ అమలు చేస్తున్నారు. పార్టీపై దినకరన్ పూర్తిస్థాయి పెత్తనం చెలాయిస్తున్నా ప్రభుత్వంతో అధికారిక సంబంధం లేకుండా పోయింది. ఇదిలా ఉండగా, రాష్ట్ర మంత్రులు దిండుగల్లు శ్రీనివాసన్, సెంగోట్టయ్యన్, కామరాజ్, సెల్లూరు రాజా మంగళవారం బెంగళూరు వెళ్లి శశికళను కలిశారు. ఈ సందర్భంగా పార్టీ, ప్రభుత్వానికి సంబంధించి శశికళ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రధాని కుర్చీలో మన్మోహన్ సింగ్‌ను కూర్చోబెట్టి పెత్తనమంతా పార్టీ అధ్యక్షురాలి హోదాలో సోనియాగాంధీ సాగించిన రీతిలో రాష్ట్ర రాజకీయాలను శాసించాలని శశికళ ఒక ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్రస్థాయిలో అలాంటి ప్రయత్నం వీలుకాదని శశికళకు సర్దిచెప్పారు. ఇక తన మనిషిగా ఉన్న ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నా, ప్రభుత్వ కార్యకలాపాలకు దూరంగా ఉండక తప్పడంలేదనే కోణంలో శశికళ ఆలోచిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో దినకరన్‌కు అధికారిక హోదా కల్పించాలనే నిర్ణయానికి శశికళ వచ్చినట్లు సమాచారం. దినకరన్ కోసం కేబినెట్ మంత్రి హోదాలో ఒక నామినేటెడ్ పదవిని సృష్టించి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఢిల్లీలో ఉంచేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఢిల్లీలో తమిళనాడు భవన్లో కొంత భాగాన్ని దినకరన్ కార్యాలయంగా మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు ప్రభుత్వానికి సంబంధించి అన్నిరకాల లావాదేవీలపై కేంద్ర మంత్రులు, అధికారులకు దినకరన్ అందుబాటులో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ప్రణాళిక సిద్ధం అవుతోంది. అలాగే రాష్ట్ర మంత్రులు, అధికారులు సైతం దినకరన్ అధికార పరిధిలోకి తీసుకురానున్నారు.చెన్నై సచివాలయంలో దినకరన్‌కు ఒక ప్రత్యేక కార్యాలయాన్ని సిద్ధం చేయనున్నారు. ఈ రకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిగా పనిచేసేందుకు దినకరన్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ రకంగా సీఎం ఎడపాడి పళనిస్వామితో సమానంగా ప్రభుత్వంలో మరో పవర్ పాయింట్ రూపుదిద్దుకుంటోంది. ఇందుకు సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన విడుదల అవుతుందని తెలుస్తోంది. -
కృష్ణాజలాల పనులను పూర్తి చేయాలి
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలోని 959 పాఠశాలల్లో శుద్ధిచేసిన కృష్ణజలాల పనులు యుద్ధప్రాతిపదికపై పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎన్.ముక్తేశ్వరరావు కోరారు. కలెక్టర్ సోమవారం అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. నాంపల్లి, మర్రిగూడ మండలాల్లో బోరు నీటితో మధ్యాహ్న భోజనం వండుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని, వెంటనే ఆకస్మిక తనిఖీలు జరిపి తగు చర్యలు తీసుకుంటామన్నారు. కుదాభక్షపల్లి గ్రామంలో నీరులేదనే కారణంతో నెల రోజులుగా మధ్యాహ్న భోజనం వండకపోవడంపై సంబంధిత ఎంఈఓకు చార్జీ మెమో జారీ చేయాలని డీఈఓను ఆదేశించారు. మధ్యాహ్న భోజన పథకం అమలుపై పాఠశాలలను తనిఖీ చేయాలని డీఈఓను కోరారు. ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తులకు మెడికల్ కిట్లు, ఫిజియోథెరఫి పరికరాలు సరఫరాలో జాప్యం చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రత్యేక ఆఫీసర్లందరూ తమ మండలంలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని నూరుశాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేయాలని కోరారు. బాలిక సంరక్షణ యోజన పథకం కింద తయారైన బాండ్లు వెంటనే లబ్ధిదారులకు పంపిణీ చేయాలని సూచించారు. ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలపై ప్రజల హృదయాలకు హత్తుకుపోయేలా కలెక్టర్ క్యాంపు ఆఫీసు ప్రహరీగోడపై వాల్ రైటింగ్ చేపట్టాలని కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను కోరారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వివిధ శాఖలు శకటాలను ప్రదర్శించాలని, స్టాల్స్ ఏర్పాటు చేసి లబ్ధిదారులకు రుణాలు, ఆస్తులు పంపిణీకై చర్యలు తీసుకోవాలని కోరారు. మెరిట్ సర్టిఫికెట్ల విషయంలో సిబ్బంది సేవలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోరారు. అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివిధ శాఖలు రూపొందించిన పథకాలను కలెక్టర్ పరిశీలించి ఎంపిక చేశారు. ఈ సమావేశంలో జేసీ హరిజవహర్‌లాల్, అదనపు జేసీ నీలకంఠం, డ్వామా పీడీ కోటేశ్వర్రావు, డీఆర్డీఏ పీడీ రాజేశ్వర్‌రెడ్డి, డీఆర్ఓ అంజయ్య, జెడ్పీ సీఈఓ వెంకట్రావ్ పాల్గొన్నారు.